User Tools

Site Tools


ఇదీ_లోకం

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

Next revision
Previous revision
ఇదీ_లోకం [2011/11/19 17:09]
bhuvan created
ఇదీ_లోకం [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
- పాముపగ+                          జాబులు చదివే ​గాడిద
  
 +  రామలింగడి పొరుగింటిలో తాతాచారి ఉండే వాడు. తాతాచారి పిసినారి.పైగా తగువులమారి.రామలింగడికీ తాతాచారికీ పడేది కాదు.
 +ఒక రోజు రామలింగడు జాబు రాయడం తాతాచారి చూచాడు.జాబులో ఏమి ఉందో చూడాలని ఆరాటం కలిగింది.
 +తాతాచారి దొంగ చాటుగా రామలింగడి వెనక చేరాడు.వంగి వంగి జాబు చూడసాగాడు.లోలోపల చదవ సాగాడు.రామలింగడు ఇది గమనించాడు.
 +జాబులో ఇలా రాసాడు.
 +నా వెనక ఒక గాడిద ఉంది.దానికి పరాయి జాబులు చదవడం అలవాటు.చాలా సంగతులు రాయాలని ఉంది.అయితే గాడిదకు ఈ సంగతులు తెలియడం బాగుండదు.అందుకే రాయడం లేదు.అని జవాబు ముగించాడు.తాతాచారి ఇది కూడా చదివాడు.కోపంతో ఊగిపొయాడు.అయితే పాపం ఏం చేయగలడు?​
 +రెండో కంటికి తెలియకుండా పారిపొయాడు.
  
-నా పసితనంలో ఒక సంగతి జరిగింది. మేము అయిదారు మందిమి ఆడుకోవడానికి బయలు దేరాం. పొలాలలో చాలా దూరం పోయాం. 
- ఒక చేను కంపలో ఒక పాము కనపడింది. పాము పాము అంటూ అంతా అరిచాం. తలా ఒక రాయి దానిపైకి విసిరాం. వాటిలో నా రాయి దానికి తగిలింది. అది పారిపోయింది. 
- అది నాగుపాము. నీమీద పగ పడుతుంది. మన మాటలలో అది నీపేరు కూడా వినింది. పగ తీరేదాకా ఆహారం తాకదు. అంటూ అందరూ బెదిరించారు. 
- నేను బెదిరి పోయాను. ఆనాటి నుంచి నాకు కలలో పాములు కనిపించేవి. పాము పేరు చెపితే చెమట పోసేధి. పాము కధలంటే నేను పారిపోయే వాడిని. 
- కాలం గడిచింది. ఇంత వాడిని అయినాను. నాకు ఏమి కాలేదు. కాని ఆనాటి భయం వలన ఈ నాటికీ కలలోపాములు కనబడుతుంటాయి. 
- పాముల గురించి చాలా సంగతులు చదివాను. పాముకు మనిషి అంటే భయం. కనపడితే ఆమడ దూరం పారిపోతుంది. 
- పాము పగలో నిజం లేదు. దాని కంత తెలివి లేదు. ఈ సంగతులు తెలిసాయి. 
- అనవసరంగా ఎంత నరకం అనుభవించానో చూడండి. 
  
  
- బడిలో ​శవం+                            ఆశకు పోతే?​
  
-అవి నేను మూడో తరగతి చదివే ​రోజులు. అంటే నాకు ఎనిమిదో ఏడు. బడికి ​పోదామని బయలు దేరాను. దారిలో నలుగురం కూడాము. +ఒక పులి ముసలిదయి పోయింది.వేటాడ డానికి దానికి బలం లేదు.తిండి ఎలాగా అని ఆలోచించింది. 
- బడి చేరగానే టకీమని ఆగిపోయాము. మా బడి వరండాలో ​ఒకటే ఏడుపులు. ​అరుపులు. అంతా గొడవగా ​వుంది. +అది ఒక బంగారు ​కడియం సంపాదించింది.చెరువు దరిన చేరింది. 
- అసలు సంగతి ఏమంటే ఎవరో చనిపోయారు. అతనికి ​ఏధో రోగమట. టవునుకు తీసుకొనిపోతే చని ​పోయాడట. +ఒక ​బాటసారి ​అ దారిన ​పోతుండగా ​పులి చూసింది. 
- వారం మంచిది కాదట. శవం ​ఇంటిలో వుండకూడదట. అందుకని బడి ​వరండాలో వుంచారు. +ఓ నరుడా! ​అని పిలిచింది. 
- ఇంక ​ఏముంది? ఆ రోజు బడికి సెలవు. అందరం ఆడుకోడానికి పోయాము. ఆరోజంతా మాకు ​ఏవేవో ఆలోచనలు ​మెదిలాయి. +ఇదుగో బంగారు కడియం.నీకు ​దానం చేయాలని ఉంది ​తీసుకో ​అనింది. 
- శవం ఇంటిలో ​వుంచడం మంచిది కాదుగదా? బడిలో ​వుంచడం ఎలా ​అవుతుంది? +బాటసారికి కడియం చూసి అశ కలిగింది.పులిని చూసి భయం ​కలిగింది. 
- ఏ జంతువు చనిపోయినా భయపడం గదా? మనిషి ​శవం అంటే భయం దేనికి? +నీవు పులివి! చంపుతావు అంటూ ఆగి పోయాడు. 
- బడి అందరికీ ​గుడి ​గదా! బడి అంటే అంత ​లోకువ దేనికీ? +పులి అతడి ​ఆశను గమనించింది. 
- వీటికి జవాబులు మాకు దోరకలేదు. మీరు చెపుతారా?​+నేను ​ఇంతకు ముందు ​చాలా పాపాలు చేసాను.ముసలి దానిని అయినాను.నాకు ​కోరలు లేవు.శరీరంలో ​బలం కూడ లేదు.దానం చేసి పాపం నుంచి ​బయట పడాలని ఉంది.ఈ రకంగా ​అయినా పైలోకాలకు పోతాను.నా మాటలలో మోసం లేదు.రా! చెరువులో మునుగు.ఈ కడియం దానంగా ​తీసుకో!అనింది. 
 +బాటసారికి బయం ​వుంది.కాని ​ఆశ చావలేదు.పోయి చెరువులో ​దిగాడు.బురదలో దిగబడి ​పోయాడు. 
 +నేను పైకి లాగుతాను ​అంటూ పులి చెరువులో ​దిగింది.బాటాసారిని చంపి తినేసింది. 
 +మోసగాడి వలలో ​పడితే ఏమవుతుందో చూసారా?
  
  
-  
  
  
Line 31: Line 31:
  
  
 +                       ​  ​        ​కాసులు కాచిన మొలక
  
 +అనగనగా ఒక రాజు.ఆ రాజు రోజూ వేటకు పోయేవాడు.
 +ఒక రోజు ఒక వింత జరిగింది.ఒక ముసలివాడు మామిడి మొలక నాటడం రాజు కంట పడింది.
 +రాజు ఎగతాలి చేసాడు.
 +తాతా!ఎంత అమాయకుడివి!ఈ మొలక పెరిగేది ఏనాటికి?​ కాయలు కాచేది ఏనాటికి?​ అందాకా నువు బతుకుతావా?​ అని అడిగాడు.
 +రాజా! ఒక నాటికి ఈ మొలక మానవుతుంది.అంతదాకా నేను ఉంటానని కాదు.కాయలు నా కొడుకు తింటాడు.కూతురు తింటుంది.మనవలు తింటారు.
 +ఒక రోజు మన తాతలు నాటారు.వాటి కాయలే గదా మనం తినేది!
 +ఏపని అయినా మన కోసమే చేయాలా?​అందరూ అలాగే అనుకుంటే ఏమవుతుంది?​ఈ లోకం ఇంత దూరం రాగలిగేదా?​అని తాత అనే సరికి రాజు తలదించాడు.
 +తాత మాటలు రాజు గుండెకు తగిలాయి.ఎంత మంచి మాటలు!ఎంత మంచి మనసు?​రాజు మనసు ఆనందంతో నిండిపోయింది.కానుకగా తాతకు పది బంగారు కాసులు అందించాడు.
 +చూచావా రాజా!ఈ మొలక నాటిన రోజే కాసులు కాచింది.అంటూ తాత సంబరపడి పోయాడు.
  
  
 +                                ఏ కాలం మంచిది?​
  
 +అనగనగా ఒక రాజు.ఆయనకు ఒక అనుమానం కలిగింది.వెంటనే అందరినీ పిలిచాడు.కొలువు దీరాడు.
 +ఎండాకాలం,​వానాకాలం,​చలికాలం,​ఇలా చాలా కాలాలు గదా!వీటిలో ఏ కాలం మంచిది?​అని అడిగాడు.
 +రాజుగారి మనసులో ఏమి ఉందో?​ఆయనకు ఏ కాలం మంచిదో ఎవరికి తెలుసు?​అందుకని ఎవరూ పలకలేదు.
 +చివరకు ఒక ముసలాయన లేచాడు.తమరు కోపగించక పోతే చెపుతా!అని నసిగాడు.
 +భయంలేదు.నీ మనసులోది తెలుపు.అనినాడు రాజు.
 +రాజా!కలిగిన వాడికి ఏకాలమయినా మంచిదే.ఎ కాలం వసతులు ఆకాలంలో ఉంటాయి.
 +ఏ బధయినా పేదవాడికే.పేదవాడికి ఏ కాలమయినా గండమే.ఎండాకాలం ఏండల బాధ.వానాకాలం వరదల బాధ.చలికాలం ఎముకల కొరికే చలిబాధ.
 +అందుకని కాలానికి మంచీలేదు,​చెడూ లేదు.అని ముసలాయన ముగించాడు.
 +రాజుగారి మొగం మాడిపోయింది.కొలువు ముగించి లేచి పోయాడు.
  
  
 +                              గాడిద దొరికింది
  
- చదవాలని వుంటే+ఏడుకొండలు అమాయకుడు.వాడికి ఎవరూ లేరు.ఆ ఊరూ ఈ ఊరూ తిరగతాడు.చివరకు ఒకరు చేరదీసారు.గాడిదలు మేపడానికి పంపారు. 
 +ఏడుకొండలు ​వాటిని మేపుతూ తిరగసాగాడు,​తిరిగి తిరిగి అలసిపోయాడు.ఒక గాడిద మీద కూచుని ​మిగతావి తోలసాగాడు. 
 +కొంతదూరం పోయాడు.గాడిదలు ఏడూ లేవేమో అని అనుమానం కలిగింది.ఒకటి,​రెండు,​మూడు,​నాలుగు,​అయిదు,​ఆరు,​ఏడోది ఏది? కనిపించడం లేదు. 
 +ఒక గాడిద పోయింది.ఇంటికి పోతే తంతారు.ఏడుకొండలికి భయం వేసింది.దిగులుగా గాడిద మీద నుంచి దిగాడు. 
 +నడుచుకుంటూ నాలుగు వైపులా వెతికాడు.కొంతసేపటికి మరోసారి ఎంచాడు. 
 +ఏడు గాడిదలు సరిపోయాయి.ఎగిరి గంతేసాడు. 
 +కొంతదూరం పోయాక నడవలేక పోయాడు.పాదాలు మంట.నడుములు తీత.ఈ సారి ఇంకొక గాడిద మీద కూచొని తోలసాగాడు. 
 +గాడిదలు ఏడు లేవేమో అని అనుమానం కలిగింది.ఎంచాడు.ఆరు గాడిదలే!ఏడోది ఏది? లేదు పోయింది.ఏడు కొండలు దిగులు పడిపోయాడు. ఏడిచాడు. 
 +దిగి వెతుకుతూ నడవసాగాడు.భయంగా ఉంది.తంతారేమో!ఏం చేయాలి?​ ఆమూల ఈ మూల చూచాడు.ఇంకొకసారి ఎంచాడు. 
 +ఇపుడు ఏడూ సరిపోయాయి.గాడిద దొరికింది.ఇంక గాడిద మీద కూచోను.నేను కూచుంటే ఒకటి మాయమవుతుంది.అనుకుంటూ,​నడుచుకుంటూ ఏడుకొండలు ఇంటికి చేరాడు.
  
-మాకు రెండు మేకలు వుండేవి. వాటిని నేను కాచే వాడిని. రోజూ మేకలు తోలుకొని పొలం పోయేవాడిని. 
- పొలానికి పోవాలంటే బడి మీదగా పోవాలి. పోతూ పోతూ బడి కిటికీలోంచి చూచేవాడిని. 
- నావయసు వారాంతా బడిలో వుండేవారు. వారు చదవడం వినబడేద. రాయడం కనబడేది. 
- చదువు కొంటే ఎంత బాగుండు అని నాకు అనిపించేది. చదువుకోవాలని కోరికగా వుండేది. 
- ఏమి చెసేది?​ నేను బడికి పోతే మేకలు కాసేది ఎవరు?​ 
- ఒక రోజు అనుకోని సంగతి జరిగింది. ఊరిబయట నాకు మా వూరి టీచరు కనిపించాడు. చేతిసైగ చేసి పిలిచాడు నేనుపోయాను. 
- బడి కిటికీలోంచి తొంగి చూసేది నివేనా! అని అడిగాడు. 
- నాకు జంకు వేసింద. చదువు కోవాలని వుందా?​ అని అడిగాడు. అవునని తలవూపాను. 
- నీవు తెలివిగలవాడివి. రోజూ సాయంకాలం మా ఇంటికిరా! చదువు చెపుతా అని పిలిచాడు. 
- నాకు జంకు తీరింది. సంబరం కలిగింది. ఆరోజు నుంచి టీచరు ఇంటికి పోసాగాను. కొందరు ఎగతాళి చేసారు. కొందరు వెనకకు లాగారు. అయినా నేను మానుకోలేదు. 
- 6 నెలలు గడిచాయి. ఇపుడు నేను రెండో తరగతి వాచకం చదవగలను. ఏ పదం అయినా రాయగలను. 
- చదువుకోవడం ఎంత తేలికో ఇపుడు నాకు తెలిసింది. 
  
 +                             ​  ​ రిక్షా రాముడు
  
- రౌడీ కోతి +రంగడు చలపతిగారి ​పాలేరు.ఒక ​రోజు రంగడిని పొలంలో ​పాము కరిచింది.లింగం వేసారు.అయినా ​చనిపోయాడు. 
- +రంగడికి ​ఒకడే కొడుకు.వాడి ​పేరు రాముడు.ఒకనాడు ​రాముడు ​చలపతి ఇంటికి ​పోయాడు. 
- అవి నేను మూడో తరగతి చదివే రోజులు. మా ఊరిలో ​ఒక ​కోతి వుండేది. +బాబుగారూ! ​మా నాయన ​మీపొలంలోనే ​పోయిండు.నా కూలితో కొంప ​గడవదు.ఆ కూలి గూడా రోజూ దొరకదు.జానెడు నేల సూపించండి.ఎగసాయం చేసుకుంటా.మీ పాదాల కాడనే ​పడుంటా ​అని ​అడిగాడు. 
- అది ఎవరి ఇంటిలో ​అయినా దూరేది. దొరికింది తినేది . తినగా మిగిలింది పాడుచేసేది. పారబోసేది. చేతికి దొరికింది తీసుకొని పోయేది. ఎవరి ​మీదకి ​అయినా దూకేది. +చలపతి ​నాగుపాములాగా లేచాడు. 
- ఈ కోతి అందరికీ బెడదగా మారింది. దీనిని అందరూ చీదరించు కొనేవారు. కోపగించు కొనేవారు. తరిమేవారు. ఈ పీడ ఎపుడు విరగడ అవుతుంది అనుకొనేవారు. +ఒరే ​మీ నాయన నాకోసం ​పోయాడా! 
- ఒకసారి ఆ కోతి ​మా అరుగు మీదకి దూకింద. ఆడుకొనే మా ​పాపను కిందకి ​తోసింది. మా పాప తలకు బాగా ​గాయం తగిలింది. +ఆయువు ​తీరింది ​పోయాడు.ఇంకానయం.నేనే చంపినానని అనలేదు.అని కసిరాడు.ఉరిమాడు. 
- మా నాయన ​కోపంతో మండిపోయాడు. ​వాటమైన రాయి విసిరాడు. ​కోతి తలకు ఆ రాయి తగిలింది. అది ​పడిపోయింది. చనిపోయింది. +రాముడికి ఏమి చేయాలో తోచలేదు.టవునికి ​చేరాడు.రిక్షా లాగుతూ బతుకు గడపసాగాడు.కొంత కాలానికి ముసలి వాడయి పోయాడు. 
- పదిమంది గుమికూడారు. ​తలా ఒకమాట మాటాడారు. +ముసలివాడి రిక్షా ఎవరికీ ​పనికి ​రాలేదు.రాముడికి బాడుగులు ​లేవు.తిండికి జరుగు బాటు లేదు.ఏమి చేయాలి? ఎలా బతకాలి?ఊపిరి పోయే ​దాకా ​ఇంత తిండి కావాలి.ముసలివాడు ఏ పని చేయగలడు? 
- కోతిని చంపడం మహాపాపం అనింది ఒకామె.దినిని సమాధి చేయాలి అని ఒకాయన లేచాడు. +ఇది ఒక ​రిక్షారాముడి కధ. ఈ దేశంలో ఇలాంటి ​వారు ఎందరో.
- అందరూ కలిసి ఒక చోట దానిని సమాధి చేసారు. మరునాడు పాలు పోసారు. కొందరు దాని సమాధికి పూజలు కూడా ​చేయసాగారు. +
- మా ​పాప ​గాయానికి ​ఆకోతే కారణం. ఇది అందరినీ ఏడిపించింది. అందరూ దీనిని చీదరించుకొనిన ​వారే. ఇలాంటి కోతికి పూజలు దేనికి?​ +
- దీనికి ​జవాబు నాకు దొరకలేదు. ​మీరు చెపుతారా? +
- +
- +
- +
- +
- +
- +
- +
- +
-పసిపాప ధర +
- +
- +
- +
- +
- +
- పసిపాప ధర +
- +
-నిజం వినడానికి బాగుండదు. చదవడానికి గూడా బాగుండదు. అయినా నిజం నిజమే. +
- జోలంగీరు అనే ఊరిలో ​వానలు లేవు. పంటలు లేవు. పాపం గిరిజనులకు పనిలేదు. ​కూలి లేదు. ​కాలే కడుపుకు చారెడు గంజిలేదు. +
- కొందరు ​వలస పోయారు.కొందరు ఆకలితో ​చనిపోయారు. కొందరు ఆకులు వుడకేసుకుని తినసాగారు. దీంతో ఆకలి ​తీరుతుందా? +
- ఒకామెకు పసికందు భారమైంది. తాను సాకలేదు. ఏమి చేయాలి ​20 రూపాయలకు ధారబోసింది. ఆ పాపకు ఎనిమిది నెలలు. +
- చూడండి! ఆకలి ఎంత నరకమో!ఇలా ​జరగవలసిందేనా? దీనికి అంతం లేదా? ఆలోచించండి.+
ఇదీ_లోకం.1321722542.txt.gz · Last modified: 2018/03/24 11:13 (external edit)