User Tools

Site Tools


గంగాళం_చచ్చిపోయింది

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

గంగాళం_చచ్చిపోయింది [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                       ​  ​        ​గంగాళం చచ్చిపోయింది
 +రామలింగడికి ఒకసారి ఒక బిందె కావలసి వచ్చింది.తాతాచారిని అడిగాడు.ఆయన రోజుకు రూపాయి బాడుగ చెప్పాడు.రామలింగడు ఒప్పుకొని బిందె తీసుకొని పోయాడు.
 +ఒక వారం గడిచింది.రామలింగడు బిందెతో పాటు ఒక చెంబు కూడా తెచ్చాడు.బాడుగతో పాటు చెంబు కూడా తాతాచారికి ఇచ్చాడు.
 +తాతాచారి ఇదేమిటి?​అని అడిగాడు.
 +మా ఇంటిలో వుండగా మీ బిందెకు ఈ చెంబు పుట్టింది.తెచ్చాను.అని రామలింగడు చెప్పాడు.తాతాచారి మురిసిపోయాడు.
 +కొంతకాలానికి రామలింగడు ఒక గంగాళం కావాలని వచ్చాడు.తాతాచారికి ఆశ పుట్టింది.బాడుగ కూడా చెప్పకుండా ఇచ్చాడు.
 +పది రోజులకు రామలింగడు వట్టి చేతులతో వచ్చాడు.
 +గంగాళం ఏది?​అని తాతాచారి అడిగాడు.
 +చెప్పడానికి బాధగా వుంది.అది పురిటిలో చచ్చిపోయింది అని చెప్పాడు రామలింగడు.
 +తాతాచారికి ఒళ్ళు మండిపోయింది.
 +గంగాళాలు చచ్చిపోతాయా?​అని నిలదీసాడు.
 +బిందెకు చెంబు పుట్టిందంటే మీరే ఒప్పు కొంటిరి.గంగాళం చచ్చిందంటే ఎందుకు ఒప్పుకోరు.పుట్టింది చావక తప్పదుగదా అని రామలింగడు దబాయించాడు.
  
 +                           ​సీతకు మొగుడు దొరికాడు
 +చలపతి పేదవాడు.మంచివాడు.అతడికి ఒక ఎకరం పొలం వుంది.కూలీనాలీ చేసుకొంటాడు.పూట గడుపుకుంటాడు.
 +చలపతికి పొలంలో వచ్చేది చెప్పదగ్గ ఆదాయం గాదు.పైగా కొంత అప్పు కూడా వుంది.
 +చలపతికి ఒకే ఒక కూతురు.పేరు సీత.చలపతి సీతను పెద్ద చదువులు చదివించలేక పోయాడు.పది దాకా చదివించాడు.
 +ఆ చదువుకు ఏమి నౌకరు దొరుకుతుంది!ఏమీ దొరకలేదు.పైగా సీతకు పెళ్ళీడు వచ్చింది.పెళ్ళికొడుకు కోసం చలపతి వేట మొదలు పెట్టాడు.
 +పెళ్ళికొడుకులు తేరక దొరుకుతారా?​పై పెచ్చు చేసుకొనేవాడు ఇంత తిన గలిగిన వాడు కావాలి.సీతను బాగా చూచుకోవాలి.
 +అలాంటివాడు తేలిగ్గా దొరుకుతాడా!తిరిగి తిరిగి చెప్పులు అరిగి పోయాయి.
 +చివరికి పెళ్ళి కొడుకు దొరికాడు.సీతకు మొగుడు దొరికాడు.
 +అయితే చలపతికి వుండే ఒక ఎకరం పోయింది.అదీ సంగతి.
 +
 +
 +
 +
 +
 +
 +
 +                       ​  ​   సుబ్బారాయుడి దయ
 +మా ఊరి పొలిమేరలో ఒక పెద్ద తిప్ప వుంది.ఆ తిప్పరాళ్ళు కంకర కొట్టడానికి కొందరు కూలీలు వచ్చారు.వాళ్ళలో ఒక జంటకు ఒక మగ బిడ్డ.అప్పుడు వాడికి అయిదేళ్ళు.
 +కొంతకాలానికి ఈ జంటలో ఆడమనిషికి జబ్బు చేసింది.ఆమె చచ్చిపోయిండి.వాడు ఆ పసివాడిని మా ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయాడు.
 +ఎందుకంటే వాడికి ఆమె కట్టుకొనింది కాదట.బిడ్డతో పాటు తెచ్చుకొనిందట.
 +మా ఊళ్ళో సూబ్బారాయుడు అనే రైతు వుండే వాడు.ఆయన ఆ పసివాడ్ని ఇంటికి తీసుకొని వచ్చాడు.తిండిపెట్టి పెంచసాగాడు.
 +సుబ్బారాయుడు దయగల మారాజు అని అందరూ పొగిడారు.
 +ఏడాది గడిచింది.వాడికి పనులు చెప్ప సాగాడు.
 +సుబ్బరాయుడికి చుట్టలు తెచ్చేది వాడే.నీళ్ళ తొట్టి కడిగేది వాడే.కొట్టంలో పేడ తీసేది వాడే.
 +వాడు ఎప్పుడూ పేడ దిబ్బలోనే అడుకునేవాడు.వాడికి ఊళ్ళో వాళ్ళు దిబ్బడు అని పేరు పెట్టారు.
 +దిబ్బడికి పదేళ్ళు వచ్చాయి.వీడు పొద్దు పొడవక ముందే సజ్జ చేలోకి పోవాల.పిట్టలు తోలాల.వచ్చేటప్పుడు గడ్డికోసుకొని రావాల.వాడికి రోజంతా చాకిరీ తోనే సరిపోయేది.
 +దిబ్బడికి ఇరవై ఏళ్ళు వచ్చాయి.సుబ్బారాయుడి పది మేకలు వంద అయినాయి.రెండె కరాలు పదెకరాలు అయినాయి.
 +ఇప్పుడు సుబ్బారాయుడు మిద్దె కట్టడం మొదలు పెట్టాడు.ఆ మిద్దెకు దిబ్బడు రాళ్ళు మోసుకొని పోతుంటే నిచ్చెన జారింది.పాపం వాడు పడిపోయాడు.కాలు విరిగింది.
 +సుబ్బారాయుడు పట్టించుకోలేదు.ఊళ్ళో వాళ్ళు చెప్పి చూచారు.అతను కలిగించుకోలేదు.
 +ఊళ్ళో వాళ్ళు తలా కొంచెం డబ్బు దండారు.టవునికి తీసుకొనిపోయి చూపించారు.అయినా కాలు కట్టుకోలేదు.లాభం లేక కాలు తీసేసారు.
 +దిబ్బడు బిచ్చగాడుగా మారిపోయాడు.
 +సుబ్బారాయుడి దయ ఇప్పుడు ఏమైంది?​చెప్పండి.
 +
 +
 +                               ​ఏళ్ళు మారినా
 +ఊళ్ళో కోళ్ళు కూసాయి
 +కొడళ్ళు నిద్దర లేచారు
 +సద్దికూళ్ళు మూట గట్టారు
 +తాళ్ళు,​కొడవళ్ళు చేత పట్టారు
 +కట్టెలకోసం అడవి దారి పట్టారు
 +దారంతా మూళ్ళు,​రాళ్ళు,​తేళ్ళు
 +అడవి నిండా తోడేళ్ళు
 +మైళ్ళు నడిచారు,​వళ్ళు వంచారు.
 +పేళ్ళు ఏరారు,​పళ్ళు కోసారు
 +సద్దికూళ్ళు తాగారు,​ఇళ్ళదారి పట్టారు
 +పైన రోళ్ళ పగిలే ఎండలు
 +కాళ్ళు పుళ్ళు పడ్డాయి
 +నోళ్ళు ఎండిపోయాయి
 +మగాళ్ళు ఎదురు రాలేదు
 +ఏళ్ళు మారినా ఊళ్ళు మారినా?​
 +ఆడవాళ్ళ బతుకులు మారేనా?​
 +అనుకుంటూ ఇళ్ళు చేరారు.
 +
 +
 +
 +                          రామలింగడి ఆవు
 +ఒక రోజు రమలింగడి ఆవు తప్పిపోయింది.అది బాగా పాలిచ్చే ఆవు.
 +దాని కోసం ఎంతో వెతికించాడు.అయినా దొరకలేదు.మంచి అవు పోయింది ఎలాగబ్బా అని అలోచించాడు.
 +నా ఆవు తప్పి పోయింది.అది బాగా పాలిచ్చే అవు.పట్టుకొచ్చిన వాళ్ళు పది రూపాయలకే దానిని కొని తీసుకొనిపోవచ్చు.అని దండోరా వేయించాడు.
 +రెండు రోజులు గడిచాయి.ఒకడు రామలింగడి దగ్గరికి ఆవును పట్టుకొని వచ్చాడు.పది రూపాయలు ఇచ్చాడు.ఆవును తీసుకొని పోతాను అని అడిగాడు.
 +దూడలేకుండా పాలు ఎలా పిండుకుంటావు,​దూడను కూడా తీసుకొనిపో అని రమలింగడు చెప్పాడు.
 +ఆవును తెచ్చిన వాడు బలే సంబర పడ్డాడు.దూడ కోసం పలుపు పేన సాగాడు.
 +అబ్బాయీ! ఇది మంచి కోడె దూడ.దీని ధర అయిదు వందలు.ఆ డబ్బు కూడా తెచ్చావా?​అని రమలింగడు వాడి మోహంలోకి చూచాడు.
 +ఇంక చెప్పేది ఏముంది?​వచ్చినవాడు వచ్చిన దారి పట్టాడు.రామలింగడి ఆవు రామలింగడి కొట్టంలోకి చేరింది.
గంగాళం_చచ్చిపోయింది.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)