User Tools

Site Tools


రామలింగడి_కథలు

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

రామలింగడి_కథలు [2018/03/24 11:13]
రామలింగడి_కథలు [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                                                          ​
 +                                                         ​నాలుగో స్వర్గం
 +  ​
 +                  ఒకరోజు రామలింగడు చాలా మంది కవులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక ​
 +సన్యాసి అక్కడికి వచ్చాడు.
  
 +                      సన్యాసి వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు.
 +
 +                    "ఈ భూలోకం ఎక్కడ చూసినా పాపాలతో నిండిపోయింది. ఇది భరించలేక ​
 +
 +నేను ప్రతిరాత్రి స్వర్గానికి పోతాను.అక్కడ ఉండి వస్తుంటాను"​ అని బడాయిలు కొట్టాడు.
 +
 +           ​రామలింగడు సన్యాసి బడాయికోరు తనం గమనించాడు. అతినికి ​ బుద్ధి ​ చెప్పాలని అనుకున్నాడు.
 +
 +           "​అయ్యా! మీరు నాలుగో స్వర్గ్గానికి ఎప్పుడైనా వెళ్ళారా?"​ అని సన్యాసిని అడిగాడు.
 +
 +            నిజంగానే నాలుగో స్వర్గ్గం ఉందను కొన్నాడు సన్యాసి. దాన్ని చూడలేదంటే ​
 +
 +అందరూ నవ్వుతారనుకొన్నాడు.
 +
 +            "​దానిదేమొంది?​ రాత్రి కూడా నేను నాలుగో స్వర్గ్గానికి వెళ్ళి వచ్చాను"​ అని ​
 +
 +అబద్దమాడేశాడు.  ​
 +
 +             "​అక్కడ ఆకాశగంగలో మీరు మునిగారా?"​ అనడిగాదు రామలింగడు.
 +
 +              "​అంతదూరం వెళ్ళి మునగకుండా వస్తానా?​ రాత్రి కూడా మునిగే వచ్చాను"​ అన్నాడు ​
 +
 +సన్యాసి గొప్పగా. ​
 +
 +              "ఆ ఏటి గట్టున ఇసుక మీద మీకు మెత్తగా ఏమైనా తగిలిందా?"​ అని మళ్ళీ అడిగాదు ​
 +
 +రామలింగడు. ​
 +
 +               "​తగలకేం?​ బాగా నూరిన గంధం లాంటిది మెత్తగా తగిలింది. అది ఎంత మంచి ​  
 +
 +వాసన!"​ అని ఇంకా బడాయి కొట్టాడు సన్యాసి. ​
 +
 +                "​అది నా గుర్రం వేసిన పేడలెండి. రాత్రి నేను కూడా నాలుగో స్వర్గ్గం వచ్చాను ​
 +
 +గదా?"​ అన్నాడు రమలింగడు. ​
 +
 +                 ​దీంతో అంతా ఫక్కుమని నవ్వారు. సన్యాసి మొగం చిన్నబోయింది. తల
 +
 +వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ​
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +                                                              ​
 +                                                              లెంపకాయ ఖరీదు
 +
 +                  ​
 +                       ​ఒకరోజు రామలింగడు వీధిలో వెలుతున్నాడు. ఎవరో వెనక నుంచి వచ్చి ఒక్క
 +
 +గుద్దు గుద్దేడు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కింద పడిపోయాడు.
 +
 +                  ఆ పక్కనే వెళుతున్న వాళ్లు కొట్టిన వాడిని పట్టుకున్నాడు. రామలింగడిని లేవ దీశారు.
 +
 + ​తనని కొట్టిన వాడిని రామలింగడు ఎప్పుడూ చూడలేదు.
 +
 +                  "​ఎందుకయ్యా ఆయన్ని కొట్టేవు"​ అని అంతా అతన్ని నిలదీశారు.అతను కంగారు పడ్దాడు.
 +
 +                 "​అబ్బే. తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ​
 +
 +ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టేను"​ అన్నాడు.
 +
 +                  సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతాడా?​ అని ఎవ్వరూ ​
 +
 +ఒప్పుకోలేదు. ఆ మనిషిని మంత్రిగారి దగ్గరికి తీసుకుపోయేరు.
 +
 +                    మంత్రి అంతా విచారించాదు. ఆ దెబ్బ కొట్టిన వాడు మంత్రికి దగ్గర చుట్టం ​
 +
 +అవుతాడు. అంచేత ఆయన వాడిని ఎలా అయినా వదలిపెట్టాలనుకొన్నాడు.
 +
 +                     "​పోనీవయ్యా రామలింగా! తెలియక పొరపాటు చేశాడు. ​
 +
 +ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో"​ అన్నాడు.
 +
 +                    రామలింగడు ఒప్పుకోలేదు.
 +
 +                    "​సరే! ఒక రూపాయి జరిమానా వేస్తాను"​ అన్నాడు మంత్రి.
 +
 +                    కొట్తినవాడు తన దగ్గర రూపాయి లేదన్నాడు. మంత్రి వాడిని చూసి నవ్వాడు. ​
 +
 +ఇంటికి పోయి రూపాయి తీసుకు రమ్మన్నడు. వాడు దొరికిందే సందని పారిపోయాడు.
 +
 +                   ​రామలింగడికి ఇదంతా చూసి వళ్ళు మండి పోయింది. మంత్రి దగ్గరగా వెళ్లాడు.
 +
 +                  "​అయితే మంత్రిగారూ! నాకు తెలియక అడుగుతాను. దెబ్బ,​ గుద్దు, ​
 +
 +లెంపకాయ వీటి ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుందే"​ అన్నాడు.
 +
 +                      "​అంతేగామరి"​ అన్నడు మంత్రి.
 +
 +                  " ఓహో! అలాగా"​ అన్నాడు రామలింగడు. వెంటనే సాగదీసి మంత్రిగారిని ​
 +
 +ఒక్క లెంపకాయ కొట్టేడు. మంత్రి మొర్రో అన్నాడు.
 +
 +                      " మంత్రిగారూ! నాకు అవతల బోలెడు పని ఉంది. నేను పోవాలి. ఈ
 +
 +దెబ్బకు రూపాయి సరిపోతుంది గదా!
 +
 +                       ​నన్ను కొట్టినవాడు రూపాయి తెస్తాడుగా. అది తమరు పుచ్చుకొండి"​
 +
 + ​అని చెప్పి రామలింగడు విసవిసా వెళ్లిపోయాడు. ​  
 +
 +
 +                                            ​
 +                                                               ​సంచిలో ఏనుగు
 +
 +                   ​ఒకరోజు రామలింగడు సభకి చాల ఆలస్యంగా వచ్చాడు. రాజుగారు రామలింగడిని పిలిచారు. ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు.
 +                   "​రాజా! మా చిన్న కొడుకు ఈవేళ చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చే సరికి ఇంతసేపై<​ది"​ అన్నాడు రామలింగడు.
 +                   ​దానికి రాజు ఫక్కున నవ్వాడు. "​రామలింగా! ఏదో సాకు చెప్పావుగానీ,​ పిల్లల్ని సముదాయించడం అంత కష్టమా?"​ అన్నాడు.
 +                   "​లేదు మహారాజా! చిన్న పిల్లలకి నచ్చిజెప్పడం చిన్న పనికాదు. అంతకంటే కష్టమైన పని ఇంకోటి లేదు. అది కావాలి. ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు.కొట్టినా,​ తిట్టినా శోకాలు పెడతారు. ఇవన్నీ వేగడం ఊరుకోబెట్టడం చెప్పలేంత కష్టం!"​ అన్నాడు రామలింగడు.
 +                    రాజు దీనికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్త్తున్నాడని అనుమానించాడు.
 +
 +                    "​సరే రాజా! కొంతసేపు నేను చిన్న పిల్లవాడి గానూ,​ మీరు తండ్రిగానూ,​ ఉందాం,​ పిల్ల చేష్ట్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను"​ అన్నాడు రామలింగడు.
 +                    సరేనన్నాడు రాజు.
 +                    రామలింగడు మారాం మొదలు పెట్టాడు. మిఠాయి కావాలన్నాడు.
 +                   "​ఓస్ ఇంతే గదా!"​ అని రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారు పోదామని గోల చేశాడు రామలింగడు.రాజు అతన్ని తీసుకొని బజారుకి వెళ్ళాడు.
 +                    వీధిలో అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు రామలింగడు. తన వెంటే రాజుని పరుగెత్తించాడు. ఒక కొట్టుముందు ఆగాడు రామలింగడు. రంగు రంగుల సంచీ చూపించాడు. అది కొనమన్నాడు.
 +                    సరేనని రాజు ఆ సంచీ కొన్నాడు. మరికొంత దూరం పోయారు. ఒక ఏనుగు కనబడింది. ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేది లేక ఆ ఏనుగుని కూడా కొన్నాడు రాజు.
 +                    అంతే! ఆ ఏనుగుని ఈ సంచీలో పెట్టమన్నాడు రామలింగడు. ​
 +                    "​సంచీలో ఏనుగెలా పడుతుంది?​ మరొకటి ఏమైనా అడుగు"​ అన్నాడు రాజు.
 +                     "​వీల్లేదు.ఏనుగునే సంచీలో పెట్టాలి. నాకింకేమీ వద్దు"​ అని వేధించుకు తిన్నాడు రామలింగడు.
 +                    కొంతసేపటికి రాజు విసిగిపోయాడు. ఓడిపోయానని వప్పుకున్నాడు.
 +                    రామలింగడు నవ్వుకున్నాడు.
 +
 +
 +
 +
 +
 +
 +
 +                                                               
 +
 +
 +
 +                                                     
 +                                         
 +
 +     అమ్మగారి ఆఖరి కోరిక
 +
 +                      రాజుగారి తల్లికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. ఆమెకి వానాకాలంలో బాగా జబ్బు చేసింది.చావబోయే ముందు మామిడి పండు తినాలని ఆవిడ కోరిక.
 +                      రాజు భటులని దేశామంతా తిప్పాడు. ఎక్కడా ఒక్క మామిడి పండు కూడా దొరకలేదు. దాన్నే కలవరిస్తూ ఆమె ప్రాణాలు వదిలింది.
 +                     ​చనిపోయేముందు తల్లికి మామిడిపండు తిని పించలేక పోయానే అని రాజు బాధ పడ్దాడు.
 +                    ఈ సంగతి తాతాచారికి తెలిసింది. ఈ వంకతో వీలైనంత డబ్బు గుంజుకోవాలని ఎత్తువేశాడు. వెంటనే రాజు దగ్గరికి పోయాడు.
 +                    "​మహారాజా! బాధపడకండి! బంగారు మామిడి పళ్ళు ​ చేయించి బ్రామ్మలకు దానం ఇవ్వండి. ఏటా ఆమె తద్దినంనాడు ఈ పని చేయండి. స్వర్గంలో మీ తల్లిగారికి శాంతి కలుగుతుంది"​ అని చెప్పాడు.
 +                     ​రాజు ఏటా బంగారు మామిడి పళ్ళు దానం చేయడం మొదలెట్టాడు. లక్షల మంది బ్రామ్మలు దానం తీసుకు పోతిన్నారు. రెండేళ్ళకే రాజుగారి ఖజానా ఖాళీ అయిపోవచ్చింది.
 +                     ​తాతాచారి మోసంతో రాజుగారు చిక్కుల్లో పడ్డాడు. ఏదో ఎత్తువేయాలి అని రామలింగడు ఆలోచించాడు.
 +                    తర్వాత ఏడు కూడా లక్షల మంది బ్రామ్మలు దానం పుచ్చుకోవడానికి వచ్చారు. ముందు రోజే పట్నంలో దిగారు. రామలింగడు ఆ రాత్రి అందరినీ కలుసుకున్నాడు.
 +                  ఈ ఏడు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వాతలు వేయించుకోవాలి"​ అని అందరికీ చెప్పాడు.
 +                  బ్రామ్మలంతా ఆశపడ్డారు. మర్నాడు పొద్దుటే రామలింగడు కొలువు బయట కొలిమి పెట్టించాడు. బ్రామ్మలకు వాతలు వేయించసాగాడు. కొందరు పది వాతలు కూడా వేయించుకున్నారు.
 +                  కొలువు లోపలికి వెళ్ళి రాజుకు వాతలు చూపించారు. బంగారు మామిడి పళ్ళు ఇమ్మని అడిగారు. ​ రాజు తెల్లబోయాడు. రామలింగడే ఈ వాతలు వేయిస్త్తునాడని తెలిసింది. విపరీతమైన కోపం వచ్చింది.రామలింగడిని పిలిచి ఇలా ఎందుకు చేస్త్తున్నావ్ అని అడిగాడు.
 +                  "​మహారాజా! మా అమ్మ వాత రోగంతో చనిపోయింది. పోయేముందు వాతలు వేయించమని అడిగింది. నేను వేయించే లోపలే కన్నుమూసింది.
 +                   ​మరి ఆమె అత్మ కూడా శాంతించాలి గదా! అందుకు బ్రామ్మలకు వాతలు వెయ్యమని చెప్పారు. ఇంతమంది బ్రామ్మలు నాకు ఎప్పుడు దొరికుతారు?​ పైగా వాతలు వేయింస్తానంటే ఎవరు వస్తారు?​ అందుకే పనిలో పనిగా ఇప్పుడే వేయిస్త్తున్నాను"​ అన్నాడు.
 +                  రాజుకి వెంటనే సంగతి అర్థమయింది. తాతాచారి మోసం తెలిసిపోయింది. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడ్డాడు.
 +                 ​ఆశపోతులు కాకపోతే ఒక్కొక్కరు అన్ని వాతలు వేయించుకుంటారా అనుకున్నాడు. వెంటనే బంగారు మామిడిపళ్ళ దానం ఆపేసాడు.
 +               
 +
 +
 +                                                   ​మంత్రిబుద్ద్ధి
 +                ​
 +                          రామలింగడి ఇంటి పక్కనే చెరువు ఉంది. ఒకరోజు ఒక మంత్రిగారు అటువైపు వెళుతున్నారు. ఆయన కాలికి బురద అంటింది. కడుక్కోవడానికి చెరువులో దిగాడు.
 +                          మెట్లమీద కాలుజారి నీళ్ళలో పడి పోయాడు. చెరువులో నీళ్ళు ఎంతో లోతు లేవు. మునిగిపోయే ప్రమాదం లేదు.
 +                          కానీ మంత్రి లేచే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ప్రాణభయంతో వెర్ర్రి కేకలు వేయడం మొదలు పెట్టాడు.
 +                          ఆ కేకలకి జనం చుట్టూ మూగారు. "​చెయ్యి ఇలా ఇవ్వండి లాగుతాం"​ అని నలుగురైదుగురు చేతులు జాపారు.
 +                           ​కానీ మంత్రి వాళ్ళ మాట వినడే! పైగా ఒకటే అరుపులు. ఇంతలో రామలింగడు కూడా అక్కడికి వచ్చాడు.
 +                           ​గబగబా ముందుకి పోయాడు. "​నా చెయ్యి పుచ్చుకోండి"​ అన్నాడు. మంత్రి ఆ చెయ్యి అందుకుని బయటికి వచ్చాదు.
 +                           ​అక్కడి జనమంతా తెల్లబోయారు. ఇందాకటి నుంచీ అందరూ చెయ్యి ఇవ్వయ్యా అంటే ఇవ్వలేదు. రామలింగడి మాట ఎలా విన్నాడా అనుకున్నారు.
 +                            జనంలో ఒకకడు రామలింగడినే అడిగాడు. రామలింగడు చిన్న నవ్వు నవ్వాడు.
 +                             "​అబ్బే. మరేం లేదు. మీరంతా చెయ్యి ఇలా ఇవ్వండి అన్నారు. నేను చెయ్యి పుచ్చుకోండి అన్నాను. అదీ తేడా. మంత్రిగారు కదా పుచ్చుకోవడమే గానీ ఇవ్వడం తెలీదు. అంతకంటే ఇంకేం లేదు"​ అన్నాడు.
 +                              జనం అందరూ గొల్లున నవ్వారు.
 +
 +
 +                                                  అబ్బకు తగ్గ కొడుకు
 +
 +                        ఒకరోజు రామలింగడి కొడుకు రాజుగారి సభకు వచ్చాడు. వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే. రాజు వాడిని చూశాడు. ముచ్చటగా ఉన్నాడు అన్నాకున్నాడు.
 +                        అయితే వాళ్ళ నాన్నకున్న తెలివి తేటలు ఉన్నా యా అనిపించింది. వాడిని దగ్గరుకి పిలిచాడు. వాడు పరుగెత్తుకొని వచ్చాడు. రాజుకి దండం పెట్టాడు.
 +                        రాజు సంతోషించాడు. పది రూపాయలు ఇవ్వబోయాడు. కానీ కుర్రాడు తీసుకోలేదు.
 +                        "​ఏం. ఎందుకు తీసుకోవు?​ అనడిగాడు రాజు. "​తీసుకోతప్పులేదు"​ అన్నాడు మళ్ళీ.
 +                         "​వద్దు మా అమ్మ కోప్పడుతుంది"​ అన్నాడు ఆ కుర్రాడు ​ "​ఎందుకు"​ అనదిగాడు రాజు.
 +                        ​
 +                        "​ముక్కూ మొగం ఎరగనోళ్ళ దగ్గర డబ్బు తీసుకోకూడదట. మా అమ్మ చెప్పింది అన్నాడు వాడు.
 +                        "​సెబాస్. ఆవిడ మంచి మాటే చెప్పింది కానీ నేను ముక్కూ మొగం ఎరుగనివాడిని కాదు,​ రాజుని గదా! తీసుకో"​ అన్నాడురాజు. ​       ​
 +                       "​అవును. తెలుసనుకోండి"​ అని నీళ్ళు నమిలేడు ఆ కుర్రాడు.
 +                        "​మరింకా అనుమానమెందుకు"​ రాజు నచ్చ చెప్పాడు.
 +                        "​మా అమ్మ నమ్మదు మరి"​ అన్నాడు వాడు.
 +                        "​ఏం ఎందుకు నమ్మదు?"​ అడిగాడు రాజు.
 +                        "​ఎందుకంటే నిజంగా ఆ డబ్బులిచ్చింది రాజు గారె అయితె ఆయన పది రూపాయలిస్తారా?​బోలెడు ఇస్తారుగానీ అంటుంది మా అమ్మ"​ అన్నాడు రామలింగడి కొడుకు.  ​
 +                            దెబ్బతో వాడి తెలివి ఏమిటో రాజుగారికి తెలిసిపోయింది. కానీ ఆ జవాబుకి ఆయన తల తిరిగిపోయింది.
 +                       ​వాడికి మంచి కానుకలిచ్చి పంపించాడు.
 +                ​
 +                          ​
 +                                                    ​
రామలింగడి_కథలు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)