This shows you the differences between two versions of the page.
— |
మీరు_నయం_చేసుకోవచ్చు [2018/03/24 11:13] (current) |
||
---|---|---|---|
Line 1: | Line 1: | ||
+ | నీళ్ళ బేదులు | ||
+ | పసిబిడ్డలకు బేదులు రావడం మామూలే.ఈ రోగం వేల మంది బిడ్డలను బలి తీసుకొంటూ ఉంది. | ||
+ | మొదట కొద్ది కొద్దిగా బేదులు కావచ్చు.కాని నీళ్ళ బేదులు పట్టుకుంటే బిడ్డకు అపాయం. | ||
+ | ఒక రోజులోనే తోటకూర కాడలాగా వాడి పోతాడు.ఒంటిలో నీరంతా పోతుంది. | ||
+ | బిడ్డ బరువు బాగా తగ్గి పోతుంది.తోలు సాగదు.ఒంటేలు పోయడం తగ్గిపోతుంది.అంటే అపాయం ముంచుకొని వచ్చినట్టే. | ||
+ | దీనికి ఒకే మందు.నీళ్ళు బాగా కాచి వడబోయాలి. | ||
+ | ఒక లోటా నీటిలో చెంచాడు పంచదార, చిటికెడు ఉప్పు వేయాలి.ఈ నీళ్ళు కళ్ళ నీళ్ళంత ఉప్పగా ఉండాలి. | ||
+ | ఈ నీళ్ళు బిడ్డకు బాగా తాగించాలి.మొదట వాంతులు రావచ్చు.అయినా ఆపకూడదు. | ||
+ | బేదులు వచ్చినపుడు నీళ్ళు తాగించక పోవడం ఎంతో అపాయం. | ||
+ | |||
+ | మల బద్దకం | ||
+ | చాలామంది మలబద్ధకంతో బాధ పడుతుంటారు.మలబద్ధకానికి చాలా కారణాలు ఉండవచ్చు. | ||
+ | వేళకు తిండి తినక పోవడం ఒక కారణం.కడుపు నిండా తినక పోవడం ఒక కారణం.వేళకు దొడ్డికి పోక పోవడం మరో కారణం.నీళ్ళు సరిగా తాగక పోవడం కూడా కారణమే. | ||
+ | పై విషయాలలో మెళకువగా ఉండాలి.వేళకు కడుపు నిండా తిండి తినాలి.బాగా నీళ్ళు తాగాలి,వచ్చినా రాకపోయినా వేళకు దొడ్డికి పోవాలి. | ||
+ | ఆకు కూరలు, అరటి పళ్ళు తింటే మంచిది.మసాలాకూరలు మంచిది గాదు.పొగ తాగడం మానుకోవాలి బేది మందు అవసరం లేదు. దీనికి అలవాటు పడడం మంచిది గాదు. | ||
+ | కాసింత ఉప్పును ఒక లోటానీటిలో కలిపి తాగాలి.పది నిమిషాలలో విరేచనం అవుతుంది. | ||
+ | |||
+ | వడ దెబ్బ | ||
+ | ఎండాకాలం వచ్చిందంటే చాలు.వేడికి తటుకోలేక మనకు వడ దెబ్బ తగులుతుంది. | ||
+ | పసివాళ్ళు, ముసలివాళ్ళు,తాగుబోతులు దీనికి గురవుతారు.కొందరు చచ్చి పోతారు కూడా. | ||
+ | మన శరీరంలో చాలా నీరుంటుంది,ఇది చెమటగా ఎండాకాలం బయటకు పోతుంది. | ||
+ | కాబట్టి ఒంటిలో నీరు తగ్గి పోతుంది.చెమటతో పాటు ఉప్పు కూడా పోతుంది. | ||
+ | అందుచేత శరీరంలో వేడి పెరుగుతుంది.ఒళ్ళు పట్టుకుంటే కాలి పోతుంటుంది.తెలివి తప్పి పడిపోతాం.దీనినే వడ దెబ్బ అంటారు.ఇది చాలా అపాయం. | ||
+ | మొదట శరీరం వేడిని తగ్గించాలి.వడ దెబ్బ తగిలిన మనిషిని నీడలో పడుకోబెట్టాలి.ఒంటి మీద గుడ్డలు తీసేయాలి.మంచి నీళ్ళతో శరీరం బాగా తడపాలి.తడి గుడ్డతో మాటి మాటికి తుడవాలి.బాగా గాలి విసరాలి. | ||
+ | వేడి తగ్గిందో లేదో నిమిష నిమిషానికి చూడాలి.తగ్గేదాకా తడిగుడ్డతో తుడవడం ఆపకూడదు.తెలివి వచ్చేదాకా ఏమీ తాగించ కూడదు. | ||
+ | ఎండాకాలంలో మంచి నీళ్ళు బాగా తాగాలి.ఉప్పు కలిపిన గంజినీళ్ళు,నీరు,మజ్జిగ తాగితే మరీ మంచిది. | ||
+ | ఎండకు కొందరికి బలహీనంగా ఉంటుంది.ఇలాంటివారు ఉప్పు,పంచదార కలిపిన నీరు తాగడం ఎంతో మంచిది. | ||
+ | |||
+ | |||
+ | పొగరాక్షసి | ||
+ | చాలా మందికి బీడీ తాగడం సరదా,సిగరెట్టు తాగడం ఎంతో గొప్ప.చుట్ట తాగడం చెప్పలేని ఆనందం.పొగతాగడం అంటే ఆయుస్సు పోగొట్టుకోవడమే.ఇది చాలా మందికి తెలియదు. | ||
+ | చుట్ట,బీడీ,సిగరెట్టు ఏదైనా ఒకటే.వీటిలో ఒకటి మంచిది,ఒకటి చెడ్డది అనలేము. | ||
+ | పళ్ళు ఊడగొట్టు కోవడానికి ఏ రాయి అయినా ఒకటేగదా!అలాగే ఇవి కూడా. | ||
+ | పొగతాగిన వాడి నోటికి రుచి పోతుంది.గొంతులో,కడుపులో మంట మొదలవుతుంది.పుండు పడుతుంది.తిండి అరగదు.మలబద్దకం కలుగుతుంది.తలనొప్పి పుడుతుంది. | ||
+ | అంతటితో ఆరోగాలు ఆగవు.క్షయ రోగం తగులు కొంటుంది.కడుపులో నోటిలో పుట్ట కురుపులు గూడా పుడతాయి.ఇవి నయంగావు. | ||
+ | పొగ తాగేవాడి దగ్గర మనం ఉండగూడదు.తాగడం కంటె ఇది అపాయం.కడుపుతో ఉండేవాళ్ళకు మరీ అపాయం.కడుపు పోవచ్చు.నెలలు నిండకముందే బిడ్డలు పుట్టవచ్చు.పుట్టిన బిడ్డలు అవిటి వాళ్ళు గావచ్చు. | ||
+ | పొగాకు నమలడం కూడా ఇలాంటిదే.పొగ తాగడం సులభంగా మానుకోవచ్చు.అయితే పట్టుదల ఉండాలి. | ||
+ | |||
+ | |||
+ | మంచి నీళ్ళు | ||
+ | మనం తాగే నీళ్ళే మన రోగాలకు మూలం.నీళ్ళలో రకరకాల రోగాల పురుగులు ఉంటాయి.ఇవి మన కంటికి కనబడవు.వీటి నుంచి మనకు రోగాలు అంటు కొంటాయి. | ||
+ | నీళ్ళ బేదులు,కలరా,పసిరికలు,టైఫాయిడు లాంటి జబ్బులకు నీళ్ళే కారణం,పసి బిడ్డలు వీటికి సులభంగా బలైపోతారు. | ||
+ | మనం చెరువులో,దొరువులలో నీళ్ళు తాగ గూడదు.దిగుడు బావుల నీళ్ళు కూడా మంచిదిగాదు.బోరింగు నీళ్ళు తాగడం మంచిది. | ||
+ | బావి చుట్టూ,బోరింగు చుట్టూ మురికి నీళ్ళు నిలబడకుండా చూచుకోవాలి. | ||
+ | పొలం పోయేటపుడు నీళ్ళు తీసుకొని పోవాలి. | ||
+ | నీళ్ళు మరగ కాయాలి.వేడి తగ్గాక తాగడానికి వాడుకోవాలి.పసి బిడ్డలకు ఈ నీళ్ళే తాగించాలి.దీని వలన జబ్బులేరావు.మనం గూడా ఈ నీళ్ళు తాగితే మరీ మంచిది.వానా కాలం ఇది మరీ అవసరం. | ||
+ | ఊళ్ళో మంచి నీటి సదుపాయం లేకుంటే అడగాలి.సాధించు కోవాలి.దీనికి ఆడవాళ్ళు ముందు వుండాలి. | ||
+ | |||
+ | |||
+ | |||