User Tools

Site Tools


మా_చెల్లి_బంగారుతల్లి

మా చెల్లి బంగారుతల్లి నాకో చిన్న చెల్లి ఉంది. కల్లాకపటంలేని పిల్ల. మా చెల్లి బంగారు తల్లి అయితే తనకు వినిపించదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి చెల్లి ఉంటుందట. మా చెల్లి పియానో వాయించగలదు. ( పియానో అంటే పెద్ద హార్మోనీ లాంటిది ) పియానో మెట్లను అది గుర్తించగలదు. అయితే….. మా చెల్లి ఎన్నటికీ పాడలేదు. అదే నాకు భాద కలిగిస్తుంది. పాపం తనకు పాటలు రాగాలు కూడా వినిపించవు. మా చెల్లి ఎవరితోనైనా చక్కగా డాన్సు చేయగలదు. తిన్నని గీతపై అడుగులో అడుగు వేసుకుంటూ నడవగలదు. ఎగరడం,దూకడం,పల్టీలు కొట్టడం అంటే దానికి చాలా ఇష్టం. కోతికొమ్మొచ్చి పైకి ఎక్కడం ఇంకా ఇష్టం. అదెక్కుతుంటే నేను రెప్పవాల్చకుండా చూస్తాను. ఎక్కడ పడిపోతుందొనని భయం. “ఆగు చిట్టీ.కొంచెం చూసి.నెమ్మదిగా” నేను అరిచినా చెల్లికి వినిపించదు. అయితే కోతికొమ్మొచ్చికి నేను వేలాడ్డం.ఊగడం తనకు చక్కగా కనిపిస్తుంది. నవ్వుతూ,వెనుక నుంచి నా కాళ్ళు పట్టుకోవాలని చూస్తుంది. నాకో చెల్లెలుంది. మా ఇంటి దగ్గరి పొదల్లో నాతో కలిసి తిరగాలనుకుంటుంది. అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా నా వెనకాలే వస్తుంది వెనక్కి తిరిగి చెల్లికి ఎదో చెప్పాలనుకుంటాను. అయినా ఏమీ మాట్లాడను. నేను చూడగానే అది అర్థం చేసుకుంటుంది. ఎలాంటి చప్పుడూ చేయకుండా అతి నెమ్మదిగా నడుస్తుంది. ఆగవలసి వస్తే ఆగిపోతుంది. తుప్పల్లో నుంచి వచ్చే చిన్ని చిన్ని చప్పుళ్ళను నేను చెవులు రిక్కించి ఆలకిస్తాను. గడ్డి,కొమ్మలు,రెమ్మలు బాగా కదిలినప్పుడు మ చెల్లాయి కన్నార్పకుందా చూస్తుంది. అప్పుదు మా చెల్లి చాలా చిన్నపిల్ల నేను బడికి పోయేదాన్ని అది మాత్రం ఇంట్లోనే ఉండేది. ఇంట్లోనే కొన్ని మాటలను నేర్చుకుంది. రోజూ అమ్మతో పాటు కింద కూచుని, బొమ్మలతో ఆడుకొనేది. “ఇది బంతి.ఇది కుక్క. ఇదేంటి?… ఇది పుస్తకం” అమ్మ చెప్పేది. బడి నుంచి రాగానే నేనూ కింద కూచుంటాను. మా చిట్టితల్లి “బంది… బంది” అనేది నవ్వుతూ. “ఆ.. అవును.ఇది బంతి” అమ్మలాగే నేనూ రెండోసారి అంటాను. చెల్లాయి అదోలా తలాడించేది. ఆనందంతొ దాని ముఖం విరబూసేది. “బంది” మరోసారి ముద్దుగా అనేది. ఆ పలుకులు స్పష్టంగా ఉండేవి కావు. ఇప్పుడు మా చెల్లి నేను చదివే బడిలోనే చేరింది. తనకు వినిపించదుగా. అందుకని పెదాల కదలికను బట్టి మాటలను ఎలా తెలుసుకోవాలో ఎలా పలకాలో అమ్మ దానికి ఇంటి దగ్గర నేర్పుతోంది. బడిలో టీచర్లకు,మిగతా పిల్లలకు చెల్లి పలికే అన్ని మాటలూ అర్థం కావు. ఏం చెప్పాలనుకున్నా చెల్లి సరిగ్గా చెప్పలేదు. అందుకే అందరికీ దాని మాటలు అర్ఠం కావు. నాకయితే అది మాట్లాడే ప్రతి మాట చక్కగా అర్ఠమవుతుంది. అవును.మా చెల్లి ఏం చెప్పినా నాకు అర్థమవుతుంది. కావాలని నేను నెమ్మదిగా ఒకో మాటను ఒత్తి పలుకుతూ మాట్లాడతాను. చేతుల్ని రకరకాలుగా కదుపుతాను. నా ఒక్కదాని పెదాల కదలికనే కాదు, నా ఒక్కదాని మాటలనే కాదు, ఇలా చెబితే… ఎవరు చెప్పినా మా చెల్లికి అర్థమవుతుంది.

నిన్న నేను నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను. దాని పట్టీ చాలా పెద్దగా ఉంది. అద్దాలు కూడా కారు నలుపులో ఉన్నాయ్ నేను మాట్లాడుతుంటే ఎందుకో చెల్లి వాటిని తీసేయమంది. నా కళ్లు తన కళ్లలో ఏమేం మాట్లాడతాయో మరి! ఇంటి బయట ఇద్దరం ఆడుకుంటున్నాం. అలా ఎంతసేపైనా ఆడుకోవాలని వుంది. అయితే ఇంట్లోకి రమ్మని ఇప్పుడే అమ్మ పిలిచింది. నాకేమో ఆట వదలాలని లేదు…. అవును,మా చెల్లి నేను చెప్పేది అర్ఠం చేసుకుంటుంది. అయితే అన్నిసార్లూ కాదు. నిన్న రాత్రి దానితో అన్నాను- “నా జేబులోంచి పెన్ను తీసుకురావే”అని. అదేం చేసిందో తెలుసా? బల్ల మీదున్న పళ్ళబుట్టలోంచి ఒక యాపిల్ పండును తీసుకొచ్చింది. నా నేస్త్తాలు మా చెల్లి గురించి ఎన్నో అడుగుతారు. 'చెవిటి వారికి చెవుల్లో ఏమైనా నొప్పి ఉంటుందా?' అంటారు. 'మనలాగే వారూ ఆలోచిస్తారా?' అనడుగుతారు. ఎల్లంటి నొప్పి ఉండదని చెబుతాను. మా చెల్లి గురించి నాకు తెలిసినవన్నీ చెబుతాను. అయినా అందరూ దాని బాధను అర్థం చేసుకోరు. అలాంటప్పుడు దాని మనసుకు కష్టం కలుగుతుంది. నాలాగే చెల్లి కూడా అన్నీ ఆలోచిస్తుంది. ప్రేమ,కోపం,బాధ,సంతోషం అన్నీ ఉంటాయి. అయినా తను అనుకునేది మాటల్లో చెప్పలేదు. మనకు - తనకు అదే తేడా. కొన్ని కొన్నిసార్లు చేతులతో కూడా - తను చెప్పలనుకున్నది చెప్పలేకపోతుంది. బాగా కోపమ్ వచ్చినా, చాలా సంతోషంగా ఉన్నా,దు:ఖం కలిగినా తన చేతులతోను,చేతలతోను ఏమిటేమిటో చెబుతుంది అలాంటప్పుడు అదేం చెబుతుందో మరి! మా చెల్లికి ఏ చప్పుడూ వినిపించదు. అయినా ఎక్కడైనా కుక్కలు మొరుగుతుంటే ఇట్టే పసిగడుతుంది. కుక్కలు అలా మొరగడం తనకు ఇష్టం లేనట్టుగా మొహం పెడుతుంది. మా పెంపుడు పిల్లి తన ఒడిలో కూచొని గురపెడితే ఆ సంగతీ తనకు తెలిసిపోతుంది. చేతివేళ్ళతో తాకి రేడియో మోగుతుందో ఆగిపోయిందో తెలుసుకుంటుంది. టెలిఫోన్ మోగే చప్పుడు మా చెల్లికి ఎన్నడూ వినిపించదు. ఎవరైనా తలుపు కొడితే అదీ వినిపించదు. రోడ్డు మీద పోయే రణగొణ ధ్వనులు కూడా మా చెల్లికి ఎప్పుడూ వినిపించవు. ఎప్పుడైనా రాత్రిపూట కరెంటుపోయి ఇల్లంతా చీకటైతే మా చెల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒకోసారి నేను రాత్రప్పుడు చెవుల్లో దూది పెట్టుకుంటాను. అప్పుడు నాకు ఏమి వినిపించదు. గోద మీది గడియారం చేసే చప్పుదు, ముందుగదిలొ ఉన్న టీవి నుంచి వచ్చే పాటలు నాకు వినిపించవు. అంతే కాదు.రోడ్డు మీద పోయే బస్సులు,కార్లు చేసే హోరు కూడా నా చెవులను తాకదు. అప్పుడు నాకు అంతా అయోమయంగా ఉంటుంది. లోకంలో ఎవరూ ఏదీ లేనట్టుగా ఉంటుంది. పాపం మా చెల్లికి కూడా అచ్చం ఇలాగే ఉంటుందా? చెట్ల కొమ్మలు ఊగి మా కిటికీని తాకుతూ చేసే శబ్దాలను మా చెల్లి వినలేదు. గాలికి మోగే చైనాగంటల్ని నేను నా గదిలో కట్టాను. ఆ గంటలు పుట్టించే కమ్మని సంగీతాన్ని పాపం మా చెల్లి వినలేదు. గాలివాన వచ్చినప్పుడు - పెద్దపెట్టున ఆకాశం ఉరిమినా, జోరుగా గాలి వీచి కిటికీ తలుపులను దబదబా బాదినా మా చెల్లికి వినిపించదు. ఏమీ కానట్లే అది నిద్రపోతుంటుంది. అప్పుడు దానికి కాదు, నిజంగా నాకు భయమేస్తుంది. 'మీ చెల్లి టీవీ చూస్తుందా? పాటలు పాదుతుందా?' నా నేస్తాలు అడుగుతుంటారు. ఎందుకు చూడదు. టీవీని తప్పక చూస్తుంది. అయితే ఎలాంటి శబ్దమూ వినలేదు. తన బొమ్మలను ఒడిలో పెట్టుకొని జోకొట్టి నిద్రపుచ్చుతుంది. అయితే జోలపాట మాత్రం పడ్లేదు. తన చేతివేళ్ళతో మా చెల్లి ఎన్నో మాటలు చెబుతుంది. నోటితో ఏదైనా చెప్పినప్పుడు చాలా గట్టిగా అరుస్తుంది. ఒకోసారి అది ఎంత గట్టిగా అరుస్తుందంటే - అప్పుడు మా అమ్మ బలవంతంగా దాని అరుపులను ఆపాల్సి వస్తుంది. నేను పిలిస్తే వినిపించదుగా. అందుకని మా చెల్లి నా వంక చూసేందుకు నేను ఏమేమో చేస్తుంటాను. కాళ్లతో నేలపై గట్టిగా మోదుతాను. గాల్లో నా చేతుల్ని జోరుగా ఊపుతాను. అప్పుడప్పుడూ దగ్గరకు పోయి నా వేళ్ళతో తన చేతులను తాకుతాను. కాలితో నేను దబదబా చేసే చప్పుడు మా చెల్లికి తెలుస్తుంది. చేతి వేళ్ళతో తాకినప్పుడూ తెలిసిపోతుంది. గాల్లో నేను చేయి ఊపినప్పుడు ఎంతో దూరం నుంచే చూడగల్గుతుంది. అయినా… నేను పక్కనే నిలబడి తనను పిలిస్తే ఆ పిలుపును మా చెల్లి వినలేదు. నాకో చిన్న చెల్లి ఉంది. మా చెల్లి వినలేదు.

మా_చెల్లి_బంగారుతల్లి.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)