User Tools

Site Tools


భలే_మేక

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

భలే_మేక [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 + భలే మేక
 +అనగనగా ఒక మేకపోతు
 +దాని పేరు బకబక
 +అది గొర్రెజాతిది.రాజస్థాన్ లో ఉందేది.
 +బకబకకు ఎప్పుడూ తిండి యావే.అది తప్పించి మరో పని లేదు.ఏది దొరికినా ఒక పట్టు పడుతుంది.ఏం తింటున్నాను?​ ఇది తినొచ్చా తినకూడదా?​ అని ఆలోచించనే ఆలోచించదు.
 +ఏదన్నా కనిపిస్తే చాలు.తినడానికి తయారైపోతుంది.
 +దానికి రావిచెట్టు ఆకులంటే చాలా ఇష్టం.దాని పళ్ళంటే ఇంకా ఇష్టం.అన్నిటికన్నా అవే రుచిగా అన్పిస్తాయి.
 +బకబక ఊరంతా తిరుగుతుంది.ఎవరింటి ముందైనా ఎండకు ఆరేసిన బట్టలు కన్పిస్తాయి. ఆ బట్టలను కూడా తినేయాలని చూస్తుంది.
 +అప్పుడప్పుడూ అది ఏం చేస్తుందో తెలుసా. ఎవరింటిలోకైనా దూరుతుంది.
 +ఉట్టిలో ఉన్న పళ్ళు,​ కాయగూరలు అందుకుంటుంది.ఇక వాటి పని అంతే సంగతులు! ​        
 +ఒక్కొక్కసారి బకబక ముళ్ళ మొక్కలను కూడా వదిలిపెట్టదు.కసకసా తినేస్తుంది.దాంతో నోరంతా నొప్పి పెడుతుంది.తినేటప్పుడు ఆ సంగతి ఆలోచించదు.తిన్నాక మాత్రం బాధపడుతుంది.ఎందుకు తిన్నానా అని తిట్టుకుంటుంది.
 +బకబకతో పాటు ఇంకా ఎన్నో గొర్రెలు,​మేకలు ఉన్నాయి.అన్నీ ఒక కొట్టంలో ఉంటాయి.అక్కడ వాటికి పనీపాట ఏమీ ఉండదు.రోజంతా తినడమ్,​నిద్రపోవడం.అంతే వాటి పని.
 +ఎన్నడైనా పట్నం నుంచి ఒక మనిషి వస్తాడు.ఒకో గొర్రెనూ పట్టుకుంటాడు.దాని ఒంటీ మీది బొచ్చును గొరిగేస్తాడు.
 +ఈ బొచ్చును ఎవరెవరో కొనుక్కుంటారట.దాంతో చలికోట్లు,​శాలువాలు తయారు చేస్తారట.సంచీలు,​టోపీలు అల్లుతారట.సరేలెండి.దాని బొచ్చుతో ఎవరేం చేసుకుంటే దానికెందుకు.గొరిగేటప్పుడు గాట్లు పడకుంటే చాలు.పీక తెగిపోకుండా ఉంటే చాలు.అదొక్కటే దాని చింత.
 +బకబక ఉండే మందలో కొన్ని '​పెద్దన్న'​ మేకలున్నాయి.అవి ఎప్పుడూ ముందుంటాయి.అవి ఎక్కడికి పోతే అక్కడికి-మిగతా మేకలు కూడా పోతుంటాయి.ఏ మాత్రం తటపటాయించవు.
 +ఉన్నట్టుండి పెద్దన్న మేకలకు విసుగుపుడుతుంది.మేస్తున్న చోటుతో మొహం మొత్తుతుంది.ఇకనేం.వెంటనే అవి మరో కొత్త చోటికి దారి తీస్తాయి.మందలోని మేకలన్నీ వాతి వేంటబడతాయి.తోకలు ఊపుకుంటూ పెద్దన్నల వెంబడే పోతాయి.అవి వెళ్ళే కొత్త చోటు ఒకోసారి బాగుంటుంది. ఒకోసారి పరమచెత్తగా ఉంటుంది.అది మంచిగా ఉన్నా,​చెత్తగా ఉన్నా సరే,​మిగతా మేకలన్నీ పెద్దన్నల మాటే వింటాయి.అవి ఎక్కడికి పోతే అక్కడికి పోతాయి.
 +మిగతా మేకల్లాగా బకబక కూడా పెద్దన్నల వెనుకే పోతుంది.అయితే అలా ఎందుకు చేస్తుందో దానికే తెలీదు.పెద్దన్నమేకలు దానికి ఏమంత గొప్పగా కన్పించవు.అలాగని మరీ అంత చెడ్డవిగా కూడా అన్పించవు.
 +అన్ని మేకలు పెద్దన్నల వెనుక పోతుంటాయి.అందుకని అది కూడా పోతోంది.అంతే.బహుశా పెద్దన్నల వెంటబడి పోవడమే అన్నిటికన్నా తేలికేమో.అయితే అలా వెళ్ళే ముందు బకబక చాలా సేపు ఆలోచిస్తుంది.అక్కడే నిలబడిపోతుంది.ఈలోగా అన్ని మేకలు ముందుకు పోతాయి.దాంతో బకబక అన్నిటికన్నా చివర్న ఉండిపోతుంది.
 +ఆరోజు బాగా ఎండెక్కింది.పెద్దన్న మేకలకు ఉన్న చోటు నచ్చలేదు.ఇంకేం. మరో కొత్త చోతుకు బయల్దేరాయి.మిగతా మేకలు ఊరుకుంటాయా.తోకలు ఊపుతూ,​ఒకదాన్నొకటి రాసుకుంటూ పెద్దన్నల వెంట బయల్దేరాయి.బకబక కూడా వాటితో పాటే ముందుకు కదిలింది.ఎప్పటిలాగే ఈసారి కూడా అన్నిటికన్నా చివరనే ఉంది.
 +అలా అవి చాలా దూరం నడిచాయి.ఈలోగా మరింత పొద్దెక్కింది.ఎండ మండిపోతుంది.వేడితో కొండలు కోనలు ఉడుకుతున్నాయి.సెగలు పొగలు కక్కుతున్నాయి.పెద్దన్నల వెంటపడి మేకలు చాలాసేపు నడిచాయి.అప్పటికి గాని వాటికి గడ్డినేల దొరకలేదు.అయితే అక్కడి గడ్డి గరుకుగరుకుగాఉంది.తింటుంటే నాలుక కోసుకుంటోంది.బకబక కొంచెం గడ్డి తింది.అంతే నోరంతా దురద పట్టుకుంది.బాగా దాహం వేసింది.దాంతో ఈ మేకల వెంట గుడ్డిగా వచ్చి తప్పు చేసాను అనుకుంది.
 +బకబక ఇక ఏమీ తినకుండా అక్కడే కూచుండిపోయింది.నోటికి పట్టిన దురద పోవాలి.అప్పటి దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు అనుకుంది.అయితే అది ఇలా కూచుందో లేదో.పెద్దన్న మేకలు మరో చోటికి ప్రయాణం కట్టాయి.
 +పెద్దన్న మేకలు బయల్దేరాయి.మిగతా మేకలు వాటి వెంటే సిద్ధమయ్యాయి.అన్నీ ముందుకు కదిలాయి.అంత ఎండలో పడి ఎక్కడికో పోవాలి.బకబకకు అలా పోవడం అస్సలు ఇష్టం లేదు.అయినా చివర్లో అది కూడా లేచి బయల్దేరింది.
 +సరిగ్గా మిట్టమధ్యాహ్నం.ఎండ నిప్పులు చెరుగుతోంది.అంత ఎండలో పడి బకబక నడుస్తూంది.దానికి చాలా కష్టంగా ఉంది.నడుస్తూనే ఆలోచిస్తోంది...ఛీ,​ఛీ.ఈ మేకల వెంటపడి నేను ఎందుకొచ్చాను?​ అసలీ మేకలన్నీ పెద్దన్నల వెంట గుడ్డిగా ఎందుకు పోతాయి?​ పోతే పోనీ. వాటిలాగే తోకూపుతూ నేనెందుకు ఇలా గుడ్డిగా వచ్చేయాలి?​ ఆ మేకలకు పెద్దన్నల వెంట పోవడమే బాగుంటుందేమో! అవి అలా పోయేందుకే అలవాటు పడ్డాయేమో.కాని నాకేమయింది?​ నేనెందుకు ఇలా రావాలి?​
 +బకబక బాగా ఆలోచించింది.ఇంకా ఆలోచిస్తూనే ఉంది.
 +మేకల మంద ముందుకు పొతూనే ఉంది.బకబక కూడా వాటితో పాటు ముందుకు సాగుతోంది.ఇంతలో దూరంగా ఓ నల్లని ఆకారం కన్పించంది.అందులో దుమ్ము-ధూళి,​చెత్త-చెదారం ఇంకా ఏమేమో ఉన్నాయి.నేల నుంచి నింగి దాకా అది సాగి వుంది.అదొక పెద్ద సుడిగాలి.రయ్యిరయ్యిన మంద వేపు దూసుకొస్తోంది.బకబక తన జన్మలో అలాంటి అకారాన్ని చూడలేదు.దాన్ని చూడగానే బకబకకు భయమేసింది.దూరంగా పారిపోవాలనుకుంది.అయితే... పెద్దన్న మేకలు మాత్రం సూటిగా దాని వేపే పోతున్నాయి.మిగతా మేకలూ అదే పని చేస్తున్నాయి.
 +పోయి పోయి మేకలన్నీ సుడిగాలిలో చుక్కుకున్నాయి.సుడిగాలిలో చిక్కడం అంటే మామూలు విషయం కాదు.ప్రాణాలపై ఆశలు వదులు కోవాలి.పాపం బకబక చాల భయపడిపోయింది.తూఫానుగాలి దాన్ని అమాంతం పైకి లేపి కింద పడేసింది.ఆ తర్వాత ఇష్టమొచ్చినట్టు అటూ ఇటూ ఈడ్చి కొట్టింది.ఎటుపడితే అటు విసిరిపారేస్తోంది.బకబక ఊపిరి తిరగడం లేదు.గిజగిజా కొట్టుకుంటోంది.
 +ఆ సుడిగాలిలో అప్పటికే ఎన్నెన్నో చిక్కుకున్నాయి.అవన్నీ ఒకదాన్నొకటి జోరుగా గుద్దుకుంటున్నాయి.బకబకను కూడా అలా ఎన్నో ఢీకొట్టాయి.దాంతో బకబక ఒళ్ళు హూనమయింది.ఒంటినిండా దెబ్బలే.
 +ఎంతపని చేసాను.ఈ పెద్దన్నల వెంట గుడ్డిగా ఎందుకొచ్చాను- అని బకబక బాధపడింది.తన తెలివి తక్కువ పనికి బాగా తిట్టుకొంది.
 +సుడిలో బకబక రంగులు కూడా మారిపోతున్నాయి.ముందుగా అది పసుపు రంగులోకి మారింది. ​
 +ఆ తర్వాత అది ఆకుపచ్చ రంగుదయింది.అచ్చం ఒక దెయ్యం పిల్లలా తయారయింది.ఇప్పుడు బకబక కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి.నాలుక పిడుచకట్టుకుపోయింది.ఒకటే దాహం,​నొప్పి.ఇలా ఏంతసేపు?​ బకబకకు విసుగుపుట్టింది.ప్రాణాలు పోతే బాగుండునని అన్పించింది.ఇప్పుడు దాని స్థితి చాలా ఘోరంగా ఉంది.ఇంక నేను ఎక్కువసేపు బతకనేమో అనుకుంది.
 +ఇంతలో పెద్దన్న మేకలు దాని కంటపడ్డాయి.అవి కూడా సుడిలో చుక్కుకుని గిజగిజలాడుతున్నాయి.వాటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది.భోరుభోరున ఏడుస్తున్నాయి.
 +ఉన్నట్టుండి పెద్దగా గాలి వీచింది.బకబక సుడి నుంచి లాగి బయటకు విసిరికొట్టింది.
 +బకబక జోరుగా పోయి ఒక పొలంలో పడింది.దబాలున పడటంతో బాగా దెబ్బలు తగిలాయి.ఆ పోలంలో మట్టి కొంచెం మెత్తగా ఉంది.దాంతో ఎముకలు విరగలేదు.అంతవరకూ నయమే.
 +బకబక చాలాసేపు అలాగే పడి ఉండిపోయింది.తరువాత మెల్లగా కళ్ళు తెరిచింది.చుట్టూ చూసింది.ఒళ్ళంతా పచ్చిపుండులా తయారయింది.ఒంట్లో ఎక్కడ చూసినా దెబ్బలే.ఒకటే నొప్పిగా ఉంది.
 +దెబ్బలు తగిలితేనేం.ఇప్పుడది ఒక మంచి గుణపాఠం నేర్చుకుంది.సరికొత్త పాఠం.దీనిని బకబక ఇక ఎన్నటికి మర్చిపోదు.
 +ఏ పని చేసినా సొంతంగా ఆలోచించాలి.ఇది మంచిదా కాదా?​ సరైనదా కాదా?​ చేయొచ్చా చేయకూడదా?​ అని బాగా అలోచించాలి.అప్పుడు గాని ఏ పని చేయకూడదు అనుకుంది.
 +'​ఇకపై నేను ఎవరి వెంటా గుడ్డిగా పోను.ఎవరో ఎక్కడికో పోతుంటే వాటి వెంటబడి పోవడమేమిటి?​ అర్థం పర్థం లేదు.ఎక్కడికి పోవాలి?​ ఎందుకు పోవాలి?​ ఎలా పోవాలి?​ అని సొంతంగా ఆలోచించుకోవాలి.పనుంటే పోవాలి.పనికొచ్చేదైతే పోవాలి.లేకపోతే మానుకోవాలి.అందుకే ఇకపై నాకేం కావాలో,​ఎక్కడికి పోవాలో నేనే ఆలోచించుకుంటాను.అనుకొంది బకబక.
 +ఇప్పుడు బకబక అన్నీ సొంతంగా ఆలోచించుకుంటుంది.అప్పటికన్నా ఇప్పుడే అది బాగా సంతోషంగా ఉంది.
  
 +
 +                              గుళ్ గుళ్ గుళుక్కు
 +సీతాపురంలో ఉండే పేరయ్య చదువుకోలేదు.అయినా అందరితో వితండవాదం చేసేవాడు.తన చమత్కారంతో అందరి నోళ్ళూ మూయించేవాడు.జనం అతడ్ని '​మొండి పండితుడు'​అనేవారు.
 +ఒకనాడు కాశీ నుండి ఓ గొప్ప పండితుడు ఆ ఊరికి వచ్చాడు.ఆ పండితుడు అన్ని శస్త్రాలూ చదువుకున్నాడు.ఎంతో మంది రాజులు అతడ్ని మెచ్చుకున్నారు.పెద్ద పెద్ద బహుమానాలిచ్చారు.అంత గొప్ప పండితుడాయన.
 +కాశీ పండితుడు సత్రంలో బస చేసాడు.
 +"​మా ఊళ్ళో ఒక మహాపండితుడున్నాడు.ఇంత వరకు ఆయనతో వాదించి ఎవరూ గెలవలేదు"​ అన్నారు ఊరివాళ్ళు.
 +"​అలాగా!ఒకసారి ఆయన్ని పిలిపించండి.ఆయనతో నాకు వాదించాలని ఉంది."​ అన్నాడు కాశీ పండితుడు.
 +జనం పేరయ్యను పిలుచుకొచ్చారు.
 +ఇద్దరు పండితులూ ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు.
 +పేరయ్య తనతో పాటు ఓ మూట తెచ్చుకున్నాడు.తెల్లని బట్టలో ఏవో చుట్టి తెచ్చాడు.ఆ మూటని ముందు పెట్టుకునికూర్చున్నాడు.
 +"​మన ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వారిని ఊరి జనం తరిమి తరిమి కొడ్తారు.అదే పందెం"​ అన్నాడు.
 +కాశీ పండితుడు దానికి ఒప్పుకున్నాడు.
 +పోటీ మొదలయింది.
 +"​పుస్ పుస్ పుస్ - సుయ్ సుయ్ సుయ్ - సప్ సప్ సప్ - గుళ్ గుళ్ గుళుక్కు అంటే ఏమిటి?"​ అడిగాడు పేరయ్య.
 +కాశీ పండితుడు బిత్తరపోయాడు.పాపం అతడు ఎన్నో శాస్త్రాలు చదివాడు.కాని ఇలాంటిది ఎక్కడా వినలేదు. "​అదేం శాస్త్రం చెప్మా"​ అని కొంచెం సేపు పిచ్చిగా ఆలోచించాడు.చివరకు ఓడిపోయినట్లు ఒప్పుకున్నాడు.
 +పేరయ్య గర్వంగా చూసాడు. ​                                  
 +"ఈ మాత్రం తెలీదా.రొట్టెలపిండి కలిపేటపుడు పుస్ పుస్ పుస్ అని చప్పుడొస్తుంది.రొట్టెలు కాల్చేటప్పుడు సుయ్ సుయ్ సుయ్ అని శబ్దమొస్తుంది..తినేటప్పుడు సప్ సప్ సప్ అంటాం.తిన్నాక నోరు పుక్కిళించుకుంటాం కదా. అదే గుళ్ గుళ్ గుళుక్కు"​ అన్నాడు.
 +అందరూ చప్పట్లు కొట్టారు.మొండిపండితుడు గెలిచి పోయాడు.పందెం ప్రకారం ఊరివాళ్ళు కాశీ పండితుడ్ని తరిమి తరిమి కొట్టారు.
 +'ఆ పేరయ్య మోసం చేసాడు.తన పుర్రెకు పుట్టింది చెప్పి దాన్ని శాస్త్రమన్నాడు.అది చాలా అన్యాయం.అంతే కాదు.ఇంతకు ముందు కూడా చాలా మందిని ఇలాగే మోసం చేసాడట.అతడికి మంచి గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు కాశీపండితుడు.
 +ఏం చెయ్యాలి?​ ఆలోచించాడు.పేరయ్యకు పెద్ద పెద్ద మీసాలున్నాయి.ఆ మీసాలు పీకించేస్తే బుద్ధి వస్తుంది.అందుకే పోతూ పోతూ జనంతో చెప్పాడు.
 +"​వేదాల్లో ఏం రాసారో తెలుసా.పున్నమి రోజునఒక పండితుడు మరో పండితుడుని ఓడిస్తే - గెలిచే పండితుడి మీసాలకు గొప్ప యోగం తడుతుంది.ఆ మీసంలోంచి ఒక వెంట్రుకను పీకి ధాన్యం భోషాణంలో వేసుకుంటే చాలు.మన ధాన్యం ఎప్పటికీ తరిగిపోవు"​ అన్నాడు.
 +అది వినడమే ఆలస్యం.జనం పేరయ్య ఇంటికి పరిగెత్తారు.మీద పడి మీసాలు పీకేసారు.ఒకొక్కరు ఒకో వెంట్రుక పీక్కున్నారు.పేరిశాస్త్రి నొప్పితో గగ్గోలు పెట్టాడు.లబోదిబోమన్నాడు.ఐనా ఎవరూ వినలేదు.నిముషాల్లో అతడి మీసాలు పీకేసారు.ధాన్యం డబ్బాలో వేసుకోడం కోసం ఇళ్ళకు పరిగెత్తారు.
 +ఇప్పుడు పేరయ్య మీసాలు పూర్తిగా పోయాయి.అతడి మూతి హనుమంతుడి మూతిలా ఉబ్బింది.
 +
 +
 +
 +                          షావుకారు తెలివి
 +పాతకాలం నాటి మాట.ఒక షావుకారు ఉండేవాడు.అతనికి ఓ భార్య.ఐతే వారికి పిల్లలు లేరు.పుట్టే అవకాశం కూడా అంతగా లేదు.ఎందుకంటే అప్పటికే ​ వారికి యాభై ఏళ్ళు దాటిపోయాయి.
 +ఒకనాడు వాళ్ళు నిద్రపోతున్నారు.అర్థరాత్రి దాటింది.ఓ నలుగురో ఐదుగురో దొంగలు వచ్చారు.కిటికీ ఊచలు ఊడబీకి ఇంట్లోకి దూరారు.ఇల్లంతా చక్కబెట్టడం మొదలెట్టారు.
 +చప్పుళ్ళకి షవుకారుకి మెలకువ వచ్చింది.కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది.దొంగలు అన్నీ సర్దుకుంటున్నారు.
 +"​ఇప్పుడు నేను అరిచానో దొంగలు నన్ను చావగొడతారు.కాబట్టి అరవకూడదు.ఏదన్నా ఉపాయంతో వీళ్ళ పని పట్టించాలి"​ అనుకున్నాడు షావుకారు.వెంటనే భార్యని నిద్రలేపాడు.
 +"​ఇంత తొందరగా నిద్రపోయావేంటే.నీతో ఓ ముఖ్యమైన మాట చెప్పాలి"​ అన్నాడు.
 +"​ఎంటి?​ ఏం చెప్పాలి?"​ అంది భార్య నిద్రమబ్బుతో.
 +"​మనకో కొడుకు పుట్టాడనుకో.వాడికి ఏం పేరు పెడదాం?"​ అడిగాడు షావుకారు.
 +"​చాల్లెండి సంబరం.ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట - వెనకటికి ఎవరో మీలాంటి వాడే.కొడుకు ​ పుట్టినపుడు చూసుకుందాం.నాకు నిద్రొస్తోంది.పడుకోనీయండి"​ అంది భార్య.
 +"​అదేం కుదరదు.కొడుకు పుట్టాక పేరు కోసం వెతకడం దేనికి?​ పండితుడు దగ్గరికి పరిగెత్తడం దేనికి?​ ఇప్పుడే ఆలోచించి పెడితే పోలే?"​ అన్నాడు షావుకారు.
 +"​మన ఇరుగింటాయన గుర్తుగా మన కొడుక్కి ఆయన పేరు పెడదాం.కామయ్య అని"​ అన్నాడు.
 +"​సరే లెండి.ఇక నన్ను పడుకోనివ్వండి"​ అంది భార్య.
 +"​ఓరి దేవుడో.అప్పుడే నిద్రపోతావా?"​ అన్నాడు షావుకారు.
 +"​అబ్బబ్బబ్బ.నన్ను పడుకోనివ్వరా ఏం.ఎందుకిలా సతాయిస్తున్నారు?"​ అంది భార్య.
 +"​అది కాదే.మనకు ఇంకో కొడుకు కూడా పుట్టాడనుకో.వాడికి ఏం పేరు పెడదాం?"​ అన్నాడు షావుకారు.
 +"​మీకు ఏం తోస్తే అది పెట్టండి.నన్ను మాత్రం నిద్రపోనివ్వండి"​ అంది భార్య.
 +"​మన పొరుగింటాయన గుర్తుగా - మన రెండో కొడుక్కి ఆయన పేరు పెట్టుకుందాం.రామయ్య అని .సరేనా?"​ అన్నాడు.
 +"​సరే లెండి"​ అంది భార్య.
 +ఇలా షావుకారు మూడో కొడుక్కి,​నాల్గో కొడుక్కి కూడా పేర్లు పెట్టాడు.ఎదురింటాయన పేరు సుబ్బయ్య.మూడో కొడుక్కి ఆ పేరు పెట్టాడు.వెనకింటాయన పేరు నర్సయ్య.నాల్గో కొడుక్కి ఆయన పేరు పెట్టాడు.ఈ పేర్లు పెట్టడం కోసం భార్యని మాటిమాటికీ నిద్రలేపాడు.
 +"​ఒకవేళ మనకు ఐదో కొడుకు కూడా పుట్టాడనుకో.వాడికి ఏం పేరు పెడదాం?"​ అడిగాడు భార్యని. పాపం ఆవిడకు బాగా నిద్రవస్తోంది.
 +"​మీ ఇష్టం"​ అంది నిద్రలోనే.
 +"​మన ఐదో కొడుక్కి దొంగ అని పేరు పెడదాం.కొత్తగా ఉంటుంది"​ అన్నాడు షావుకారు.
 +దొంగలు సర్దుకోవడం ఆపేసారు.షావుకారు మాటల్ని ఇష్టంగా వింటున్నారు.వాళ్ళకు భలే నవ్వొస్తుంది.
 +"​ఒకరోజు మన చిన్నకొడుకు ఆడుకోవడానికి పోయాడు.చీకటి పడింది.ఐనా తిరిగి రాలేదు.అప్పుడు ఏం చేద్దాం?"​ అడిగాడు షావుకారు.
 +"​ఏదో ఒకటి చేద్దాంలెండి"​ అంది భార్య చిరాకుగా. '​ఈయనకు గాని పిచ్చెక్కిందా ఏం?'​ అని ఆవిడకు అనుమానం వచ్చింది.రేపు వైద్యుడికి చూపించాలి అని మనసులో అనుకుంది.
 +"​మన చిన్నకొడుకు ఇంటికి రాలేదుగా.అప్పుడు వాడి నలుగురు అన్నల్నీ పిలుస్తాను.వాడిని వెతకడానికి పంపిస్తాను.ఒకవేళ అన్నలు అలా వెళ్ళగానే '​దొంగ'​ ఇలా వచ్చాడనుకో.అప్పుడు నేను ఇంటి మీది కెక్కుతాను.బిగ్గరగా అరుస్తాను.అలా అరిస్తేగాని వాళ్ళు తిరిగిరారు.ఎలా అరుస్తానో చెప్పనా?"​ అన్నాడు షావుకారు.
 +ఈయనకి నిజంగానే పిచ్చెక్కింది అనుకుంది భార్య.
 +షావుకారు మంచం మీద నిలబడ్డాడు.
 +"​ఒరే రామయ్యా! కామయ్యా! సుబ్బయ్యా! నర్సయ్యా! దొంగొచ్చాడు.రండిరా"​ అని బిగ్గరగా అరిచాడు.
 +షావుకారు కేకలు వీధంతా వినిపించాయి.ఆ పేర్లున్న నలుగురు పొరుగువాళ్ళూ పరిగెత్తుకొచ్చారు.వారితో ​ పాటూ వాళ్ళ కొడుకులూ వచ్చారు.అందరూ కట్టెలు పట్టుకొచ్చారు.
 +పాపం,​షావుకారు ఇంట్లోని దొంగలు ఇది ఊహించలేదు.పారిపోడానికి కూడా వీల్లేకపోయింది.అందరూ కలిసి దొంగల్ని పట్టుకున్నారు.వాళ్ళని తాళ్ళతో కట్టేసారు.
 +"​చూసావటే.ఒకవేళ నేను ఈ ఉపాయం పన్నకపోతే ఏమయ్యేదో తెలుసా.దొంగలు అన్ని దోచుకుపోయేవాళ్ళు.'​దొంగ దొంగ'​ అని అరిచినందుకు మనని చితకతన్నేవాళ్ళు.అవునా కాదా?"​ అన్నాడు షావుకారు తన భార్యతో.
 +భర్త తెలివికి భార్య తెగ సంతోషపడింది.
 +
 +
 +
 + ఎన్నడూ వినని మాట
 +అనగనగా ఒక రాజు.ఆయన '​నేనొక గొప్ప చమత్కారిని'​ అనుకొనేవాడు.తన తెలివితో అందరినీ బురుడీ కొట్టించేవాడు.
 +రాజు తన రాజ్యమంతా టముకు వేయించాడు.ఎన్నడూ వినని మాటను రాజుకి వినిపించాలి.అలా వినిపించేవారికి వంద బంగారు వరహాలు బహుమతిగా ఇస్తారు.ఇదే రాజు వేయించిన టముకు.
 +పాపం.బంగారం మీద ఆశతో చాలా మంది వచ్చేవారు.రాజు ఎన్నడూ వినని మాటలు విన్పించేవారు. అయినా - "ఈ మాట నేను ఎప్పుడో విన్నాను"​ అనేవాడు రాజు.వచ్చిన వారిని వట్టి చేతులతో పంపేసేవాడు.
 +రాజు అబద్ధం చెబుతున్నాడని అందరికీ తెలుసు.ఐనా ఏం చెయ్యగలరు?​ ఆయన చేసే మోసం ఎవరికీ నచ్చలేదు.
 +అదే రాజ్యంలో ఒక నిరుపేద ముసలమ్మ ఉండేది.ఆమెకు ఓ మనుమడు.పేరు సింగన్న.వాడు భలే చురుకైనవాడు.ఎంత చిక్కుముడినైనా ఇట్టే విప్పేస్తాడు.అందరూ వాడి తెలివికి అబ్బురపడేవారు.
 +ఒకనాడు అందరూ కలిసి ముసలమ్మ ఇంటికి పోయారు.ముసలమ్మను బతిమాలారు.
 +"​అవ్వా! నీ మనుమడు ఎంతో తెలివైనవాడు.వాడే మన రాజుకి బుద్ధి చెప్పగలడు.ఆయనకి ఎన్నడూ వినని మాట విన్పించగలడు.ఒక్కసారి వాడ్ని రాజు దగ్గరకు పంపించు.బంగారు వరహాలు సంపాదిస్తాడు.వాడి దశ,​నీ దశ పూర్తిగా తిరిగిపోతాయి."​ అన్నారు జనం.
 +ముసలమ్మ ఒప్పుకోలేదు.
 +తలుపు వెనుక నుండి సింగన్న అంతా విన్నాడు.రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే అనుకున్నాడు.ముసలమ్మ వద్దన్నా వినలేదు.
 +సింగన్న రాజు ముందు నిలబడ్డాడు.
 +"​తమరు ఎన్నడూ వినని మాట విన్పిస్తాను"​ అన్నాడు.
 +"​చెప్పు"​ అన్నాడు రాజు.
 +"​మీ తాతగారు మా తాతగారి నుంచి వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నారు.ఈ రోజు వరకు తిరిగి ఇవ్వలేదు.... ఈ మాట మీరెప్పుడైనా విన్నారా?"​ అన్నాడు సింగన్న.
 +అంతే.రాజుకి నోట్లోంచి మాత రాలేదు.మన్నుతిన్న పాములా అయిపోయాడు.సభలో ఉన్న వారందరికీ నవ్వొస్తుంది.నోళ్ళకు అడ్డంగా చేతులు పెట్టుకున్నారు.రాజు ఏం చెప్తాడా అని చూసారు.
 +'​భలే ఇరుక్కున్నానే!'​ అనుకున్నాడు రాజు.ఇప్పుడేం చేయాలి?​ ఆలోచనలో పడ్డాడు.
 +సింగన్న చెప్పిన దానికి '​అవును'​ అన్నాడో ఘోరం జరిగిపోతుంది.వెయ్యి వరహాలు ఇవ్వాల్సి ఉంటుంది.పైగా '​తాత అప్పు చేసిన సంగతి రాజుకి తెలుసు.ఐనా తీర్చలేదు'​ అని జనం అనుకుంటారు.పోనీ '​కాదు'​ అందామా అంటే వంద వరహాలు పోతాయి.అంతే కాదు.'​ఎలాగైతేనేం.చివరకు ఎన్నడూ వినని మాట విన్పించిన మొనగాడు వచ్చాడు'​ అని అందరూ అనుకుంటారు. '​ఎలా అయినా చిక్కే.ఈ కుర్రాడు ఎవరో గాని తనను భలే ఇరికించాడు'​ అనుకున్నాడు రాజు.
 +సింగన్న తెలివికి ముచ్చటపడ్డాడు.
 +"ఈ మాట నేనెప్పుడూ వినలేదు"​ అన్నాడు.
 +వంద వరహాలు వాడికి బహుమతిగా ఇచ్చాడు.అంతేకాదు.వాడికి తన దగ్గర ఉద్యోగం కూదా ఇచ్చాడు.
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +
 +                                                                                                              ​
భలే_మేక.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)