User Tools

Site Tools


పిచ్చిలోకం

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

పిచ్చిలోకం [2018/03/24 11:13]
పిచ్చిలోకం [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                            ముట్టుకోవచ్చా?​
 +మా ఊళ్ళో పెద్దిరెడ్డి పెద్ద రైతు. ఆయన వంద ఎకరాల ఆసామి. ఆయన సేద్దిగాడు బుంగడు.వాడు చెప్పులు కుట్టే రంగడి కొడుకు.
 +ఒక రోజు బుంగడి చేయి పెద్దిరెడ్డికి తగిలింది.పెద్దిరెడ్డి మండి పడ్డాడు.గాడిద కొడకా!ముట్టుకుంటావా?​ అని కసిరాడు.ఇంక ఎప్పుడయినా ముట్టుకుంటే చంపుతా! అని బెదిరించాడు.
 +ఒక రోజు బాగా వాన కురిసింది.పెద్దిరెడ్డీ,​బుంగడూ పొలానికి బయలు దేరారు.పొలంలోకి చెరువు కట్టమీదుగా ​ పోవాలి.
 +ఇద్దరూ చెరువు కట్ట మీదికి వచ్చారు.అంతా బంకమట్టి.పైగా బురద.పెద్దిరెడ్డి పొలంకేసి చూసాడు.అంతే?​ కాలు జారింది.చతికిల బడ్డాడు.లేవలేక పోయాడు.
 +బుంగడు కదలలేదు.మెదలలేదు.పెద్దిరెడ్డిని లేపడానికి పూనుకోలేదు.
 +గడిద కొడకా లేపరా!అంటూ పెద్దిరెడ్డి అరిచాడు.
 +రెడ్డిగారూ!ముట్టుకోవచ్చా!అని అడిగాడు బుంగడు.
 +
 +                           ​  ​ బేరగాళ్ళ మోసం
 +నారాయుడికి మెట్టలో పెసలు పండాయి.మాసూలు చేశాడు.నాలుగు మూటలు కట్టి దాచి పెట్టాడు.నారాయుడి దగ్గర పెసలు ఉండే సంగతి తెలిసింది.బేరగాళ్ళు వచ్చారు.
 +ఇంకా పదినాళ్ళు ఉంచితే ధర పెరగవచ్చు.అప్పుడే ఎందుకు కొలవాలి?​నారాయుడు ఇచ్చేది లేదని చెప్పాడు.
 +రోజులు గడిచాయి.మళ్ళీ బేరగాళ్ళు వచ్చారు.ముందటి కంటే పెచ్చు ధరకు అడిగారు.ధర ఇంకా పెరగవచ్చు. అయితే నారాయుడికి డబ్బు అవసరం.మూటకు పది రూపాయలయినా పెంచమని అడిగాడు.వాళ్ళు ఒప్పుకోలేదు.వెళ్ళిపోయారు.
 +నాలుగుదినాల తరువాత మళ్ళీ ఒకడు వచ్చాడు.ఇంకా ధర తగ్గించి అడిగాడు.
 +నారాయుడు ఆలోచనలో పడ్డాడు.అయినా కొలవలేదు.
 +మరొక వారానికి ఇంకొక బేరగాడు వచ్చాడు.ముందుటికంటే మరింత తగ్గించి అడిగాడు.మళ్ళీ ఇంకొకడు వచ్చాడు.ఇంకొక ముప్పయి తగ్గించి అడిగాడు.నారాయుడికి దిగులు పట్టుకుంది.
 +ఇంతకాలం దాచి పెట్టి ఏం లాభం?​ఇంకా ఆగితే,​మూడు దుగ్గాళ్ళకు తెగబెరకాలో?​ఏమో?​అని భయపడ్డాడు. కొసన వచ్చిన వాడికి పెసలు కొలిచేసాడు.
 +నిజానికాయేడు పెసలు ధర తగ్గనేలేదు.ఇదంతా బేరగాళ్ళ నాటకం.వచ్చిన వాళ్ళు అందరూ ఒకరి మనుషులే.ధర తగ్గినట్టు భయపెట్టారు.నారాయుడి నోరు కొట్టారు.నాలుగు రోజులకు జరిగిన మోసం బయట పడింది.నారాయుడు లబ్బుమని ఏడిచాడు.ఇలాంటి నారాయుళ్ళు ఎంతమందో.
 +
 +
 +                        వేప చెట్టుకు మీసాలు ​
 +నేను మా ఊరు విడిచి ఇరవై ఏళ్ళు అయింది.చుట్టాలను చూద్దామని వచ్చాను.అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! మా ఊరు ఎంతో మారిపోయింది.
 +సాయంకాలం రచ్చ దగ్గరికి వచ్చాను.ఇప్పుడు రచ్చ కూడా ఎంతో మరిపోయింది.చుట్టూ అంగళ్ళు పెట్టారు.
 +దాని మీద ఉండే వేపచెట్టు పెరిగిపోయింది. చెట్టుకింద భూతాలు,​పిశాచాలు పట్టిన జనం.వాళ్ళలో కొందరు పూజలు చేసే వాళ్ళు.కొందరు భజనలు చేసేవాళ్ళు.
 +సంగతి ఏమిటా అని వివరించాను.వేప చెట్టుకు మీసాలు గడ్డాలు వచ్చాయట.ఇది రెండేళ్ళనాడు జరిగిందట.
 +అప్పటి నుంచి జనం పిచ్చిగా రాసాగారు పూజలు చేయసాగారు.ఎంతో దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం బస్సులు కూడా వేసారు.
 +నేను ఆరేయంతా ఆలోచించాను.ఒకప్పుడు మేము ఆ చెట్టు కింద ఆడుకొనే వాళ్ళం,​పాడుకొనే వాళ్ళం.రచ్చ మీద గంతులు వేసే వాళ్ళం.
 +అప్పుడు ఈ చెట్టును పట్టించుకొనే వాళ్ళు లేరు.రెండేళ్ళ కింద దీనికి మీసాలు గడ్డాలు ఎలా వచ్చాయి?​
 +చివరికి అసలు సంగతి కని పెట్టాను.నా పసితనంలో ఒక మంగలి ఆ చెట్టుకింద తల పని చేసేవాడు.ఆ వేప చెట్టు మొదట ఒక గుంటలాగా ఉండేది.ఆయన తల పని చేసాక వెంటుకలు ఉండచేసి ఆ గుంటలో పెట్టేవాడు.
 +ఏళ్ళు గడిచాయి.చెట్టు పెరిగింది.గుంట పూడిపోయింది.ఆ వెంటుకలు కూడా చెట్టులో కలిసిపోయాయి.
 +తరువాత ఆ వెంటుకలు కొద్దిగా ఇటూ అటూ బయట పడ్డాయి.అవే మీసాలు!గడ్డాలు.
 +చూడండి!ఆ మీసాలు గడ్డాలు ఎంత పని చేసాయో!
 +
 +                        ఎవరి మొగంలో ఏముంది?​
 +మా ఎదురింటామెకు శకునాలంటే చెప్పలేని పిచ్చి.
 +ఒకసారి పిడకలు ఏరుతుంటే ఆమెకు తేలు కుట్టింది.కేకలు పెట్టుకుంటూ ఇంటి కొచ్చింది.పొరుగింటి సీతను నానా బూతులు తిట్టసాగింది.లేవగానే నీ పాడు మొగం చూసాను.అందుకే తేలు కుట్టింది అంటూ గొడవ చేసింది.
 +మరొకసారి కట్టెలు కొడుతుంటే కాలికి గొడ్డలి తగిలింది.గాయమైంది.ఈసారి తాయారును తిట్టింది.
 +ఇలా అందరికీ మా పొరుగింటామె తల నొప్పిగా మారింది.
 +ఆమెకు ఎలా బూధ్ధి చెపాలా అని ఆలోచించాను.
 +ఎవరి మొగమో చూడడం దేనికి?​పొద్దున లేవగానే అద్దంలో నీ మొగమే చూచుకో అని సలహా చెప్పాను.
 +ఆమె ఒప్పుకొనింది.దిండు కింద అద్దం పెట్టుకొనింది.నిదరలేచి అద్దంలో తన మొహం చూచుకొనింది.కళ్ళు నులుముకుంటూ వచ్చి గడప దగ్గర జారి దబీమని పడింది.చేయి విరిగింది.
 +దాంతో బుధ్ధి వచ్చింది.అప్పటి నుంచి శకునం పేరుతో తిట్టడం మానుకొనింది.
 +
 +                 ​  ​ లాటరీలో కోరిన సామాను
 +ఎవరో వచ్చి మాఊళ్ళో అంగడి పెట్టారు.రకరకాల సామానులు తెచ్చారు.
 +వారానికి 2 రూపాయలు చీటీ కట్టండి.లాటరీ గెలుచుకోండి.కోరిన సామాను తెచ్చుకోండి అని ఊరంతా దండోరా వేయించారు.
 +చాలా మంది చీటీలు కట్టారు.ఒక వారం ఒకామెకు బిందె వచ్చింది.మరో వారం ఇంకొకరికి చీర వచ్చింది.తరువాత వారం ఒకరికి మంచం వచ్చింది.
 +దీంతో జనానికి పిచ్చి పట్టింది.ఒకే ఇంటిలో రెండు మూడు చీటీలు కట్టారు.ఇంక ఆడవాళ్ళ సంగతి చెప్పాలా?​వందల మంది ఎగబడ్డారు.
 +మూడు నెలలు గడిచాయి.
 +ఒక రోజు ఆ పెద్ద మనుషులిద్దరూ ఉడాయించారు.మూసిన అంగడి తెరవలేదు.
 +లాటరీ రోజు వచ్చింది.అంతా అంగడి దగ్గర చేరారు.తలుపులు పగల గొట్టారు.లోపల ఏముంది?​చింపి చాప గూడా లేదు.
 +అందిరికీ లబోదిబో మనడమే మిగిలింది.
  
పిచ్చిలోకం.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)