User Tools

Site Tools


పకపకలు

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

పకపకలు [2018/03/24 11:13]
పకపకలు [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                             ​ అవ్వకు తాగిస్తా
 +చిట్టి వాళ్ళమ్మ బుజ్జిగాడికి మందు తాగిస్తోంది.బుజ్జిగాడు చిట్టి తమ్ముడు.
 +"​అమ్మా!తమ్ముడికి అది ఎందుకు తాగిస్తున్నావే?"​అని అడిగింది చిట్టి."​తమ్ముడికి నోట్లో పళ్ళు లేవు కదమ్మా.ఇది తాగిస్తే వాడికి పళ్ళొస్తాయి."​అంది అమ్మ.
 +"​నాకు కూడా కొంచెం మందివ్వమ్మా.అవ్వకు తాగిపిస్తాను."​అందిచిట్టి."​అవ్వకు దేనికే?"​ ఆశ్చర్యంగా అంది అమ్మ.
 +"​నీకు తెలీదా ఏం?​అవ్వకు కూడా పళ్ళు లేవుగా!"​అంది చిట్టి.
 +
 +                            హిందీ మొగుడు
 +కాంతమ్మ ఒక హిందీవాడిని పెళ్ళి చేసుకుంది.అతనికి తెలుగు రాదు.అది కాంతమ్మకు ఎంతగానో ఉపయోగపడింది.మొగుడి మీద ఎప్పుడు కోపం వచ్చినా తెలుగులో తిట్టేది.మొగిడికి తెలుగు రాదు!దాంతో అతనికి ఏమీ అర్థమయ్యేది కాదు.
 +ఒకరోజు కాంతమ్మ మొగుడ్ని "​గాడిద"​ అంది.
 +"​గాడిద అంటే ఏమిటి?"​ అని (హిందీలో) అడిగాడు మొగుడు.
 +"​గాడిద అంటే లావుగా,​పుష్టిగా ఉండడం."​ అంది కాంతమ్మ.
 +"​అలాగా!"​ అన్నాడు మొగుడు.
 +ఇంకొకరోజు తన మొగుడ్ని "​గుడ్లగూబ"​ అని తిట్టింది కాంతమ్మ.
 +"​గుడ్లగూబ"​ అంటే ఏమిటి?"​ అని అడిగాడు మొగుడు.
 +"​గుడ్లగూబ అంటే సన్నగా,​పీలగా ఉండడం."​ అంది కాంతమ్మ.
 +"​ఓహో!"​ అన్నాడు మొగుడు.
 +ఒకనాడు కాంతమ్మ నాన్న మంచం పట్టాడు.
 +"​మా నాన్న జబ్బు పడ్డాడు.పలకరించి వద్దాం పద"​ అని మొగుడితో అంది కాంతమ్మ.
 +ఇద్దరూ వాళ్ళ ఊరికి వెళ్ళారు.
 +కాంతమ్మ నాన్న బాగా జబ్బు పడ్డాడు.సగానికి సగం చిక్కిపోయాడు.సన్నగా,​పుల్లలా తయారయ్యాడు.ఒకప్పుడు లావుగా బాగుండేవాడు.
 +"​అయ్యో మామయ్య గాడిదలా ఉండేవాడు,​గుడ్లగూబలా అయిపోయ్యాడు"​ అన్నాడు కాంతమ్మ మొగుడు.
 +కాంతమ్మ మొహం మీద నెత్తురుంటే ఒట్టు.
 +
 +
 +                     ​  ​   డబ్బులు కావాలిగా!
 +నారాయణ వట్టి పిసినారి.ఒకనాడు పొద్దున్నే కొడుకుని పట్టుకొని చావగొడుతున్నాడు.అటుగా వెళ్తున్న కామయ్య అది చూచాడు.
 +"​ఏం జరిగింది నారాయణా?​పొద్దున్నే ఆ చంటాడ్ని ఎందుకు చావగొడుతున్నావు?"​ అని అడిగాడు.
 +"​వీడు వట్టి దద్దమ్మ అయిపోయాడు.మెట్లు ఎక్కే టప్పుడు రెండేసి మెట్లు ఒక్క సారి ఎక్కమని చెప్పాను.అలా చేస్తే చెప్పులు తక్కువ అరుగుతాయి.అయినా ఈ గాడిద ఏం చేశాడో తెలుసా?​ మూడేసి మెట్లు ఒక్కేసారి ఎక్కాడు."​ అన్నాడు నారాయణ చిందులేస్తూ.
 +"​అది మరీ మంచిదిగా!నీ కోడుకు నీకన్నా తెలివైనవాడు.నువ్వు ఒక్కొక్క మెట్టే వదలమన్నావు.వాడు రెండేసి మెట్ల చొప్పున వదిలేశాడు.దాని వల్ల చెప్పులు ఇంకా తక్కువగా అరుగుతాయి.అయినా వాడిని ఎందుకు కొడుతున్నావ్?"​ అన్నాడు కామయ్య.
 +"​నిజమేనయ్యా! వాడి చెప్పులు తక్కువగానే అరిగాయి. అయినా మూడేసి మెట్లు ఎక్కే తొందరలో వాడి ప్యాంటు చిరిగి పోయింది.దాన్ని కుట్టించడానికి డబ్బులు కావాలా వద్దా?"​ అంటూ గయ్యిమన్నాడు నారాయణ.
 +
 +                        ఉడికిన గుడ్లు
 +రాము కోళ్ళఫారంలో పని చేస్తున్నాడు.వాడి చేతుల్లో రోజు కొన్ని గుడ్లు పగిలిపోయేవి.అందువల్ల యజమాని చెతుల్లో దెబ్బలు తినేవాడు.
 +ఒకనాడు వాడికి ఒక కొత్త ఆలోచన తట్టింది.పరిగెత్తుతూ యజమాని దగ్గరకు వెళ్ళాడు.
 +"​అయ్యా!రేపటి నుంచి గుడ్లు పగిలిపోవు.రేపు పొద్దున్నే వచ్చి మీరు చూసుకోవచ్చు."​ అన్నాడు.
 +యజమాని సంతోషించాడు.పక్కరోజు పొద్దున్నే కోళ్ళ ఫారానికి వచ్చాడు.అక్కడ రాము విచారంగా కూచున్నాడు.నెత్తికి చేతులు పెట్టుకున్నాడు.
 +"​ఏరా రామూ!ఏం జరిగింది?​ మళ్ళీ గుడ్లు పగలగొట్టావా?"​ అని అడిగాడు యజమాని.
 +"​ఏం చెప్పమంటావు దొరా! అంతా గందరగోళమయ్యింది.పడిన కష్టమంతా బూడిదయ్యింది.రాత్రంతా నీళ్ళు కాగబెట్టాను.పొద్దున్నే మరిగిన నీళ్ళతో కోళ్ళఫారం నింపాను.అట్లా చేస్తే కోళ్ళు ఉడికిన గుడ్లు పెడతాయని అనుకున్నాను.ఉడికిన గుడ్లైతే పగలవు.అయితే ఇలా అయిపోయింది"​ అన్నాడు రాము విచారంగా.
 +కోళ్ళన్నీ చచ్చిపడి ఉన్నాయి! యజమాని తలతిరిగి పడిపోయాడు!
 +
 +
 +
 +
 +
 +
 +                              మానేస్తాను
 +దానయ్య సిగిరెట్లు బాగా తాగుతాడు.అతని భార్యకు ఆ పొగ గిట్టేది కాదు.ఇల్లంతా కంపు కంపు.మానెయ్యమని దానయ్యకు చెప్పేది.అతను వినేవాడు కాదు.దాంతో ఇద్దరికీ పోట్లాటలు అయ్యేవి.
 +ఒకనాడు దానయ్య భార్య పేపరు చదువుతోంది.అందులో సిగిరెట్ల గురించి రాశారు.
 +"​పేపర్లో ఏం రాశారో చూశావా?​సిగిరెట్లు తాగడం మంచిది కాదు.ఊపిరితిత్తులు పాడవుతాయి.గుండెపోటు,​క్యాన్సరు వస్తాయి.ఇంకా చాలా రోగాలు వస్తాయి-అని రాశారు."​ అంది దానయ్య భార్య.
 +"​పేపర్లో నిజంగా అలా రాశారా?"​ అన్నాడు దానయ్య. "​ఇదిగో చూడు."​ అంది భార్య.
 +"​అలాగా.రేపే మానేస్తాను."​ అన్నాడు దానయ్య.
 +"​నిజంగానా!నువ్వు సిగిరెట్లు తాగడం మానేస్తావా?"​ సంతోషంగా అంది భార్య.
 +"​ఎహే!సిగిరెట్లు మానతానని ఎవరన్నారు.పేపర్ తెప్పించడం మానేస్తాను"​ అన్నాడు దానయ్య.
 +"​ఆ(!"​ భార్య నిలువు గుడ్లేసింది.
 +
 +                              నష్టం
 +భూమయ్య గీసి గీసి ఖర్చు పెడతాడు.ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు.
 +ఒకసారి నెయ్యి ధర తగ్గిపోయింది.ఇంతకు ముందు వంద రూపాయలుండేది.ఇప్పుడు ఎనభై రూపాయలయ్యింది.అందరికీ సంతోషం కలిగింది.భూమయ్యకు మాత్రం విచారం పట్టుకుంది.
 +"​ఏం జరిగింది భూమయ్యా?​ ఎందుకు దిగులుగా ఉంటున్నావు?"​ అని అడిగాడు శరభయ్య.
 +"​నెయ్యి ధర తగ్గిపోయింది.నువ్వు వినలేదా?"​ అన్నాడు భూమయ్య.
 +"​మంచిదేగా!దానికి దిగులు పడడం దేనికి?​సంతోషించాలి గాని."​ అన్నాడు శరభయ్య.
 +"​అయ్యో!నేను నెయ్యి కొననని నీకు తెలుసు కదయ్యా.దాని వల్ల ప్రతి నెల నాకు వంద రూపాయలు మిగిలేవి.ఇప్పుడు ఎనభై రూపాయలే మిగులుతాయి.నెలకు ఇరవై రూపాయలు నష్టం!"​ అంటూ గుండెలు బాదుకున్నాడు భూమయ్య.
 +
 +                    చంద్రుడు-సూర్యుడు
 +"​ఓరే సోమూ!మనకు చంద్రుడి వల్ల ఎక్కువ లాభమా?​సూర్యుడి వల్ల ఎక్కువ లాభమా అని అడిగాడు టీచరు.
 +"​చంద్రుడి వల్ల సార్."​ అన్నాడు సోము.
 +"​అదెట్లారా?"​
 +"​చంద్రుడు రాత్రిపూట చీకట్లో వెన్నెల ఇస్తాడు.చంద్రుడు రాకపోతే అంతా చీకటే.సూర్యుడిదేముంది!పగటి పూట వస్తాడు. పగలు అంతా వెలుతురే ఉంటుంది.అప్పుడు సూర్యుడు వచ్చినా ఒకటే.రాకపోయినా ఒకటే."​ అన్నాడు సోము.
 +                         ​  ​ అడుక్కోవచ్చుగా
 +కోటయ్య లక్షాధికారి.అయినా పిల్లికి బిచ్చం పెట్టడు.ఒకనాడు ఓ బిక్షగాడు వచ్చాడు.
 +"​అయ్యా!చలికి తట్టుకోలేకపోతున్నాను.ఒక పాత లుంగీ ఇప్పించండి."​ అన్నాడు బిక్షగాడు.
 +"​లుంగీ ఎక్కడి నుంచి తేను?​ నాకే లుంగీ లేదు.ఆరు నెలల నుంచి నేను లుంగీ లేకుండానే ఉన్నాను."​ అన్నాడు కోటయ్య.
 +"​అయితే ఒక రూపాయి దానం చెయ్యండి.టీ తాగుతాను."​ అన్నాడు బిక్షగాడు.
 +"​రూపాయా!రూపాయలు ఎక్కడి నుంచి తేను?​ నా ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు."​ అన్నాడు కోటయ్య.
 +"​పోనీయండి అయ్యా.ఇంత అన్నం ఉంటే పెట్టండి.బాగా ఆకలిగా ఉంది."​ అన్నాడు బిక్షగాడు.
 +"​ఏమిటీ!నేను అన్నం పెట్టాలా?​ నాకే తిండి లేదు.రెండు రోజులనుంచి నేను,​ నా పెళ్ళాంబిడ్డలు పస్తులున్నాము."​ రుసరుసలాడాడు కోటయ్య.
 +బిక్షగాడికి కోపం వచ్చింది.
 +"​అలాగైతే ఇంట్లో కూచుని ఏం చేస్తున్నావయ్యా! చిప్ప పట్టుకొని నాతో పాటూ వచ్చి అడుక్కోవచ్చుగా!"​ అన్నాడు.
 +
 + సినిమా ఏనుగు
 +ఒక సినిమా హాలులో '​అడవి ఏనుగు'​ అనే సినిమా ఆడుతోంది.సినిమాలో ఏనుగుకి పిచ్చెక్కెంది.పిచ్చిదై అడ్డదిడ్డంగా పరిగెడుతోంది.
 +అది చూసి యాదయ్య హాలు బయటకు పరిగెత్తాడు.గేటు కీపరు అతడ్ని చూశాడు.
 +"​ఏమిటయ్యా అప్పుడే పోతున్నావు!సినిమా ఇప్పుడేగా మొదలయ్యింది!"​ అన్నాడు.
 +"​నీకు తెలీదా ఏమ్? ఏనుగుకి పిచ్చెక్కింది.అది ఒక్క అడుగు ముందుకు వేసినా - నా పని అయిపోతుంది.నుగ్గునుగ్గు అయిపోతాను."​ అన్నాడు యాదయ్య.
 +గేటు కీపరుకి నవ్వు వచ్చింది.
 +"​మరీ అమాయకుడిలా ఉన్నావే! అది సినిమా ఏనుగు.తెరగుడ్డ దాని బయటకి ఎలా వస్తుంది?​!"​ అన్నాడు నవ్వుతూ.
 +"​అది సినిమా ఏనుగని నీకు,​నాకు తెలుసు.ఏనుక్కి ఆ సంగతి ఏం తెలుసు?"​ అంటూ యాదయ్య పరిగెత్తాడు.
 +
 +
 +
 +
 +
 +నాకు పిల్లలు లేరు
 +పానకాలరావుకి ఒక మేడ ఉంది. మీది భాగంలో తను ఉంటున్నాడు.కింది భాగాన్ని అద్దెకు ఇచ్చాడు.అద్దెకు ఉన్నవాళ్ళకి నలుగురు పిల్లలు.వాళ్ళు బాగా అల్లరి చేసేవాళ్ళు.పానకాలరావు ఆ గోలని భరించలేకపోయాడు.వాళ్ళతో ఇల్లు ఖాళీ చేయించాడు.ఈసారి పిల్లలు లేని వాళ్ళకే ఇల్లు అద్దెకు ఇవ్వాలి అని తీర్మానించుకున్నాడు.అలా అని గోడ మీద రాయించాడు.
 +ఒకరోజు ఎనిమిదేళ్ళ పిల్లవాడు తలుపు కొట్టాడు.
 +"​నాకు మీ ఇల్లు అద్దెకిస్తారా?​నాకు పిల్లలు లేరు.ఒక అమ్మ,​ఒక నాన్న,​ముగ్గురు అక్కలు,​ముగ్గురు అన్నలు మాత్రమే ఉన్నారు."​ అన్నాడు కుర్రవాడు.
  
పకపకలు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)