User Tools

Site Tools


నా_ముద్దుల_కుక్క

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

నా_ముద్దుల_కుక్క [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +  మసాలా వడలు
  
 +          నాకు మసాలా వడలంటే ఇష్టం. ఒకరోజు మా అమ్మ ఆరు మసాలా వడలు చేసింది. నేనూ మా అక్కా తినడానికి కూచున్నాం. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. గీత వచ్చింది. ఆమె అక్క స్నేహితురాలు.
 +          "​రామ్మా! వచ్చి వడలు తినమ్మా"​ అంటూ అమ్మ గీతను పిలిచింది. గీత వడలు తినడానికి కూచుంది.
 +          ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. ఈసారి నా స్నేహితురాలు సీత వచ్చింది.
 +          "​రామ్మా! వచ్చి వడలు తినమ్మా"​ అని అమ్మ పిలిచింది. సీత వడలు తినడానికి కూచుంది. ఇప్పుడు నలుగురం అయ్యాం. ఆరు మసాలా వడలే ఉన్నాయి.
 +           ​ఇంతలో ఎవరో తలపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. వసంత,​ మీనా వచ్చారు. వాళ్ళు పక్కింటి పిల్లలు.
 +           "​రండమ్మా! వచ్చి వడలు తినండి"​ అని అమ్మ పిలిచింది. వసంత,​ మీనా వడలు తినడానికి కూచున్నారు. మొత్తం ఆరుమందిమి అయినాము. ఆరు మసాలా వడలే ఉన్నాయి. తలా ఒకటి పెట్టుకున్నాము.
 +           ​నాకు వడల మీద ఆశపోయింది. ఏడుపు వచ్చింది. ఆ ఒకటి కూడా తినాలనిపించలేదు.
 +           ​ఇంతలో ఎవరో తలుపు తట్టారు. మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. అమ్మ తలుపు తీసింది. ఆ వచ్చింది నాయనమ్మ. చేతిలో పెద్ద స్ట్టీలు టిఫిను ఉంది.
 +           "​మసాలా వడలు చేసుకుని తెచ్చా"​ అనింది నాయనమ్మ.
 +            నాకు నవ్వు వచ్చింది. టిఫిను మూత తీసి చూశాను. చాలా మసాలా వడలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మసాలా వడలంటే ఇష్ట్టం వేసింది. నోరూరింది. నాయనమ్మను ముద్దు పెట్టుకొన్నాను. అందరం కడుపు నిండా తిన్నాం.
 +
 +
 + పొడుగు - పొట్టి
 +
 +           ​రంగయ్య పొడుగ్గా ఉంటాడు. వెంకయ్య పొట్టిగా వుంటాడు. ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ఒకే ఇంట్ల్లొ వుంటారు.
 +           ​రంగయ్య పెద్ద సైకిల్ తొక్కుతాడు. వెంకయ్య చిన్న సైకిల్ తొక్కుతాడు.
 +           ​ఒక రోజు రంగయ్య వెంకయ్య విందుకు వెళ్ళారు. జనంలో ఇద్దరూ విడిపోయారు. కొంచెం సేపు తర్వాత ఎవరికి వాళ్ళు ఇల్లు చేరుకొన్నారు.
 +           "​రంగన్నా! నువ్వు బాగా భోంచేశావా?"​ అని వెంకయ్య అడిగాడు.
 +            "​భోజనమే చేయలేదు వెంకన్నా. కుర్చీ చాలా పొట్టిగా ఉంది. నేను కుర్చీలో కూర్చోలేకపోయాను. నువ్వు బాగా భోంచేశావా వెంకన్నా?"​ అని రంగన్నా అడిగాడు.
 +             "​లేదన్నా! నాకు కుర్చీ చాలా ఎత్తు అయిపోయింది. నేను కుర్చీపై ఎక్కలేకపోయాను"​ అని వెంకయ్య చెప్పాడు.
 +             "​ సరే ఏం చేద్దాం! మనం ఎవ్వరింటికీ పోగూడదు. మనింట్లోనే మనం తిందాం. అనుకొన్నారు. అప్పటినుంచి ఒక్క పెళ్ళికి కూడా పోతే వొట్టు.
 +
 +
 +  నక్క చెప్పిన కథ
 +         
 +              అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహానికి రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. కనుక ప్రతిరోజు రాత్రి ఒక జంతువు దానికి నిద్రపోయేదాకా కథలు వినిపించాలని అడిగింది.
 +              రోజుకొక్క జంతువు వచ్చి కథలు చెప్పేవి. ఎన్ని కథలు చెప్పినా సింహానికి నిద్ర వచ్చేది కాదు.
 +              సరిగ్గా కథ చెప్పలేదని సింహం ఆ జంతువుల్ని అడవి నుంచి తరిమేసింది.
 +              ఒక రోజు ఒక నక్కవంతు వచ్చింది. నక్క సింహానికి ఇలా కథ చెప్పసాగింది.
 +              "​అనగనగా ఒక అడవిలో ఒక పిట్ట ఉండేది. ఒక రోజు ఆ పిట్ట ఒక చెట్టు కింద చాలా గింజలను చూసింది.అది ఒక గింజ తీసుకుని గూటికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకొని వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకొని వెళ్ళింది."​ ఇలా ఒక గంటసేపు నక్క చెప్పింది.
 +              "​చాలు,​ చాల్లేవయ్యా! తరవాత ఏం జరిగిందో చెప్పు"​ అని సింహం గర్జించింది. మళ్ళీ నక్క చెప్పడం ప్రారంభించింది.
 +              "ఆ పిట్ట అలసిపోయింది. తర్వాత దాని భర్త పిట్టను పంపింది. అదీ ఒక గింజ తీసుకుని గూటికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకుని వెళ్లింది."​ అని మళ్లీ నక్క ఒక గంట సేపు చెప్పింది.
 +              "​చాలు,​ చాల్లేవయ్యా తర్వాత ఏం జరిగిందో చెప్పు"​ అని సింహం గర్జించింది. మళ్ళీ నక్క చెప్పసాగింది.
 +              "​భర్త పిట్ట అలసిపోయింది. పక్కింటి పెంచలయ్య పిట్టను పంపింది. అది ఒక గింజ తీసుకు పోయింది. మళ్ళీ వచ్చి ఒక గీంజ తీసుకుపోయింది"​ అంటూ చెప్పడం మొదలుపెట్టింది.
 +              సింహానికి విసుగుతో ఆవులింత వచ్చింది.
 +              "​చాలు,​ చాల్లేవయ్యా నాకు నిద్ర వస్తోంది. నువ్వు పోవచ్చు"​ అని సింహం నక్కను పంపివేసింది. నక్క నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
 +
 +
 +                                         ​  ​      ​నా ముద్దుల కుక్క
 +
 +
 +          నా కుక్క అల్లం రంగులో ఉంటుంది. అందుకని నేను దానికి అల్లం అని పేరు పెట్టాను.
 +          నేను బడి నుంచి వచ్చేవేళకు అల్లం కాచుకుని ఉంటుంది.
 +          అల్లం చాలా తెలివి గల కుక్క. నేను రోజూ అల్లంతో బంతి ఆట ఆడుకుంటాను. నేను బంతి విసిరితే అది వెళ్ళి దానిని తెస్తుంది. నేను దానితో దాగుడుమూతలు ఆడుకుంటాను. నేను దాక్కుంటే అది నన్ను వెతికి పట్టుకుంటుంది.
 +               ​ఒకరోజు నేను బడి నుంచి వచ్చేవేళకు ఇంటి ముందు అల్లం కనబడలేదు. ఎక్కడికి పోయింది?​ ఇంట్లో ఉందేమో అనుకుంటూ ఇంట్లోచూశాను. కానీ ఆ రోజంతా అల్లం నాకు కనబడలేదు. నాకు తెలిసిన చోట్లన్నీ వెతికాను. కానీ కనబడలేదు.
 +               ​మర్నాడు రాత్రి పళ్ళెంలో పాలుపోసి కాచుకుని కూచున్నాను. అల్లం నమ్మదిగా వచ్చి పాలు తాగి వెళ్ళిపోతూ ఉంది. నేను దాని వెంట నెమ్మదిగా వెళ్ళాను. అది పక్క ఇంట్లో పశువుల పాకలోకి పరుగెత్తింది. నేను దాని వెంట వెళ్ళాను.
 +               ​అక్కడ అల్లంను చూచి నాకు బలే ముచ్చటేసింది. చూస్తూ నిలబడ్డాను.
 +               "​అమ్మా దొంగా! ఇదా నువ్వు చేసిన పని"​ అని దగ్గరకు పోయి చూశాను.
 +               ​అల్లం మూడు బుజ్జి పిల్లలను కనింది. నేను అల్లంను,​ దాని పిల్లలను ఇంటికి తీసుకొచ్చాను. అప్పట్నుంచి నలుగురు అల్లంలు అయ్యారు! ​             ​
 +
 +
 +  తుమ్మెద ఎందుకు ఏడుస్తుంది ?
 +
 +              అనగనగా ఒక అడవి. ఒకరోజు అడవిలో జంతువులన్నీ నిద్రపోతున్నాయి.
 +              కొంచెంసేపటికి సింహానికి మెలకువ వచ్చింది.
 +              "​మధ్యాహహ్నమయినా ఎవరూ ఇంకా లేవలేదు"​ అని మంత్రిని అడిగింది.
 +              " మహారాజా! కోడిపుంజు కూయలేదు. అందువల్ల జంతువులు లేవలేదు"​ అని మంత్రి చెప్పాడు.
 +              సింహం పొద్దున ఎందుకు కూయలేదు"​ అని అడిగింది.
 +              "​మహారాజా! గుర్ర్రం నా పిల్లలను తొక్కేసీమ్ది. పిల్లలు చచ్చిపోయాయి. నేను నా భార్య దిగులుతో ఏడుస్తున్నాము. అందువల్ల కూయలేదు"​ అని కోడిపుంజు చెప్పింది.
 +              సింహం గుర్రాన్ని పిలిచింది.
 +              "​నువ్వు కోడిపిల్లలను ఎందుకు తొక్కేవు?"​ అని అడిగింది.
 +              "​మహారాజా! ఎద్దు పరిగెత్తింది. దానిని చూచి భయపడి నేను పరిగెత్తాను. పొరపాటున కోడిపిల్లలను తొక్కేను"​ అని గుర్రం చెప్పింది.
 +              సింహం ఎద్దును అందరినీ భయపెట్టేలాగా ఎందుకు పరుగెత్తినావు?"​ అని అడిగింది.
 +              "​మహారాజా! నన్ను ఒక తుమ్మెద కుట్టింది. నొప్పితో నేను పరుగెత్తాను"​. అని చెప్పింది.
 +              సింహం తుమ్మెదను పిలిచింది.
 +              "​తుమ్మెదా! నువ్వు ఎందుకు ఎద్దును కుట్టావు"​ అని అడిగింది.
 +              "​మహారాజా! నేను ఎద్దును తమాషాకు కుట్టాను. అది ఎలా పరిగెత్తుతుందో చూచి నవ్వాలని కుట్టాను"​ అని చెప్పింది.
 +              "​నువ్వు సరదాగా కుట్టావు. కానీ కోడిపిల్లలు చచ్చిపోయినాయి. నువ్వు అడవిలో ఉండకూడదు"​ అని సింహం దాన్ని తరిమేసింది.
 +              "​నన్ను క్షమించడి,​ నన్ను క్షమించడి"​ అని తుమ్మెద వెళ్ళిపోయింది.
 +              కానీ అది ఆ రోజునుంచి ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉంది. "​నన్ను క్షమించు,​ నన్ను క్షమించు"​ అని చెట్ల్లలో తిరుగుతూ ఉంది.
 +
 +
 +            ​
 +                                                            కోకిల
 +
 +             ​అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కోయిల ఉండేది. అది భార్యాబిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేది. పగలంతా సంతోషంగా పాటాలు పాడేది.
 +             ​ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అడవికి పోయాడు. కోయిల తియ్యగా పాడటం చూశాడు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ చెప్పాడు. చాలా మంది జనం అడవికి వెళ్ళి ఆ కోయిల తియ్యటి పాటలను విన్నారు. అందరికీ ముచ్చటేసింది.
 +             ​అలా అలా ఈ సంగతి దేశమంతా పాకింది.
 +             ఆ దేశపు రాజుకు కూడా కోయిల సంగతి తెలిసింది. ఆ కోయిలను పట్టించి ఒక పంజరంలో పెట్టించాడు. దానికి మంచి పళ్ళు పెట్టాడు. కానీ కోయిల పాడేది కాదు. అది రోజురోజుకీ నీరసించి పోసాగింది. దిగులుతో ఏమీ తినేది కాదు.
 +             "​కోయిల ఎందుకు పాడటం మానేసింది"​ అని రాజు మంత్రిని అడిగాడు.
 +             "​మహారాజా! అది అడవిలో భార్యాబిడ్డలతో ఉండేది. సంతోషంగా పాటలు పాడుతుండేది. కానీ పంజరంలో దానికి స్వతంత్రం లేదు. అందువలన అది దిగులుతో పాడటం లేదు"​ అని మంత్రి చెప్పాడు.
 +             ​రాజు కోయిలను వదిలివేశాడు. కోయిల అడవి చేరింది. తన కుటుంబంతో కలిసింది. మళ్ళీ తియ్యటి పాటలు పాడి అందరినీ సంతోష ​ పెట్టసాగింది.
 +
 +
 +
 +                                                              ఎలా బతకాలి?​
 +
 +                  అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు. అతడు ఒక రోజు రాత్రి భార్యతో,​ "​ఏమే! మన గాడిద ముసలిదయింది. దానిని చంపేసి కూర వండుకుందాం"​ అన్నాడు. ఆ మాట గాడిద విన్నది. రాత్రికి రాత్రి అది పారిపోయింది.
 +                 ​అది పోతుండగా దారిలో ఒక కోడిపుంజు కనపడింది.
 +                 "​తమ్ముడూ! నువ్వు ఎక్కడికి పోతున్నావు?"​ అని గాడిద కోడిపుంజును అడిగింది.
 +                 "​రేపు చుట్టాలు వస్తారు. కోడి పుంజుని కోసి కూర వండు అని మా యజమాని వంట వాడితో చెప్పాడు. అది విని నేను పారిపోతున్నాను"​ అని కోడిపూజు చెప్పింది.
 +                 "​నాకు అదే జరిగింది తమ్ముడూ! ఇద్దరం కలిసి ఎక్కడికైనా పోదాము"​ అన్నది గాడిద.
 +                 ​ఇంకా కొంత దూరంపోయిన తర్వాత ఒక కుక్క కనబడింది.
 +                 "​తమ్ముడూ! ఎక్కడికి ​ పోతున్నావు"​ అని కుక్కను గాడిద అడిగింది.
 +                 ​నేను 10ఏండ్లుగా మా యజమాని ఇంటికి కాపలా కాశాను. నిన్న రాత్రి ఒక సంగతి జరిగింది. ఈ "​కుక్క ముసలిదయింది. దీనికి తిండిపెట్టడం కూడా దండగ. దురంగా తీసుకుపోయి చంపేయి అని మా
 + ​యజమాని పనివాడికి చెప్పాడు. నేను అది విని పారిపోతున్నాను"​ అని కుక్క చెప్పింది.
 +                 "​మాకూ అదే జరిగింది ​ తమ్ముడూ,​ నువ్వు కూడా మాతో రా"​ అని గాడిద చెప్పింది. గాడిద,​ కొడిపుంజు,​ కుక్క ఒక చోట కూచున్నాయి.
 +                 ​ముగ్గురం కలిసి బుర్ర కథలు చెప్పి ఆహారం సంపాదించు కుందాం అని అనుకున్నాయి. ఆ రోజు నుంచి వీధి వీధికి వెళ్ళి అవి బుర్రకథ చెప్పేవి. కుక్క తంబుర వాయించింది. కోడిపుంజు మద్దెల వాయించింది. గాడిద బుర్రకథ చెప్పింది. జనం ఈ వింతను చూచి సంతోషంగా వాటికి ఆహారం పెట్టేవారు.
 +
 +
 +       
 +
 +
 +
 +                         ​  ​  ​ఉపాయం
 +
 +                 ​ఒకరోజు నేను ఇంటి ముందు కూచుని చదువు కుంటున్నాను. అమ్మా,​ నాన్న,​ అక్క అందరూ బజారుకు వెళ్ళారు.
 +                 ​వంటగదిలో నుంచి ఏదో శబ్ద్దం వచ్చింది. "​ఇంటిలో ఎవరూ లేరే! ఎవరో?​ " అని వంటగదిలోకి వెళ్ళాను. నాకు భయం వేసింది. అక్కడ ఒక కోతి ఉంది. అది తిండి కోసం వెతుకుతూ ఉంది. నన్ను చూచి గబగబా బయటకుపోయింది. పోతూ పొతూ ఒక వెండి గిన్నె చేత పట్టుకుపోయింది.
 +                   ​అది ఒక చెట్టుపైకి ఎక్కి కూచుంది. నేను చెట్టు దగ్గరకు వెళ్ళాను.
 +                "​ఏయ్ కోతీ! నా గిన్నె ఇవ్వు"​ అని అరిచాను.
 +                   "​ఉ,​ ఉ, ఉ" అని అది నన్ను వెక్కిరించింది. ​
 +                "​ఏయ్ కోతీ! నా గిన్నె ఇచ్చేయి"​ అని వేలు చూపించి మళ్లీ కోపంగా అడిగాను. ​   అది "ఉ, ఉ, ఉ" అని పళ్ళు తెరచి వెక్కిరించింది.
 +                    నేను దిగులుగా ఇంటిలోకి వెళ్ళాను.
 +            ఒక ఉపాయం తట్టింది. ఒక అరటిపండు చూపించాను. కోతి చెట్టు దిగి వచ్చింది. గిన్నె అక్కడ పడేసి అరటిపండు తీసుకుంది. చెట్టెక్కింది.
 +            నా గిన్నె నాకు చిక్కింది.
 +              కోతికి ఆకలి తీరింది.  ​
 +              ​
నా_ముద్దుల_కుక్క.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)