User Tools

Site Tools


జాబులు_చదివే_గాడిద

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

జాబులు_చదివే_గాడిద [2018/03/24 11:13]
జాబులు_చదివే_గాడిద [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                          జాబులు చదివే గాడిద
  
 +  రామలింగడి పొరుగింటిలో తాతాచారి ఉండే వాడు. తాతాచారి పిసినారి.పైగా తగువులమారి.రామలింగడికీ తాతాచారికీ పడేది కాదు.
 +ఒక రోజు రామలింగడు జాబు రాయడం తాతాచారి చూచాడు.జాబులో ఏమి ఉందో చూడాలని ఆరాటం కలిగింది.
 +తాతాచారి దొంగ చాటుగా రామలింగడి వెనక చేరాడు.వంగి వంగి జాబు చూడసాగాడు.లోలోపల చదవ సాగాడు.రామలింగడు ఇది గమనించాడు.
 +జాబులో ఇలా రాసాడు.
 +నా వెనక ఒక గాడిద ఉంది.దానికి పరాయి జాబులు చదవడం అలవాటు.చాలా సంగతులు రాయాలని ఉంది.అయితే గాడిదకు ఈ సంగతులు తెలియడం బాగుండదు.అందుకే రాయడం లేదు.అని జవాబు ముగించాడు.తాతాచారి ఇది కూడా చదివాడు.కోపంతో ఊగిపొయాడు.అయితే పాపం ఏం చేయగలడు?​
 +రెండో కంటికి తెలియకుండా పారిపొయాడు.
 +
 +
 +
 +                            ఆశకు పోతే?​
 +
 +ఒక పులి ముసలిదయి పోయింది.వేటాడ డానికి దానికి బలం లేదు.తిండి ఎలాగా అని ఆలోచించింది.
 +అది ఒక బంగారు కడియం సంపాదించింది.చెరువు దరిన చేరింది.
 +ఒక బాటసారి అ దారిన పోతుండగా పులి చూసింది.
 +ఓ నరుడా! అని పిలిచింది.
 +ఇదుగో బంగారు కడియం.నీకు దానం చేయాలని ఉంది తీసుకో అనింది.
 +బాటసారికి కడియం చూసి అశ కలిగింది.పులిని చూసి భయం కలిగింది.
 +నీవు పులివి! చంపుతావు అంటూ ఆగి పోయాడు.
 +పులి అతడి ఆశను గమనించింది.
 +నేను ఇంతకు ముందు చాలా పాపాలు చేసాను.ముసలి దానిని అయినాను.నాకు కోరలు లేవు.శరీరంలో బలం కూడ లేదు.దానం చేసి పాపం నుంచి బయట పడాలని ఉంది.ఈ రకంగా అయినా పైలోకాలకు పోతాను.నా మాటలలో మోసం లేదు.రా! చెరువులో మునుగు.ఈ కడియం దానంగా తీసుకో!అనింది.
 +బాటసారికి బయం వుంది.కాని ఆశ చావలేదు.పోయి చెరువులో దిగాడు.బురదలో దిగబడి పోయాడు.
 +నేను పైకి లాగుతాను అంటూ పులి చెరువులో దిగింది.బాటాసారిని చంపి తినేసింది.
 +మోసగాడి వలలో పడితే ఏమవుతుందో చూసారా?​
 +
 +
 +
 +
 +
 +
 +
 +                       ​  ​        ​కాసులు కాచిన మొలక
 +
 +అనగనగా ఒక రాజు.ఆ రాజు రోజూ వేటకు పోయేవాడు.
 +ఒక రోజు ఒక వింత జరిగింది.ఒక ముసలివాడు మామిడి మొలక నాటడం రాజు కంట పడింది.
 +రాజు ఎగతాలి చేసాడు.
 +తాతా!ఎంత అమాయకుడివి!ఈ మొలక పెరిగేది ఏనాటికి?​ కాయలు కాచేది ఏనాటికి?​ అందాకా నువు బతుకుతావా?​ అని అడిగాడు.
 +రాజా! ఒక నాటికి ఈ మొలక మానవుతుంది.అంతదాకా నేను ఉంటానని కాదు.కాయలు నా కొడుకు తింటాడు.కూతురు తింటుంది.మనవలు తింటారు.
 +ఒక రోజు మన తాతలు నాటారు.వాటి కాయలే గదా మనం తినేది!
 +ఏపని అయినా మన కోసమే చేయాలా?​అందరూ అలాగే అనుకుంటే ఏమవుతుంది?​ఈ లోకం ఇంత దూరం రాగలిగేదా?​అని తాత అనే సరికి రాజు తలదించాడు.
 +తాత మాటలు రాజు గుండెకు తగిలాయి.ఎంత మంచి మాటలు!ఎంత మంచి మనసు?​రాజు మనసు ఆనందంతో నిండిపోయింది.కానుకగా తాతకు పది బంగారు కాసులు అందించాడు.
 +చూచావా రాజా!ఈ మొలక నాటిన రోజే కాసులు కాచింది.అంటూ తాత సంబరపడి పోయాడు.
 +
 +
 +                                ఏ కాలం మంచిది?​
 +
 +అనగనగా ఒక రాజు.ఆయనకు ఒక అనుమానం కలిగింది.వెంటనే అందరినీ పిలిచాడు.కొలువు దీరాడు.
 +ఎండాకాలం,​వానాకాలం,​చలికాలం,​ఇలా చాలా కాలాలు గదా!వీటిలో ఏ కాలం మంచిది?​అని అడిగాడు.
 +రాజుగారి మనసులో ఏమి ఉందో?​ఆయనకు ఏ కాలం మంచిదో ఎవరికి తెలుసు?​అందుకని ఎవరూ పలకలేదు.
 +చివరకు ఒక ముసలాయన లేచాడు.తమరు కోపగించక పోతే చెపుతా!అని నసిగాడు.
 +భయంలేదు.నీ మనసులోది తెలుపు.అనినాడు రాజు.
 +రాజా!కలిగిన వాడికి ఏకాలమయినా మంచిదే.ఎ కాలం వసతులు ఆకాలంలో ఉంటాయి.
 +ఏ బధయినా పేదవాడికే.పేదవాడికి ఏ కాలమయినా గండమే.ఎండాకాలం ఏండల బాధ.వానాకాలం వరదల బాధ.చలికాలం ఎముకల కొరికే చలిబాధ.
 +అందుకని కాలానికి మంచీలేదు,​చెడూ లేదు.అని ముసలాయన ముగించాడు.
 +రాజుగారి మొగం మాడిపోయింది.కొలువు ముగించి లేచి పోయాడు.
 +
 +
 +                              గాడిద దొరికింది
 +
 +ఏడుకొండలు అమాయకుడు.వాడికి ఎవరూ లేరు.ఆ ఊరూ ఈ ఊరూ తిరగతాడు.చివరకు ఒకరు చేరదీసారు.గాడిదలు మేపడానికి పంపారు.
 +ఏడుకొండలు వాటిని మేపుతూ తిరగసాగాడు,​తిరిగి తిరిగి అలసిపోయాడు.ఒక గాడిద మీద కూచుని మిగతావి తోలసాగాడు.
 +కొంతదూరం పోయాడు.గాడిదలు ఏడూ లేవేమో అని అనుమానం కలిగింది.ఒకటి,​రెండు,​మూడు,​నాలుగు,​అయిదు,​ఆరు,​ఏడోది ఏది? కనిపించడం లేదు.
 +ఒక గాడిద పోయింది.ఇంటికి పోతే తంతారు.ఏడుకొండలికి భయం వేసింది.దిగులుగా గాడిద మీద నుంచి దిగాడు.
 +నడుచుకుంటూ నాలుగు వైపులా వెతికాడు.కొంతసేపటికి మరోసారి ఎంచాడు.
 +ఏడు గాడిదలు సరిపోయాయి.ఎగిరి గంతేసాడు.
 +కొంతదూరం పోయాక నడవలేక పోయాడు.పాదాలు మంట.నడుములు తీత.ఈ సారి ఇంకొక గాడిద మీద కూచొని తోలసాగాడు.
 +గాడిదలు ఏడు లేవేమో అని అనుమానం కలిగింది.ఎంచాడు.ఆరు గాడిదలే!ఏడోది ఏది? లేదు పోయింది.ఏడు కొండలు దిగులు పడిపోయాడు. ఏడిచాడు.
 +దిగి వెతుకుతూ నడవసాగాడు.భయంగా ఉంది.తంతారేమో!ఏం చేయాలి?​ ఆమూల ఈ మూల చూచాడు.ఇంకొకసారి ఎంచాడు.
 +ఇపుడు ఏడూ సరిపోయాయి.గాడిద దొరికింది.ఇంక గాడిద మీద కూచోను.నేను కూచుంటే ఒకటి మాయమవుతుంది.అనుకుంటూ,​నడుచుకుంటూ ఏడుకొండలు ఇంటికి చేరాడు.
 +
 +
 +                             ​  ​ రిక్షా రాముడు
 +
 +రంగడు చలపతిగారి పాలేరు.ఒక రోజు రంగడిని పొలంలో పాము కరిచింది.లింగం వేసారు.అయినా చనిపోయాడు.
 +రంగడికి ఒకడే కొడుకు.వాడి పేరు రాముడు.ఒకనాడు రాముడు చలపతి ఇంటికి పోయాడు.
 +బాబుగారూ! మా నాయన మీపొలంలోనే పోయిండు.నా కూలితో కొంప గడవదు.ఆ కూలి గూడా రోజూ దొరకదు.జానెడు నేల సూపించండి.ఎగసాయం చేసుకుంటా.మీ పాదాల కాడనే పడుంటా అని అడిగాడు.
 +చలపతి నాగుపాములాగా లేచాడు.
 +ఒరే మీ నాయన నాకోసం పోయాడా!
 +ఆయువు తీరింది పోయాడు.ఇంకానయం.నేనే చంపినానని అనలేదు.అని కసిరాడు.ఉరిమాడు.
 +రాముడికి ఏమి చేయాలో తోచలేదు.టవునికి చేరాడు.రిక్షా లాగుతూ బతుకు గడపసాగాడు.కొంత కాలానికి ముసలి వాడయి పోయాడు.
 +ముసలివాడి రిక్షా ఎవరికీ పనికి రాలేదు.రాముడికి బాడుగులు లేవు.తిండికి జరుగు బాటు లేదు.ఏమి చేయాలి?​ ఎలా బతకాలి?​ఊపిరి పోయే దాకా ఇంత తిండి కావాలి.ముసలివాడు ఏ పని చేయగలడు?​
 +ఇది ఒక రిక్షారాముడి కధ. ఈ దేశంలో ఇలాంటి వారు ఎందరో.
జాబులు_చదివే_గాడిద.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)