User Tools

Site Tools


చాదస్తపు_మొగుడు

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

చాదస్తపు_మొగుడు [2018/03/24 11:13]
చాదస్తపు_మొగుడు [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 + పాపం దేవుడు
  
 +ఒకసారి రామలింగడు పొరుగూళ్ళో వున్న పెద్ద చెల్ల్లెలిని చూడబోయాడు.భోజనాలు పూర్తయినాయి.అప్పుడు పెద్ద చెల్లెలు రామలింగడిని ఒక కోరిక కోరింది.
 +అన్నయ్యా నీవు చాలా గొప్పవాడివి.భక్తుడివి.నువ్వు చెపితే దేవుడు వింటాడు.ఈ ఏడు జొన్నపైరు వేసాము.బొత్తిగా వానలులేవు.పైరు ఎండిపోయేటట్టుంది.
 +ఒక పెద్ద వాన కురిపించమని దేవుదిని ప్రార్థన చెయ్యవా?​ అని అడిగింది. రామలింగడు సరేనని చెప్పాదు.మంచి వాన కురిపించమని దేవుడిని ప్రార్థించాడు.
 +పక్కరోజు చిన్న చెల్లెల్ని చూచి పోదామని వాళ్ళ ఊరికి పొయ్యాడు.
 +ఆ రోజంతా అక్కడ్ ఉన్నాడు.ఆ రాత్రికి అన్నాలు తిని ఆరుబైట పడుకున్నారు.
 +చిన్న చెల్లెలు రామలింగడిని ఒక కోరిక కోరింది.అన్నయ్యా! ఈ యేడు వరి పైరు వేశాము.బాగా పండింది.కోతకు వచ్చింది.
 +రేపోమాపో కొయ్యాలి.పైన చూస్తే మబ్బులు మబ్బులుగా వుంది.
 +మాసూలు అయ్యేదాకా వాన కురిపించవద్దని దేవుడిని ప్రార్థన చెయ్యవా?​
 +అని అడిగింది.
 +రామలింగడు సరేనని చెప్పాడు.పది రోజుల దాకా వాన కురిపొంచవద్దని దేవుడిని ప్రార్థన చేశాడు.
 +తామలింగడు లోలోపల నవ్వుకొన్నాడు..
 +పాపం దేవుడికి ఎన్ని తిప్పలొచ్చాయి అనుకున్నాడు.
 +
 +
 + ఎవరి మొహం చెడ్డడి?​
 +
 +అనగా అనగా ఒక రాజు.ఆయన పొద్దునే నిద్రలేచాడు.ఒళ్ళు విరుచుకొన్నాడు..కళ్ళు నులుము కుంటూ కిటికీలో నుంచి బయతికి చూసాడు.
 +ఒక బిచ్చగాడు అటు పోతూ వున్నాడు.వాడి చింపిరి గుడ్డలు చూచి రాజుకు ఒళ్ళు మండింది.
 +దరిద్రపు గాడిద కొడుకు అనుకున్నాడు.
 +ఇంతలో సర్రున గాలి వీచింది
 +కిటికీ తలుపు టకీ మని రాజు తలకు తగిలింది.తలబొప్పి కట్టింది.
 +రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది.
 +పొద్దున లేచి వీడి దరిద్రపు మొహం చూసాను.
 +తలబొప్పి కట్టింది.
 +ఇదంతా వీడివల్లనే జరిగింది.
 +వీడిని వదిలిపెట్టగూడదు.
 +వీడికి తగిన శిక్ష వెయ్యాలి అనుకున్నాడురాజు.
 +వాడిని పట్టుకొని రమ్మని భటులను పంపించాడు. రాజు కొలువు తీరాదు.
 +భటులు బిచ్చగాడిని పట్టి కొలువుకు తెచ్చారు.
 +బిచ్చగాడిని చూచి రాజు ఇంతెత్తున ఎగిరాడు.
 +మండిపడ్డాడు.
 +నిద్ర లేస్తూనే వీడి దరిద్రపు మొహం చూసాను.
 +న తల బొప్పి కట్టింది.
 +వీడిని ఉరి తియ్యండి.
 +తీసుకుపోండి అన్నాడు రాజు.
 +భటులు బిచ్చ్గాడిని తీసుకొని పోవడానికి సిద్ధపడ్డారు.
 +బిచ్చ్గాదు రాజుగారి మొహంలోకి చూచాడు.
 +మహరాజా!చచిపోయే ముందు నాదొక చిన్న మనవి అన్నాడు.
 +ఏమిటది! విన్నవించుకో! అన్నాడు రాజు
 +అయ్యా!నా మొహం చూచి తమరికి తల బొప్పి కట్టింది.
 +కాని నేను ఈ రోజు నిద్రలేచి ముందుగా మీ మొహం చూసాను.
 +నాకు ఉరిశిక్ష పడింది.
 +ఎవరిది దరిద్రపు మొహమో నాకు అర్థం కావడంలేదు అన్నాడు బిచ్చగాడు.
 +పాపం రాజు మొహం వాడిపోయింది.
 +
 +
 + కుక్క బతుకు
 +
 +పిండారబోసినట్టు వెన్నెల కాస్తూ ఉంది.
 +ఒక పెంపుడు కుక్క వెన్నెల్లో ఆడుకొంటూ ఊరి బయటకు పోయింది.
 +అడవిలోనుంచి అక్కడికి ఒకపులి వచ్చింది.
 +అది ఆకుక్కను చూచింది.
 +కుక్క బాగ బలిసి ఉంది.
 +నున్నగా మెరిసి పోతూ ఉంది.
 +మొహం కళ కళలాడుతూ ఉంది.
 +పులి కుక్కను పలకరించింది.
 +నేను అడవిలో మాంసం తింటున్నాను.
 +అయినా బక్కచిక్కి ఉన్నాను.
 +నిన్ను చూస్తే నా పళ్ళు పులిసి పోతున్నాయి.
 +నువ్వు ఏమి తింటున్నావు
 +అని అడిగింది పులి.
 +కుక్కకు ఎక్కడలేని గర్వం కలిగింది.
 +నాకొక అసామి ఉన్నాడు.
 +నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను.
 +వాళ్ళు నాకు వేళ తప్పకుండా
 +అన్నం పెడతారు.
 +మంచి కూరలు పెడతారు.
 +ఆనందంగా ఉన్నాను.
 +అందుకే ఇలా ఉన్నాను.నీవు కూడా వస్తావా?​
 +మా ఆసామి ఇంట్లో ఉందువుగాని అని అడిగింది కుక్క.
 +పులి సరేనన్నది.కుక్కతో కలిసి ఊళ్ళోకి వెళ్ళింది.కుక్క పులికి ఆసామి ఇల్లంతా చూపెట్టింది.
 +ఇంట్లో ఒక చోట స్తంభం ఉంది.దానికి ఒక గొలుసుంది.
 +కుక్క దాని దగ్గర ఆగింది.
 +ఆ గొలుసును పులికి చూపించింది.
 +"​నన్ను దీనికికట్టేస్తారు.
 +నేను రాత్రులు ఇంటికి కాపలా కాయాలి.
 +విడిచి పెట్టినపుడు బయట తిరుగుతాను.
 +లేకుంటే ఈ గుంజ దగ్గరే ఉంటాను అనింది.
 +కుక్క బతుకు పులికి అర్థమైంది.
 +ఇదేం బతుకు. బానిస బతుకు.
 +నేను ఇష్టం వచ్చినట్టు అడవంతా తిరుగుతాను.
 +ఆనందంగా ఉంటాను.
 +ఈ తిండి నాకు వద్దు.
 +నీ బతుకు నాకు ఒద్దు.
 +అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.
 +
 +
 + నేను బతకొద్దా?​
 +
 +రామయ్య డాక్టరు దగ్గరికి పోయాడు.
 +అయన పరీక్ష చేసాడు.
 +ఇంత పొడుగున మందుల చీటి రాసాడు.
 +రామయ్య మందులన్నీ కొన్నాడు
 +పొట్లం తీసుకొని ఊరికి పోయాడు.
 +పొట్లం మొత్తం ఇంటి ముందు బావిలో వేసాడు.
 +ఇదంతా ఎదురింటి సుబ్బయ్య చూసాడు.
 +అంతడబ్బు పెట్టి మందులు కొని బావిలో వేసావే!
 +అసలు నువ్వు డాక్టరు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు?​
 +ఫీజు ఎందుకిచ్చినట్టు?​ అని అడిగాడు.
 +డాక్టరు బతకొద్దా! అన్నాడు రామయ్య.
 +అంత డబ్బులు పోసి మందులు ఎందుకుకొన్నట్టు?​
 +అని సుబ్బయ్య అడిగాడు.
 +మందుల కొట్టోడు బతకొద్దా?​ అన్నాడు రామయ్య
 +అన్నీ తీసుకుపోయి బావిలో ఎందుకు వేసినట్టు?​
 +అని సుబ్బయ్య అడిగాడు.
 +నేను బతకొద్దా! అన్నాడు రామయ్య.
 +
 +
 + ఏది గొప్పది
 +
 +అనగనగా ఒక రాజు.
 +అ రాజు ఒక రోజు మంత్రిని పిలిచాడు.
 +నమ్మకం గొప్పదా?​
 +శ్రమగొప్పదా?​ అని అడిగాడు.
 +శ్రమ గొప్పది.అని మంత్రి చెప్పాడు.
 +రాజుకు అది నచ్చలేదు.
 +అయితే రుజువు చెయ్యి అన్నాడు రాజు.
 +కొంతకాలం ఆగితే రుజువు చేస్తానని
 +మంత్రి చెప్పాదు.
 +కొంతకాలం గడిచింది.
 +రాజుగారి సైన్యం పక్క రాజ్యం మీదికి దండెత్తి పోయింది.
 +రాజుకోటలోనే వున్నాడు.
 +తన సైన్యం గెలవాలని వేయి దేవుళ్ళకు మొక్కసాగాడు.
 +ఒకరోజు రాజుగారి పూజారి వచ్చాడు.
 +పొరుగూళ్ళో ఒక స్వామి సమాధి వుంది.
 +అది చాలా మహిమగలది - దాన్ని మొక్కితే.
 +కోరింది జరుగుతుంది అని రాజుకు చెప్పాడు.
 +రాజుకు నమ్మకం కుదిరింది.మంత్రిని పిలిపించాడు.
 +మేము వెళ్ళి ఆ సమాధికి మొక్కాలి.
 +ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు
 +సమాధికి మొక్కితే ఏమి లాభం మహారాజా?​
 +అన్నాడు మంత్రి .
 +మీకు తెలీదు.అది చాలా మహిమగల సమాధి అని
 +అందరూ అంటున్నారు.
 +వెంటనే వెళ్ళాలి.
 +ఆ ఏర్పాట్లు చూడండి అని రాజు గద్దించాడు.
 +మంత్రి రాజుగారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసాడు.
 +రాజుగారు మంత్రి గారితో కలిసి సమాధి
 +దగ్గరికి వెళ్ళాడు.
 +సమాధికి ప్రదక్షిణ చేసాడు.
 +అక్కడవున్న చెట్టుకింద కూచున్నాడు.
 +ఇంతలో ఒక భటుడు వచ్చాడు.
 +రాజా! మన సైన్యం యుద్ధంలో గెలిచింది.అని చెప్పాడు.
 +చూసారా! మత్రిగారూ!
 +మీరు ఈ సమాధిలో మహిమేలేదన్నారు.
 +ఇప్పుడే మంటారు,​అన్నాడు రాజు.
 +తమరు మన్నించాలి.
 +మన సైనికులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేసారు.
 +అందుకే గెలిచారు.
 +మీరు సమాధికి మొక్కినందువల్ల గాదు అన్నాడు మంత్రి.
 +రాజుగారికి కోపం వచ్చింది.
 +కళ్ళెర్రచేసాడు.
 +మంత్రిని ఉరిమి చూసాడు.
 +మహారాజా! ఆరోజు శ్రమ గొప్పదని చెప్పాను.
 +అదే యిప్పుడు రుజువు చేసాను.
 +ఇది స్వామి సమాధి కాదు.
 +ఇందులో ఉండేది కుక్క శవం.
 +దీన్ని నేనే కట్టించాను.
 +మహిమగలదని ప్రచారం చేయించాను.
 +మీరే చూడండి -
 +అని సమాధి తవ్వొంచి కుక్క ఎముకలను రాజుగారికి చూపించాడు మంత్రి.
 +తన గుడ్డినమ్మకానికి రాజు సిగ్గుతో తలదించుకొన్నాడు.
 +
 +
 + చాదస్తపు మొగుడు
 +
 +అనగనగా ఒక ఊరు.
 +అ ఊళ్ళో వేదయ్య అనే పంతులు ఉండేవాడు.
 +ఆయనకు చాదస్తం ఎక్కువ.
 +అనుమానాలు ఎక్కువ.
 +ఒకనాడు వేదయ్య భార్యతో పాటు అన్నం తింటున్నాడు.
 +భార్య చీకుతున్న మామిడి ముట్టె ఎగిరి వేదయ్య కంచంలో పడింది.
 +వేదయ్యకు దిగులు పట్టుకొనింది.
 +అపచారం జరిగిందని భయం పట్టుకొనింది.
 +భార్య ఎంగిలికి ఏమి శాస్తి చెయ్యాలి?​
 +అని పంచాంగం తిరగేసాడు.
 +కాశికి పోవాలని అనుకున్నాడు.
 +తీర్మానించుకొన్నాడు.
 +పొద్దున్నే లేచి కాశికి ప్రయాణం కట్టాడు.
 +భార్య చెప్పినా వినలేదు.
 +బంధువులు చెప్పినా వినలేదు.
 +కాశీకి పోయి తీరాలన్నాడు.
 +ఆ రోజుళ్ళో బస్సులు లేవు.
 +వేదయ్య రోజంతా నడిచాడు.
 +బాగా అలిసిపోయాడు.
 +సాయంత్రానికి ఒక ఊరికి చేరాడు.
 +రాత్రికి వంట చేసుకోవాలి.
 +వేదయ్య దగ్గర ఉప్పు పప్పు ఉన్నాయి.
 +వండుకొనడానికి కుండలేదు.
 +ఒకరింటికి పోయి అడిగాడు.
 +ఆ ఇంటి కోడలు ఒక చట్టి ఇచ్చింది.
 +వేదయ్య ఆ చట్టిలో అన్నం వండుకుని తిన్నాడు.
 +తిరిగి చట్టి ఇవ్వబోయాడు.
 +చట్టి తీసుకోవడానికి కోడలు వచ్చింది.
 +దాన్ని అత్త చూచింది.
 +అయ్యో! ఆ చట్టి ఎందుకిచ్చావే!
 +అది పిల్లికి అన్నం పెట్టేది గదా!
 +పాపం నీకు తెలీదేమో!
 +అయ్యా ఏమీ అనుకోవద్దు! అది కొత్త కోడలు!
 +తెలీక ఇచ్చింది అనింది అత్తగారు.
 +వేదయ్య పేగులు కలి బెట్టినట్టయింది.
 +వేదయ్య మరుసటి రోజంతా నడిచాడు.
 +అరాత్రికి ఒక ఊరికి చేరాడు.
 +ఎక్కడో ఇంత వండుకుని తిన్నాడు.
 +ఒకరి ఇంటి అరుగు మీద పడక వేసాడు.
 +వేదయ్యకు అన్నం తిని వక్కపలుకు వేసుకునే అలవాటుంది.
 +ఆ ఇంటామెను వక్క పలుకు అడిగాడు.ఆమె ఒక వక్క తెచ్చి యిచ్చింది.
 +వేదయ్య పట పట మని వక్క కొరికాడు.
 +ఈ శబ్దం విని ఇంటావిడ బయటికి వచ్చింది.
 +నాయనా!నీవి ఎంత గట్టి పళ్ళు!
 +నేనూ మా ఆయనా ఇద్దరం కొరికినా ఆ వక్క పగలలేదు.
 +నీవు నిమిషంలో నమిలేసావు.
 +అని వేదయ్య పళ్ళబలాన్ని మెచ్చుకొనింది.
 +దీంతో వేదయ్యకు బుద్ధి వచ్చింది.
 +కాశికి పోవడం మానుకున్నాడు.
 +పొద్దునే లేచి ఇంటి దారి పట్టాడు.
చాదస్తపు_మొగుడు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)