User Tools

Site Tools


గోరింక_గూడు

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

గోరింక_గూడు [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                                                    గోరింక గూడు
 +
 +
 +      ఇది నా చిన్నప్పుడు జరిగిన సంగతి.
 +
 +     ​అప్పుడు నేను ఆరో తరగతి చదువుకుంటున్నాను.మా తరగతిలో రకరకాల పిల్లలు ఉండేవారు.
 +
 +      హరి అనే ఓ కుర్రాడు ఉండేవాడు.వాడు చేసే పనులు చిత్రంగా ఉండేవి.వాడిని ఏదన్నా జవాబులు గుర్తు రాకపోతే సిరా తాగేవాడు. నల్లసిరా తాగితే తెలివి పెరుగుతుంది-అని వాడికి ఎవరో చేప్పారట. సీసాడు సిరా గుటగుటా తాగేసేవాడు.
 +
 +     ​వాడు చేసే పనులకు టీచర్లకు కోపం వచ్చేది.ఎవరైనా టీచరు కోట్టబోతే వాడు గట్టిగా అరిచేవాడు.
 +  ​
 +     "​ఓరి నాయనోయ్! ఓరి దేవుడోయ్! నన్ను చంపేస్తున్నాడురో! సార్ నన్ను చంపేస్తున్నాడురో!"​ అని పెద్దగా అరిచేవాడు. చుట్టు పక్కల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చేవారు.ఏం జరిగిందో అని భయపడేవారు.దాంతో అయ్యవారికి కళ్లు తిరిగేవి. ఎత్తిన చెయ్యి దించేసేవారు.
 +
 +     ​టీచర్లు కొట్టినప్పుడు వాడు ఏంచేసేవాడో తెలుసా?​ టీచర్ని గట్టిగా చుట్టుకునే వాడు.పెద్ద గొంతుతో ఇలా బతిమలాడేవాడు:​
 +
 +     "​ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి సార్. మీరు గొప్పవారు సారు. మీరు అక్బరు చక్రవర్తి సార్. మీరు శ్రీకృష్ణదేవరాయలు సార్.మీరు నా అమ్మ సార్.మీరు నా నాన్న సార్. మీరు నా తాతయ్య సార్. మీ నా నాయనమ్మ సార్."​ అనేవాడు.
 +
 +     ​పిల్లలందరూ పకపకా నవ్వేవారు. సార్ కి సిగ్గేసేది. కొట్టడం ఆపేసేవారు.
 +
 +     ​అప్పుడప్పుడు వాడు కప్పలు పట్టుకొచ్చేవాడు."​కప్పల కొవ్వు చేతికి రాసుకుంటే దెబ్బలు తగలవు. సార్లు ఎంత కొట్టిన ఏమీ కాదు. బెత్తం దెబ్బ పడినట్లే ఉండదు."​ అని మాతో చేప్పేవాడు... హరి పనులు ఇలా విచిత్రంగా ఉండేవి.
 +
 +      మా తరగతిలో ఇంకో కుర్రావాడు ఉండే వాడు. వాడి పేరు నాగరాజు. వాడిని చూస్తే మా అందరికీ భయం! వాడు గిల్లితే పాము కరిచినట్లు ఉండేది. వాడు మహా ఆకతాయి.
 +   
 +       ​మురికి కాలవ పక్కన తూనీగలు వాలేవి. నాగరాజు వాటిని వట్టి చేతులతో పట్టుకొనేవాడు. వాటి రెక్కల్ని చప్పున తుంపేసేవాడు. తర్వాత వాటి కాళ్ళకు దారం కట్టేవాడు. వాటిని గాలిపటాల్లా ఎగరేయాలని చూసేవాడు.
 + 
 +       ​తోటలోని పూల మీద ఎన్నో సీతాకోకచిలుకలు వాలేవి. నాగరాజు క్షణంలో వాటిని ఒడిసి పట్టేవాడు. పట్టిన వెంటనే వేళ్ల మధ్య నలిపేసేవాడు. వాటి వంట్లో పిన్నులు గుచ్చి పుస్తకాలకు బిగించేవాడు.పాపం! అవి టపటపా కొట్టుకొంటూ చచ్చిపోయేవి.
 +   
 +      నాగరాజు చేసే పనులు మాకు అసహ్యం పుట్టించేవి.
 +
 +     ​వాడి గురించి అందరూ ఒక మాట అనుకునేవారు. తేలు గనక వాడిని కుడితే తేలు చచ్చిపోతుంది.వాడికి మాత్రం ఎమీ కాదు. వాడి రక్తం అంత విషంగా ఉంటుంది-అనుకునే వారు.వాడు చేసే పనులు కూడా అలాగే ఉండేవి.
 +
 +     ​నాగరాజు చేతుల్లో ఎప్పుడూ ఒక ఉండేలు (క్యాట్బాల్) ఉండేది. వాడి గురి ఎప్పుడూ తప్పేది కాదు.గురి చూసికొడితే తగలవలసిందే!
 +
 +     ​పక్షిగూళ్లు చూస్తే వాడికి ఎందుకో పగ. వాటిని చూస్తూ ఊరుకునేవాడు కాదు.చెట్టు కింద నిలబడేవాడు. గురి చూసి ఉండేలుతో రాళ్లు కొట్టేవాడు. పిట్టలు రివ్వున గాలిలోకి ఎగిరేవి. కీకీ అని అరుస్తూ గోల చేసేవి. ​ గాలిలో చక్కెర్లు కొట్టేవి.
 +
 +     ​నాగరాజు గబగబా చెట్టెక్కేవాడు. గూళ్లలో ఉండే గుడ్లను జేబులో వేసుకొనేవాడు. తర్వాత గూళ్లను ముక్కలు ముక్కలు చేసి పారేసేవాడు. వాటిని నాశనం చేసేదాకా వాడికి నిద్ర పట్టేది కాదు. వాడికి ఇదంతా ఒక ఆటలా ఉండేది.
 +   
 +      ఒకరిని కష్టపెట్టకుండా మనం ఎన్నో ఆటలు ఆడుకోవచ్చు. ఈ సంగతి వాడికి తట్టేదే కాదు. అందుకే వాడి అమ్మ కూడ వాడిని తిట్టేది."​ఓరి ​ రాక్షసుడా! ఇదేం పాడు బుద్దిరా!:​ అని తిట్టేది.
 +
 +     ​నాగరాజు తన జేబులో రంగురంగుల గుడ్లు పెట్టుకొని తిరిగేవాడు. జేబులోంచి కాకిపిల్లలు తీసి చూపించేవాడు. ఒక్కోసారి కాకిపిల్లలు! మరోసారి పిచుక పిల్లలు! ఇంకోసారి చచ్చిన పాములు! ఒకొక్కసారి జేబులోంచి చుంచెలకల్ని కూడా తీసేవాడు.
 +
 +     ​వాడు దగ్గరకు వస్తే అందరం భయపడేవళ్లం. ఎవరైనా వాడితో పోట్లాడితే ఏమైనా ఉందా?​ వారి పని అంతే సంగతులు! గుండే మీద పిడిగుద్దులు గుద్దేవాడు. చెయ్యి గట్టిగా కొరికేసేవాడు. వాడు కొడితే కళ్లు తిరిగిపోయేవి. కొరికితే మాంసం ముక్క ఊడి వచ్చేది.
 +
 +           ​బడి వదలగానే ఎవరింటికి వాళ్ళం వెళ్లి పోయేవాళ్లం. నాగరాజు మాత్రం ఇంటికి పోయేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఎక్కడ తిరిగేవాడో ఎవ్వరికీ తెలీదు.
 +
 +   ​అప్పుడప్పుడు నాగరాజు మాతో మంచిగా మాట్లాడేవాడు.మాకు తెలియని సంగతులు కొన్ని చెప్పేవాడు.
 +
 +      "​మా ఇంట్లో ఒక ఉడుం ఉంది. ఉడుమంటే ఏమిటో తెలుసా?"​ అన్నాడు ఒకరోజు.
 +   
 +      "​తెలీదు. ఎమిటది?​ ఎలా ఉంటుంది?"​ ఉత్సాహంగా అడిగాం.
 + 
 +      "​అది పాములా ఉంటుంది. జానెడు పొడుగుంటుంది. అయితే పాముకి కాళ్లుండవు. ఉడుంకి ఉంటాయి."​ అన్నాడు.
 +
 +      మాకు ఒంట్లో వణుకు పుట్టింది.
 +
 +     "​ మా ఇంట్లో మెట్ల కింద ఒక ఉడుముంది. అన్నట్లు మీకొక సంగతి తెలుసా?​ అది దేన్నైనా పట్టుకుంటే విడిచిపెట్టదు."​ అన్నాడు.
 +
 +      మేము మరింత వణికిపోయాం. కొంపదీసి జేబులో వేసుకొచ్చాడా?​ మా మీదకు వదులుతాడా?​ అని మా భయం.
 +
 +      "​కొందరు దొంగలు ఉడుమును పెంచుకుంటారు. దాని సాయంతో పెద్దపద్ద గోడల్ని ఎక్కుతారు. ముందుగా ​ ఉడుం కాలుకి తాడు కడతారు. ఉడుముని గోడ మీదకు విసురుతారు. గోడ తగలగానే ఉడుం దానిని గట్టిగా పట్టుకుంటుంది. దాని కాళ్లు చాలా బలంగా ఉంటాయి. అది గోడను ఎంత గట్టిగా పట్టుకుంటుందో తెలుసా?​ పది మంది ఒక్కేసారి లాగినా వదిలిపెట్టదు. దొంగలు ఆ తాడు పట్టుకొని ఎక్కుతారు."​ చెప్పాడు నాగరాజు.
 +
 +     "​పని పూర్తయ్యాక దానిని ఎలా తీసుకుపోతారు?"​ అనుమానంగా అడిగాను.  ​
 +
 +      "​దొంగలు దానికి కొంచం పాలు తాగిపిస్తారు.పాలు తాగగానే దాని పట్టు తప్పుతుంది."​
 +
 +      నాగరాజు మాకు ఇలాంటి సంగతులు చెప్పేవాడు.
 +
 +      ఆ రోజుల్లోనే మా నాన్న ఉద్యోగం పెద్దదయింది. మేము ఓ కొంత ఇంట్లోకి మారాం. అది చాలా పెద్ద ఇల్లు. పాతకాలపు బంగ్లా. ఊరికి దూరంగా ఉంది. ఇటుకలతో కట్టిన గోడలు. పెద్ద పెద్ద గదులు. గచ్చు నేల. పైకప్పు వాలుగా,​ ఎత్తుగా ఉండేది. ఇంటి బయట బోలెడంత ఖాళీ స్థలం,​ చెట్టూ చేమలు. దగ్గరలో మరో ఇల్లు లేదు. దాంతో నాకు ఆడుకోవడానికి జతగాళ్లు దొరికేవాళ్ళుగాదు.
 +
 +       ​నాగరాజు అక్కడికి రావడం మొదలుపెట్టాడు. అక్కడ వాడికి వేట బాగా దొరుకుతుందని వాడికి తెలిసి ఉంటుంది. మా ఇంటి చుట్టు బోలెడన్ని పక్షిగూళ్లు ఉండేవి. ఇంట్లోనూ ఉండేవి. ఇంటికి దగ్గరలోనే కొన్ని కోతులు తిరుగుతుండేవి. ఒకచోట పొదల్లో ముంగిస బొరియలు ఉండేవి.  ​
 +
 +       ​ఇంటి వెనుక ఓ పెద్ద గది ఉంది.అమ్మ దానిని గోదాముగా మార్చింది. పనికిరాని వస్తువులన్నీ అందులో పడేసింది.
 +
 +        గోదాములో ఎప్పటి నుంచో పావురాళ్లు ఉంటున్నయి. అవి రోజంతా గుటురూ గుటురూ అంటుండేవి. పైకప్పు కింద గోడలో ఓ చిన్న కిటికీ ఉంది. గది నేల మీద ఈకలు,​రెట్టలు,​గడ్డిపోచలూ చిందరవందరగా పడి ఉండేవి. ​
 +
 +          నాగరాజు రోజు వచ్చేవాడు. నేను కూడా వాడితో తిరగడం మొదలెట్టాను. అమ్మకు ఇది బొత్తిగా ఇష్టం లేదు. అయినా సరే నన్ను వాడితో పోనిచ్చేది. వాడంటే అమ్మకు కోపమే. అమ్మ కూడా వాడిని రాక్షసుడనే అనేది. మూగ జీవాలని ఏడిపించొద్దని నచ్చ జేప్పేది.
 +   
 +      ఒకరోజు అమ్మ నాతో అంది:​
 +
 +       "​మన గోదాము గదిని పిట్టలు కంపు కంపు చేశాయి. అందులోని గూళ్లను తీసేయమని నీ స్నేహితుడికి చెప్పు. వాడికి ఆ పనంటే గొప్ప సరదాగా?"​ అంది.
 +
 +      "​అందేటమ్మ అలా అంటావు?​ గూళ్లు పీకెయ్యడం పాపం అని నువ్వే చెప్పావుగా!"​ అన్నాను ఆశ్చర్యంగా.
 +
 +      "​పిట్టల్ని చంపితే పాపం వస్తుంది. గూడు తీసేయడం వేరే సంగతి."​ అంది అమ్మ చిరాకుగా.
 +
 +       ​నాగరాజుకి సంగతి చెప్పాను. వాడు సరే అన్నాడు. ఇద్దరం కలిసి గోదాము వెనుకకు వెళ్ళాం. మెల్లగా తలుపులు తెరిచాం. అప్పుడు సాయంత్రం కావస్తోంది. లోపల మసకమసకగా ఉంది. కంపు కొడుతోంది. జంతువుల గుహలోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. కొంచెం సేపు తలుపు దగ్గరే నిలబడిపోయం. తర్వాత లోపలికి వెళ్ళాం.
 +
 +         ​అది రేకులు పరిచిన గోదాము. రేకులకు దన్నుగా రెండు అడ్ద దూలాలున్నాయి. కొన్ని నిలువు దూలాలూ ఉన్నాయి. ఒక దూలం మీద చాలా పావురాలు కనిపించాయి. అవి గుటురూ గుటురూ అని అదే పనిగా అరుస్తున్నాయి.అటూ ఇటూ తిరుగుతున్నాయి.
 +
 +        రెండో దూలం మీద గోరింక గూడు ఉంది. గడ్డిపోచలు,​ దూదిపోగులు,​ గుడ్డపీలికలు - వీటితో చేసిన గూడు! అది ఎంతో అందంగా ఉంది.
 +
 +        అమ్మ దానిని ఎందుకు తీసేయమంది.అది తీసేయడానికి నాకు మనసొప్పలేదు. మనసులోనే అమ్మను తిట్టుకున్నాను.
 +
 +       ​నాగరాజు తన ఉండేలు సరి చేసుకున్నాడు. దూలం మీద ఉన్న గూటిని రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. వాడి ముఖంలో ఎంతో సంతోషం!
 +
 +       "​ గూటిలో గోరింక పిల్లలు ఉన్నాయి"​ అన్నాడు. ఉండేలు రబ్బరు లాగి పట్టుకున్నాడు. అప్పుడే గూటిలోంచి రెండు బుజ్జి గోరింక పిల్లలు తొంగి చూశాయి. అవి పసుపు రంగులో ఎంతో ముద్దుగా ఉన్నాయి.
 +
 +      "​ఇవి మన దేశపు గోరింక కాదు. వేరే దేశానివి. వీటి అమ్మ,​నాన్న గుంపు నుంచి తప్పిపోయి ఉంటాయి. ​
 +అందుకే ​ ఇక్కడ గూడు కట్టుకున్నాయి."​ అన్నాడు నాగరాజు.
 +
 +     "​అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు?"​
 +
 +     "​మేత కోసం పోయి ఉంటాయి. కొంచెం సేపట్లో తిరిగి రావచ్చు."​ అంటూ ఉండేలు ఎత్తాడు.
 +
 +     "​రాళ్ళతో గూటిని కొట్టొద్దు. పిల్లలు చచ్చిపోతాయి. అమ్మ గూటిని పీకేయమంది.పిల్లల్ని చంపమనలేదు."​ అని వాడికి చెప్పాలని అనుకున్నాడు. అంతలోనే వాడి ఉండేలును ​ ఫర్రుమని లాగాడు కంకరరాయి దూసుకుపోయింది. అయితే అది గూటికి తగలలేదు. పైకప్పుకి తగిలి టంగుమని శబ్ధం చేసింది.
 +
 +       ​గోరింక పిల్లలు గూటిలోకి ఒదిగిపోయాయి. అవి బాగా భయపడి పోయాయి.
 +
 +      నాగరాజు రెండోరాయి గురిపెట్టి వదిలాడు. ఈసారి రాయి దూలానికి తగిలింది.
 +
 +      వాడు తన గురించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు. అయితే ఇప్పుడు రెండుసార్లు గురి తప్పింది. దాంతో వాడికి పిచ్చెక్కినట్లయింది. కొంచెం సేపటి దాకా ఊరికే నిలబడిపోయాడు.
 +
 +      గోరింక పిల్లలు మళ్ళీ తొంగి చూశాయి. అంతే! నాగరాజు మూడోరాయి వదిలిపెట్టాడు. అది సర్రున పోయి గూడు కొసకు తగిలింది. కొన్ని గడ్డి పోచలు,​దూదిపోగులు చెదిరిపోయ్యాయి. అవి మెల్లగా నేల మీద ​ పడసాగాయి.
 +
 +       ​వాడు నాలుగోసారి ఉండేలు ఎక్కుపెట్టాడు. అప్పుడు గదిలో ఓ పెద్ద నీడ పడింది.మేము తలలు పైకెత్తి చూశాం.కిటికీకి అడ్డంగా ఓ గద్ద కూర్చొని ఉంది! చాలా పెద్ద గద్ద! నేను భయపడిపోయాను.
 +  ​
 +      "​ఇది గద్దగూడు కావొచ్చు."​ అన్నాను.
 +
 +     "​కాదు గద్దలు తమ గూటిని చెట్ల మీద కట్టుకుంటాయి. ఇలాంటి చోట కట్టుకోవు. ఇది ముమ్మాటికీ గోరింకల గూడే!"​ అన్నాడు నాగరాజు.
 +
 +      గూటిలోని గోరింక పిల్లలు అరవడం మొదలు పెట్టాయి. అవి గద్దను చూశాయో ఏమో! గొంతు చించుకొని అరుస్తున్నాయి. ఎగిరి పోవాలని గింజుకుంటున్నాయి.
 +
 +       ​నేను,​నాగరాజు కదలకుండా నిలబడిపోయాం. ఇప్పుడు గద్ద ఏం చేస్తుంది?​ రెప్ప వాల్చకుండా దానినే చూస్తున్నాం.
 +  ​
 +     ​గద్ద రెక్కలు సరి చేసుకుంది. తలను అటూ ఇటూ తిప్పి చూసింది.నెమ్మదిగా ఎగిరి దూలం మీదకు దిగింది.
 +
 +      గోరింక పిల్లలు ఇంకా పెద్దగా ఏడుస్తున్నాయి.
 +
 +      "​ఇది ఇక్కడికి రోజూ వస్తున్నట్లుంది."​ అన్నడు నాగరాజు.
 +గోదాము నేల మీద మాంసం ముక్కలు,​రక్తపు మరకలు కూడా ఉండేవి. పిట్టల ఈకలైతే సరేసరి. అవన్ని ఎందుకు ఉన్నాయో నాకు అర్దమయింది. ఈ గద్ద తరుచూ వస్తుందన్న మాట! వచ్చిన ప్రతిసారీ-ఎదో ఒక పిట్టను చంపి తింటుందన్న మాట!
 +
 +     ​గద్ద మెల్లగా నడుస్తూ గూటి వైపు కదులుతోంది. గోరింక పిల్లలు గుండె పగిలేలా ఏడుస్తున్నాయి. ​
 +
 +     ​నేను నాగరాజు వంక చూశాను. వాడు రెప్ప వాల్చకుండా గద్దనే చూస్తున్నడు. అది వచ్చినప్పటి నుంచి దాని వంక అలాగే చూస్తున్నడు.
 +
 +     ​నాకు అనిపించిది.గోరింక పిల్లల్ని గద్ద పొడిచి చంపుతుంది. నాగరాజు ఉండేలుతో కొట్టి చంపుతాడు.దానికి,​దీనికి ​ ఏం తేడా ఉంది?​ రెండూ ఒకటే! గద్ద,​ నాగరాజు - ఇద్దరూ ఒక్కటే!
 +
 +     ​గద్ద తాపిగా ముందుకు కదులుతోంది. గోరింక పిల్లలు నరాలు తెగేలా అరుస్తున్నాయి.ఉన్నట్లుండి నాగరాజు ఉండేలు ఎత్తాడు. సూటిగా దానిని గద్దకు గురిపెట్టాడు!
 +  ​
 +      "​దానిని ఏమీ అనకు. మన మీదకు వస్తుంది."​ భయపడుతూ అన్నాను.
 +
 +      వాడు వినలేదు. ఉండేలు నుంచి కంకరరాయి సర్రున పోయింది. అయితే అది గద్దకు తగల లేదు. పైకప్పుకి తగిలి కింద పడిపోయింది. గద్ద తన పెద్ద పెద్ద రెక్కల్ని సాచింది. తల తిప్పి గుర్రుగా మా వంక చూసింది.
 +
 +      "​ఇక్కడ నుంచి పారిపోదాం పద!"​ నేను కంగారుగా అన్నాను.
 +
 +      "​వద్దు. మనం వెళ్ళిపోతే గద్ద ఆ పిల్లల్ని తినేస్తుంది!"​ అన్నాడు నాగరాజు.
 +
 +       ​నా చెవులు నేను నమ్మలేక పోయాను! వాడి నోటి నుంచి ఆ మాట రావడం చిత్రంగా ఉంది. ఆశ్చర్యంగా వాడి వంక చూశాను!
 +
 +      వాడు గద్దనే చూస్తున్నాడు. రెండోసారి దానికి గురిపెట్టాడు. గద్ద గాలిలోకి ఎగిరి గదిలో ఓ చుట్టు చుట్టింది. తిరిగి దూలం మీద వాలింది.
 +
 +      నాగరాజు ఉండేలుని చప్పున నా చేతిలో పెట్టాడు. జేబులోంచి ఆరేడు కంకరరాళ్ళు తీశాడు.వాటిని కూడా నా చేతిలో ఉంచాడు.
 +
 +     "​నువ్వు గద్దను రాళ్ళతో కొట్టు. కొడుతూనే ఉండు. దానిని కూచోనివ్వద్దు."​ అంటూ గోడ దగ్గరకు పరిగెత్తాడు.
 +
 +      గోడ దగ్గర ఓ పాత టేబులు ఉంది. దానిని ఈడ్చుకుంటూ దూలం కిందకి తెచ్చాడు. ఆ దూలం కిందే గోరింక పిల్లల గూడుంది. బల్ల మీద ఓ విరిగిన కుర్చీని వేశాడు.
 +
 +జాగ్రత్తగా దాని మీదకు ఎక్కాడు. పడిపోకుండా నిలబడి గోరింకల గూడును తన చేతులోకి తీసుకున్నాడు.
 +
 +       ​ఉండేలుతో ఎలా కొట్టాలో నాకు తెలీదు. అయినప్పటికి గద్దను గురి చూసి రెండు మూడు రాళ్ళు కొట్టాను. ఈలోగా అది వేరే దూలంపైకి ఎగిరింది.
 +
 +       ​నాగరాజు గూటితో సహా కిందకి దిగాడు. "​బయటికి పోదాం పద!"​ అంటూ గబగబా తలుపు వైపు నడిచాడు...
 +
 +      ఇద్దరం బయటకు వచ్చాం. ​
 +
 +      గోదాముకి దగ్గరలోనే గ్యారేజీ ఉంది. గ్యారేజీ అంటే కారు పెట్టుకొనే గది. మాకు కారు లేదుగా! అందుకని దాని తలుపు ఎప్పుడూ మూసే ఉండేది. దాంట్లో కూడా పైన దూలాలు ఉన్నాయి. గోడకు చిన్న కిటికి కూడా ఉంది.ఇద్దరం అక్కడకు వెళ్లాం.
 +
 +       ​చిన్న అట్ట పెట్టెలో గూడును పెట్టాడు నాగరాజు. పాత పెట్టెల మీదకు ఎక్కి- అట్ట పెట్టెను జాగ్రత్తగా దూలాల మీద ఉంచాడు.
 +
 +      "​గద్ద ఇక్కడికి రాలేదు."​ అన్నాడు తృప్తిగా.
 +
 +      నాకు ఆశ్చర్యం వేసింది. వాడు ఆ పిల్లల్ని జేబులో వేసుకొని,​పోతాడు అనుకున్నాను.ఎప్పుడూ అలాగే చేస్తాడుగా!
 +  ​
 +      గోరింక పిల్లలు అరవడం ఆపేశాయి. నాగరాజు పెట్టె మీదకు ఎక్కి నిలబడ్డాడు. చాలా సేపు వాటి వంక చూశాడు.
 +
 +      "​కొంచెం నీళ్లు తీసుకురా. వాటికి బాగా దాహంగా ఉంది."​ అన్నాడు నాతో.
 +
 +       ​ఇంట్లోకి వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు తీసుకు వచ్చాను. బుజ్జి గోరింకలు గొంతులు పైకెత్తాయి. వాడు ఆకుతో వాటి గోంతులోకి బొట్టు బొట్టు నీళ్లు పోసాడు. అవి బాగా తాగాయి. పాపం అరిచి అరిచి వాటి గొంతులు ఎంత ఎండిపోయాయో ఏమో!
 +
 +      బుజ్జి గోరింకలను నేను ముట్టుకోబోయాను. అయితే నాగరాజు వద్దన్నాడు. తాను కూడా వాటిని ముట్టుకోలేదు. మనం ముట్టుకుంటే వాటి అమ్మా నాన్నా వదిలేస్తాయి అన్నాడు.
 +
 +       "​వీటి అమ్మానాన్నలు ఇక్కడికి ఎలా వస్తాయి?"​ అని అడిగాను. ​
 +
 +       "​ పిల్లల్ని వెతుక్కుంటూ అవే వస్తాయి ఈ కీటికీలోంచి దూరి వచ్చేస్తాయి."​ అన్నాడు.
 +
 +       ​మేము బాగా చీకటి పడే వరకు గ్యారేజీలో ఉండిపోయాం. " గ్యారేజీ కిటికీలోంచి గద్ద దూరలేదు. గోరింక పిల్లలకు ​ ఇక భయం లేదు"​ అన్నడు నాగరాజు. ఆ సాయత్రం అంతా వాడు గద్ద గురించే మాట్లాడాడు.
 +
 +      మరురోజు నాగరాజు మళ్ళీ మా ఇంటికి వచ్చాడు.ఆశ్చర్యం! వాడి చేతిలో ఉండేలు లేదు! జేబులో కంకరాళ్లు లేవు!... అవి లేకుండా వాడు రావడం అదే మొదటిసారి!!
 +
 + ​నాగరాజు జేబులో పక్షుల దాణా వేసుకొచ్చాడు.
 +     ​నేను,​ నాగరాజు చాలాసేపు బుజ్జి గోరింకలకి దాణా తినిపించాము. అవి ఎర్రటి నోరు తెరుస్తూ మూస్తూ ఉండేవి. చూడ్డానికి ఎంత ముచ్చట వేసిందో! నాగరాజైతే వాటిని చూచి లోకాన్నే మరిచి పోయాడు. మళ్ళీ నాగరాజు ఎప్పుడూ ఉండేలు ముట్టుకోలేదు.
  
గోరింక_గూడు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)