User Tools

Site Tools


కుమ్మరి_నరసయ్య

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

కుమ్మరి_నరసయ్య [2018/03/24 11:13]
కుమ్మరి_నరసయ్య [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 + 
 +                                                          కుమ్మరి నరసయ్య
 +
 +   ​పత్తికొండ ఓ చిన్న ఊరు.అది అడవికి దగ్గరలో ఉంది. ​
 +
 +   ఆ ఊరిలో ఒక కుమ్మరివాడు ఊండేవాడు.అతడి పేరు నరసయ్య.అందరూ అతడిని '​కుమ్మరి నరసయ్య'​అనేవారు. నరసయ్య బాగా తాగేవాడు. అందుకని కొందరు '​తాగుబోతు నరసయ్య అనేవారు.
 +
 +    నరసయ్య కు ఓ గాడిద ఉండేది. ఒకనాడు అది కట్టు తెంచుకుంది. ఎక్కడికో పారిపోయింది.
 +
 +    నరసయ్య ఊరంతా వెదికాడు. గాడిద కనిపించలేదు.గాడిదను వెదుకుతూ అడవిలోకి ​ వెళ్ళాడు.
 +   
 +పొద్దు వాలింది....
 +
 +    ఆ అడవిలో ఒక పెద్దపులి ఉంది. సాయంత్రం అయిందిగా! పులి తన గుహకు బయలుదేరింది. దాని గుహ చాలా దూరంగా ఉంది. ఇంతలో ​ ఉన్నట్టుండి వాన మొదలయింది.ఒకటే ఉరుములూ,​ మెరుపులూ! వాన జోరుగా పడుతోంది.
 +
 +      పెద్దపులి పరిగెత్తింది. కొంత దూరం పోయేసరికి దానికి ఆయాసం వచ్చింది. ఆగి, అటు ఇటు చూసింది.దగ్గరలో ఒక గుదిసె కనిపించింది. అది గుడిసె దగ్గరకు వెళ్ళింది.తడవకుండా చూరు కింద నిలబడింది.
 +
 +       ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంది.ఆమెకు వాన మీద బాగా కోపంగా ఉంది.పాపం! ఆ గుడిసె పైకప్పు నిండా కన్నాలు! ఆ కన్నాల నుంచి వాననీరు లోపలికి వస్తోంది.ఇంట్లో అన్నీ తడసిపోయాయి.ముసలమ్మ కూడా తడసిపోయింది.చలికి వణికిపొతోంది.
 +
 +       "​ఛీ చీ...వెధవ కన్నాలు!వెధవ కన్నాలు!వీటితో వేగడం కంటే - పులి నోట్లో తల పెట్టడం మంచిది!"​ అని ముసలమ్మ కోపంగా అంది.
 +
 +  పెద్దపులి ఆ మాటలు వింది.అది ఉలిక్కిపడింది!
 +
 +  '​కన్నాలు'​ అంటే ఏమిటో దానికి తెలీదు. అయినా...
 +
 +   ఈ '​కన్నాలూ'​ అనేది నా కన్నా పెద్ద జంతువై ఉంటుంది. అందుకే ముసలమ్మ అలా అంది.ఇకనుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్నాలుకి ఎదురు పడకుండా ఉండాలి...అనుకుంది పెద్దపులి.
 +
 +   ​అదే సమయంలో నరసయ్య అక్కడకు వచ్చాడు. అతను ఇంకా గాడిద కోసం వెదుకుతున్నాడు.అప్పుడు బాగా తాగి ఉన్నాడు.ఎంత వెదికినా గాడిద కనిపించడం లేదు.అందుకని బాగా కోపంగా కూడా ఉన్నాడు.
 +     
 +     ​నరసయ్య పెద్దపులిని చూసాడు. చీకటి పడుతున్న సమయం. అంతా మసకమసకగా ఉంది.పైగా నరసయ్య తాగాడు మైకంలో ఉన్నాడు.. ఇంకెం . అతనికి పెద్ద పులి గాడిదలా కనిపించింది!అది తన గాడిదే
 + ​అనుకున్నాడు..చప్పుడు చెయ్యకుండా మెల్లగా దాని దగ్గరకు వెళ్ళాడు.
 +
 +             ​ఉన్నట్టుండి పులి మెడలో పలుపు వేశాడు.తర్వాత చింత బరికతో దంచడం మొదలుపెట్టాడు.
 +
 +                   "​దరిద్రపు ముండా! నాకు ఎన్ని కష్టాలు తెచ్చావే!నీ కొసం తిరిగి తిరిగి వళ్లు హూనమైపోయింది."​అని తిట్టాడు.
 +
 +     ​పెద్దపులి బిత్తరపోయింది!
 +
 +   ​అది నరసయ్యను చూసి '​కన్నాలు ' అనుకొంది. ఎదురు తిరిగితే ఏమవుతుందో?​ తాను ప్రాణాలతో ఉంటుందో లేదో?​..అని భయపడింది. కిక్కురుమనకుండా నరసయ్య కొట్టిన దెబ్బలు తింది.
 +
 +     "​ ఇంటికి ​  ​పద ! నీ పని చెబుతా!"​ అన్నాడు నరసయ్య.పులిని ఈడ్చుకుంటూ ముందుకు కదిలాడు.చేసేదిలేక పులి నరసయ్య వెంట నడిచింది.
 +   ​నరసయ్య పులిని ఇంటికి ​ తీసుకొచ్చాడు.గాడిదను కట్టే గుంజకు దాన్ని కట్టేసాడు.తర్వాత లోపలికి పోయి - మత్తుగా పడుకున్నాడు. .
 +
 +    తెల్లవారింది.
 +
 +  నరసయ్య ఇంటి ముందు పులి కట్టేసి ఉంది! ఊరి జనమంతా చూశారు!
 +
 +  "​ఓహో!నరసయ్య ఎంత గొప్పవాడు! పులిని తెచ్చి ఇంటి ముందు కట్టేశాడు. ఎంత గొప్పవీరుడు! ఇలాంటి వీరుడు లోకంలో ఎక్కడా ఉండడు"​.అనుకున్నారు జనం.
 +
 +  ఈ వార్త పక్క ఊరివారికి తెలిసింది. అలా అలా అన్ని ఊళ్లకూ పాకింది. కొద్ది రోజుల్లోనే దేశమంతా తెలిసిపోయింది.
 +
 +  "​వీరుడంటే అలా ఉండాలి! కుమ్మరి నరసయ్యను మించిన వీరుడు ఈ భూమండలం మీద లేడు"​. అని అందరూ అనుకోసాగారు.
 +
 +  ఒకనాడు ఆ దేశపు రాజుగారికి పెద్ద కష్టం వచ్చి పడింది.
 +
 +  ఆయనకు పొరుగురాజుతో పగ ఉంది. ఇప్పుడు ఆ పొరుగురాజు యుద్ధానికి వచ్చాడు. పొరుగురాజు ఈయన కంటే బలవంతుడు. పెద్ద సైన్యం ఉంది. ఏనుగులు,​గుర్రాలు దండిగా ఉన్నాయి.
 +
 +    ఈ రాజుగారికి అంత సైన్యం లేదు. పగరాజుకి ఉన్నన్ని గుర్రాలు,​ ఏనుగులు లేవు.ఉన్న సైన్యంతోనే యుద్దం చెయ్యవచ్చు. అయితే వారిని నడిపించే నాయకుడు లేడు.సేనాపతి మొన్ననే చనిపోయాడు.ఇప్పుడు ఏం చెయ్యాలి?​... రాజుగారికి దిక్కు తోచలేదు.
 +
 +    "​ఏం చెయ్యాలో చెప్పండి"​.అని మంత్రులని అడిగాడు రాజు.
 +
 +"​పత్తికొండలో కుమ్మరి నరసయ్య అనే ఒక మహావీరుడు ఉన్నాడు. అతను పెద్దపులిని కుక్కపిల్ల్లలా ఇంటి ముందు కట్టేశాడట! అంతటి గొప్పవీరుడు. అతడ్ని తెచ్చి సేనాపతిని చేద్దాం. యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం"​. అన్నాడు ఒక మంత్రి.
 +
 +   ఈ సలహా అందరికీ నచ్చింది. ఇకనేం! వెంటనే..."​కుమ్మరి నరసయ్యను తీసుకురండి!"​ అన్నారు రాజుగారు.
 +
 +సేవకులు పరిగెత్తారు.
 +
 + ​పొద్దుగూకే లోపు నరసయ్యను తీసుకొచ్చారు. రాజుగారు స్వయంగా స్వాగతం చెప్పారు. మంచి విందు ఇచ్చారు.
 +
 +  "ఈ రోజు నుంచి నువ్వు మా సేనాపతివి! మా సైన్యాన్ని ​ తీసుకొని - పగరాజు మీద యుద్దం చెయ్యి!"​ అన్నారు రాజుగారు.
 +  నరసయ్య అదిరిపడ్డాడు! ​
 +
 +ఏమిటి! యుద్దం చెయ్యాలా! సైన్యాన్ని నడిపించాలా!...
 +
 +తనకు కనీసం కత్తి పట్టుకోవడం కూడా రాదే!... అలాంటిది తను యుద్దం ఎలా చేస్తాడు?​ కాదనడానికి వీలులేదు. రాజుగారు వెంటనే తల నరికేస్తారు. ఇప్పుడు ఏమిటి దిక్కు?​ నరసయ్యకు కాళ్ళూ చేతులూ ఆడలేదు.
 +     ​పాపం నరసయ్యకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. బాగా ఆలోచించాడు.చివరకు... తెల్లారగానే పారిపోవాలి అనుకున్నాడు.
 +
 +   ​తెల్లవారబోతుండగా నరసయ్య లేచాడు.పిల్లిలాగా అడుగులేస్తూ గుర్రపు శాలలోకి వెళ్ళాడు.అక్కడ చాలా గుర్రాలు ఉన్నాయి. అందులో ఒక నల్లగుర్రం కూడా ఉంది.దాని మీద జీను వేసి ఉంది.ఎవరో స్వారీ కోసం దాన్ని సిద్దం చేసుకున్నారు. నరసయ్య తిన్నగా దాని దగ్గరకు వెళ్ళాడు. ​
 +
 +అతనికి గుర్రం సవారీ ఎలా చెయ్యలో తెలీదు.ఎలాగో తంటాలు పడి గుర్రం ఎక్కాడు. ఎక్కిన తర్వాత కాలు ఒక పట్టీలో ఇరుక్కుంది. దాన్ని తీయాలని చూశాడు.రాలేదు.ఇంతలో గుర్రం ముందుకు ఉరికింది.
 +
 +  గుర్రం రయ్యిన దూసుకుపోయింది. కోట దాటింది.నగరం దాటింది. నరసయ్యకు భయం వేసింది.
 +
 +   ​అల్లంత దూరంలో గుడారాలు కనిపించాయి!పగరాజు సైనికుల గుడారాలు!... నరసయ్యకు గుండె ఆగినంత పనయ్యింది.
 +    ​
 +
 +"​ఓరి నాయనోయ్! ఇది నన్ను పగవాళ్ల మధ్యకు తీసుకుపోతోంది దేవుడోయ్!"​ అని గుండెలు బాదుకున్నాదు.
 +
 +   ​గుర్రాన్ని ఆపాలని ఎన్నో తంటాలు పడ్డాడు. ఏం చేసినా అది ఆగలేదు. కిందకు దూకేయాలని అనుకున్నాడు. అయితే కాలు ఇరుక్కుపోయి ఉంది. ఇక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యలి. లేకుంటే ప్రాణాలు దక్కవు - అనుకున్నాడు నరసయ్య.
 +
 +ఇంతలో అతనికి ఒక జామచెట్టు కనిపించిది. గుర్రం దాని పక్కనుంచి పోతుంది. ఇంకేం. గట్టిగా చెట్టును పట్టుకున్నాడు. తన బలమంతా కూడదీసి పట్టుకున్నాడు.అలా చేస్తే గుర్రం చచ్చినట్టు ఆగుతుంది అనుకున్నడు.అయితే అతను అనుకున్నట్లు జరగలేదు. జామచేట్టు వేళ్ళతో పాటు ఊడి వచ్చింది!
 +
 +గుర్రం పోతూనే ఉంది.ఇప్పుడు గుర్రం మీద నరసయ్య! నరసయ్య చేతిలో జామచెట్టు!
 +
 +పగరాజు సైనికులు అప్పుడే నిద్ర లేస్తున్నారు. వాళ్లు నరసయ్య రావడం చూశారు. నరసయ్య సంగతి అంతకు ముందే వాళ్లకి తెలుసు. ఇప్పుడు చికటిలో జామచెట్టు ఊడబీకడం చూసారు. అంతే!వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి.
 +
 +"​పారిపోండి!పారిపోండి!కుమ్మరి నర్సయ్య వస్తున్నాడు! మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు."​ అని అరుస్తూ పరిగెత్తారు.
 +
 + ​గలాభా మొదలయ్యింది. పగరాజు సైనికులు అడ్డదిడ్డంగా పరిగెత్తారు.నిద్ర లేచినవాళ్లు లేచినట్లే పరిగెత్తారు. దాంతో గుర్రాలు,​ఏనుగులు బెదిరిపోయాయి. అవి కూడా అడ్డదిడ్డంగా పరిగెత్తసాగాయి. దాంతో గలాభా ఇంకా పెద్దదయింది.
 +
 + ​“ఆగండి! పారిపోకండి! యుద్దం చేయ్యండి!"​ అని పగరాజు పెద్దగా అరిచాడు. ఆయన మాటల్ని ఎవ్వరూ వినలేదు. చూస్తూ ఉండగానే అందరూ పారిపోయారు. పాపం.పగరాజు ఇంకేం చెస్తాడు?​ ఆయన కూడా గుర్రం ఎక్కి పారిపోయాడు.
 +
 +గుర్రం ఆగింది.
 +
 + "​హమ్మయ్య!"​ అనుకున్నాడు నరసయ్య. చేతిలో ఉన్న చెట్టు పడేసాడు. పట్టీలో ఇరుక్కున్న కాలుని పైకి తీసాడు.
 +కిందకు దిగి,​ పారిపోవాలని అనుకున్నాడు.
 +
 + ​ఇంతలో రాజుగారి సైనికులు అక్కడికి చేరుకున్నారు. జరిగింది వాళ్లు కూడా చూశారు.
 +
 +"​నరసయ్యకు జై! కుమ్మరి నరసయ్యకు జై! మహవీరుడు కుమ్మరి నరసయ్యకు జై!!"​
 + ​అని అందరు అరిచారు.
 +
 +నరసయ్యను ఊరేగిస్తూ రాజు దగ్గరకు తీసుకెళ్ళారు.
 +
 +పగరాజు పారిపోయాడని తెలిసి రాజు గారు సంతోషించారు.ఆయన సంతోషం ఇంతా అంతా కాదు.
 +
 +నరసయ్యకు గొప్పగా సన్మానం చేశారు. దండిగా డబ్బు,​ బంగారం ఇచ్చి ఊరికి పంపించారు.
 +
  
కుమ్మరి_నరసయ్య.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)