User Tools

Site Tools


ఇదీ_లోకం

This is an old revision of the document!


			పాముపగ

నా పసితనంలో ఒక సంగతి జరిగింది. మేము అయిదారు మందిమి ఆడుకోవడానికి బయలు దేరాం. పొలాలలో చాలా దూరం పోయాం.

ఒక చేను కంపలో ఒక పాము కనపడింది. పాము పాము అంటూ అంతా అరిచాం. తలా ఒక రాయి దానిపైకి విసిరాం. వాటిలో నా రాయి దానికి తగిలింది. అది పారిపోయింది.
అది నాగుపాము. నీమీద పగ పడుతుంది. మన మాటలలో అది నీపేరు కూడా వినింది. పగ తీరేదాకా ఆహారం తాకదు. అంటూ అందరూ బెదిరించారు.
నేను బెదిరి పోయాను. ఆనాటి నుంచి నాకు కలలో పాములు కనిపించేవి. పాము పేరు చెపితే చెమట పోసేధి. పాము కధలంటే నేను పారిపోయే వాడిని.
కాలం గడిచింది. ఇంత వాడిని అయినాను. నాకు ఏమి కాలేదు. కాని ఆనాటి భయం వలన ఈ నాటికీ కలలోపాములు కనబడుతుంటాయి.
పాముల గురించి చాలా సంగతులు చదివాను. పాముకు మనిషి అంటే భయం. కనపడితే ఆమడ దూరం పారిపోతుంది.
పాము పగలో నిజం లేదు. దాని కంత తెలివి లేదు. ఈ సంగతులు తెలిసాయి.
అనవసరంగా ఎంత నరకం అనుభవించానో చూడండి.
				బడిలో శవం

అవి నేను మూడో తరగతి చదివే రోజులు. అంటే నాకు ఎనిమిదో ఏడు. బడికి పోదామని బయలు దేరాను. దారిలో నలుగురం కూడాము.

బడి చేరగానే టకీమని ఆగిపోయాము. మా బడి వరండాలో ఒకటే ఏడుపులు. అరుపులు. అంతా గొడవగా వుంది.
అసలు సంగతి ఏమంటే ఎవరో చనిపోయారు. అతనికి ఏధో రోగమట. టవునుకు తీసుకొనిపోతే చని పోయాడట.
వారం మంచిది కాదట. శవం ఇంటిలో వుండకూడదట. అందుకని బడి వరండాలో వుంచారు.
ఇంక ఏముంది? ఆ రోజు బడికి సెలవు. అందరం ఆడుకోడానికి పోయాము. ఆరోజంతా మాకు ఏవేవో ఆలోచనలు మెదిలాయి.
శవం ఇంటిలో వుంచడం మంచిది కాదుగదా? బడిలో వుంచడం ఎలా అవుతుంది?
ఏ జంతువు చనిపోయినా భయపడం గదా? మనిషి శవం అంటే భయం దేనికి?
బడి అందరికీ గుడి గదా! బడి అంటే అంత లోకువ దేనికీ?
వీటికి జవాబులు మాకు దోరకలేదు. మీరు చెపుతారా?
				చదవాలని వుంటే

మాకు రెండు మేకలు వుండేవి. వాటిని నేను కాచే వాడిని. రోజూ మేకలు తోలుకొని పొలం పోయేవాడిని.

పొలానికి పోవాలంటే బడి మీదగా పోవాలి. పోతూ పోతూ బడి కిటికీలోంచి చూచేవాడిని.
నావయసు వారాంతా బడిలో వుండేవారు. వారు చదవడం వినబడేద. రాయడం కనబడేది.
చదువు కొంటే ఎంత బాగుండు అని నాకు అనిపించేది. చదువుకోవాలని కోరికగా వుండేది.
ఏమి చెసేది? నేను బడికి పోతే మేకలు కాసేది ఎవరు?
ఒక రోజు అనుకోని సంగతి జరిగింది. ఊరిబయట నాకు మా వూరి టీచరు కనిపించాడు. చేతిసైగ చేసి పిలిచాడు నేనుపోయాను.
బడి కిటికీలోంచి తొంగి చూసేది నివేనా! అని అడిగాడు.
నాకు జంకు వేసింద. చదువు కోవాలని వుందా? అని అడిగాడు. అవునని తలవూపాను.
నీవు తెలివిగలవాడివి. రోజూ సాయంకాలం మా ఇంటికిరా! చదువు చెపుతా అని పిలిచాడు.
నాకు జంకు తీరింది. సంబరం కలిగింది. ఆరోజు నుంచి టీచరు ఇంటికి పోసాగాను. కొందరు ఎగతాళి చేసారు. కొందరు వెనకకు లాగారు. అయినా నేను మానుకోలేదు.
6 నెలలు గడిచాయి. ఇపుడు నేను రెండో తరగతి వాచకం చదవగలను. ఏ పదం అయినా రాయగలను.
చదువుకోవడం ఎంత తేలికో ఇపుడు నాకు తెలిసింది.
				రౌడీ కోతి
అవి నేను మూడో తరగతి చదివే రోజులు. మా ఊరిలో ఒక కోతి వుండేది.
అది ఎవరి ఇంటిలో అయినా దూరేది. దొరికింది తినేది . తినగా మిగిలింది పాడుచేసేది. పారబోసేది. చేతికి దొరికింది తీసుకొని పోయేది. ఎవరి మీదకి అయినా దూకేది.
ఈ కోతి అందరికీ బెడదగా మారింది. దీనిని అందరూ చీదరించు కొనేవారు. కోపగించు కొనేవారు. తరిమేవారు. ఈ పీడ ఎపుడు విరగడ అవుతుంది అనుకొనేవారు.
ఒకసారి ఆ కోతి మా అరుగు మీదకి దూకింద. ఆడుకొనే మా పాపను కిందకి తోసింది. మా పాప తలకు బాగా గాయం తగిలింది.
మా నాయన కోపంతో మండిపోయాడు. వాటమైన రాయి విసిరాడు. కోతి తలకు ఆ రాయి తగిలింది. అది పడిపోయింది. చనిపోయింది.
పదిమంది గుమికూడారు. తలా ఒకమాట మాటాడారు.
కోతిని చంపడం మహాపాపం అనింది ఒకామె.దినిని సమాధి చేయాలి అని ఒకాయన లేచాడు.
అందరూ కలిసి ఒక చోట దానిని సమాధి చేసారు. మరునాడు పాలు పోసారు. కొందరు దాని సమాధికి పూజలు కూడా చేయసాగారు.
మా పాప గాయానికి ఆకోతే కారణం. ఇది అందరినీ ఏడిపించింది. అందరూ దీనిని చీదరించుకొనిన వారే. ఇలాంటి కోతికి పూజలు దేనికి?
దీనికి జవాబు నాకు దొరకలేదు. మీరు చెపుతారా?

పసిపాప ధర

				పసిపాప ధర

నిజం వినడానికి బాగుండదు. చదవడానికి గూడా బాగుండదు. అయినా నిజం నిజమే.

జోలంగీరు అనే ఊరిలో వానలు లేవు. పంటలు లేవు. పాపం గిరిజనులకు పనిలేదు. కూలి లేదు. కాలే కడుపుకు చారెడు గంజిలేదు.
కొందరు వలస పోయారు.కొందరు ఆకలితో చనిపోయారు. కొందరు ఆకులు వుడకేసుకుని తినసాగారు. దీంతో ఆకలి తీరుతుందా?
ఒకామెకు పసికందు భారమైంది. తాను సాకలేదు. ఏమి చేయాలి 20 రూపాయలకు ధారబోసింది. ఆ పాపకు ఎనిమిది నెలలు.
చూడండి! ఆకలి ఎంత నరకమో!ఇలా జరగవలసిందేనా? దీనికి అంతం లేదా? ఆలోచించండి.
ఇదీ_లోకం.1321722542.txt.gz · Last modified: 2018/03/24 11:13 (external edit)