User Tools

Site Tools


ఇదీ_లోకం

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

ఇదీ_లోకం [2011/11/19 17:09]
bhuvan created
ఇదీ_లోకం [2018/03/24 11:13]
Line 1: Line 1:
- పాముపగ 
  
- 
-నా పసితనంలో ఒక సంగతి జరిగింది. మేము అయిదారు మందిమి ఆడుకోవడానికి బయలు దేరాం. పొలాలలో చాలా దూరం పోయాం. 
- ఒక చేను కంపలో ఒక పాము కనపడింది. పాము పాము అంటూ అంతా అరిచాం. తలా ఒక రాయి దానిపైకి విసిరాం. వాటిలో నా రాయి దానికి తగిలింది. అది పారిపోయింది. 
- అది నాగుపాము. నీమీద పగ పడుతుంది. మన మాటలలో అది నీపేరు కూడా వినింది. పగ తీరేదాకా ఆహారం తాకదు. అంటూ అందరూ బెదిరించారు. 
- నేను బెదిరి పోయాను. ఆనాటి నుంచి నాకు కలలో పాములు కనిపించేవి. పాము పేరు చెపితే చెమట పోసేధి. పాము కధలంటే నేను పారిపోయే వాడిని. 
- కాలం గడిచింది. ఇంత వాడిని అయినాను. నాకు ఏమి కాలేదు. కాని ఆనాటి భయం వలన ఈ నాటికీ కలలోపాములు కనబడుతుంటాయి. 
- పాముల గురించి చాలా సంగతులు చదివాను. పాముకు మనిషి అంటే భయం. కనపడితే ఆమడ దూరం పారిపోతుంది. 
- పాము పగలో నిజం లేదు. దాని కంత తెలివి లేదు. ఈ సంగతులు తెలిసాయి. 
- అనవసరంగా ఎంత నరకం అనుభవించానో చూడండి. 
- 
- 
- బడిలో శవం 
- 
-అవి నేను మూడో తరగతి చదివే రోజులు. అంటే నాకు ఎనిమిదో ఏడు. బడికి పోదామని బయలు దేరాను. దారిలో నలుగురం కూడాము. 
- బడి చేరగానే టకీమని ఆగిపోయాము. మా బడి వరండాలో ఒకటే ఏడుపులు. అరుపులు. అంతా గొడవగా వుంది. 
- అసలు సంగతి ఏమంటే ఎవరో చనిపోయారు. అతనికి ఏధో రోగమట. టవునుకు తీసుకొనిపోతే చని పోయాడట. 
- వారం మంచిది కాదట. శవం ఇంటిలో వుండకూడదట. అందుకని బడి వరండాలో వుంచారు. 
- ఇంక ఏముంది?​ ఆ రోజు బడికి సెలవు. అందరం ఆడుకోడానికి పోయాము. ఆరోజంతా మాకు ఏవేవో ఆలోచనలు మెదిలాయి. 
- శవం ఇంటిలో వుంచడం మంచిది కాదుగదా?​ బడిలో వుంచడం ఎలా అవుతుంది?​ 
- ఏ జంతువు చనిపోయినా భయపడం గదా? మనిషి శవం అంటే భయం దేనికి?​ 
- బడి అందరికీ గుడి గదా! బడి అంటే అంత లోకువ దేనికీ?​ 
- వీటికి జవాబులు మాకు దోరకలేదు. మీరు చెపుతారా?​ 
- 
- 
-  
- 
- 
- 
- 
- 
- 
- 
- 
- 
- 
- 
- 
- చదవాలని వుంటే 
- 
-మాకు రెండు మేకలు వుండేవి. వాటిని నేను కాచే వాడిని. రోజూ మేకలు తోలుకొని పొలం పోయేవాడిని. 
- పొలానికి పోవాలంటే బడి మీదగా పోవాలి. పోతూ పోతూ బడి కిటికీలోంచి చూచేవాడిని. 
- నావయసు వారాంతా బడిలో వుండేవారు. వారు చదవడం వినబడేద. రాయడం కనబడేది. 
- చదువు కొంటే ఎంత బాగుండు అని నాకు అనిపించేది. చదువుకోవాలని కోరికగా వుండేది. 
- ఏమి చెసేది?​ నేను బడికి పోతే మేకలు కాసేది ఎవరు?​ 
- ఒక రోజు అనుకోని సంగతి జరిగింది. ఊరిబయట నాకు మా వూరి టీచరు కనిపించాడు. చేతిసైగ చేసి పిలిచాడు నేనుపోయాను. 
- బడి కిటికీలోంచి తొంగి చూసేది నివేనా! అని అడిగాడు. 
- నాకు జంకు వేసింద. చదువు కోవాలని వుందా?​ అని అడిగాడు. అవునని తలవూపాను. 
- నీవు తెలివిగలవాడివి. రోజూ సాయంకాలం మా ఇంటికిరా! చదువు చెపుతా అని పిలిచాడు. 
- నాకు జంకు తీరింది. సంబరం కలిగింది. ఆరోజు నుంచి టీచరు ఇంటికి పోసాగాను. కొందరు ఎగతాళి చేసారు. కొందరు వెనకకు లాగారు. అయినా నేను మానుకోలేదు. 
- 6 నెలలు గడిచాయి. ఇపుడు నేను రెండో తరగతి వాచకం చదవగలను. ఏ పదం అయినా రాయగలను. 
- చదువుకోవడం ఎంత తేలికో ఇపుడు నాకు తెలిసింది. 
- 
- 
- రౌడీ కోతి 
- 
- అవి నేను మూడో తరగతి చదివే రోజులు. మా ఊరిలో ఒక కోతి వుండేది. 
- అది ఎవరి ఇంటిలో అయినా దూరేది. దొరికింది తినేది . తినగా మిగిలింది పాడుచేసేది. పారబోసేది. చేతికి దొరికింది తీసుకొని పోయేది. ఎవరి మీదకి అయినా దూకేది. 
- ఈ కోతి అందరికీ బెడదగా మారింది. దీనిని అందరూ చీదరించు కొనేవారు. కోపగించు కొనేవారు. తరిమేవారు. ఈ పీడ ఎపుడు విరగడ అవుతుంది అనుకొనేవారు. 
- ఒకసారి ఆ కోతి మా అరుగు మీదకి దూకింద. ఆడుకొనే మా పాపను కిందకి తోసింది. మా పాప తలకు బాగా గాయం తగిలింది. 
- మా నాయన కోపంతో మండిపోయాడు. వాటమైన రాయి విసిరాడు. కోతి తలకు ఆ రాయి తగిలింది. అది పడిపోయింది. చనిపోయింది. 
- పదిమంది గుమికూడారు. తలా ఒకమాట మాటాడారు. 
- కోతిని చంపడం మహాపాపం అనింది ఒకామె.దినిని సమాధి చేయాలి అని ఒకాయన లేచాడు. 
- అందరూ కలిసి ఒక చోట దానిని సమాధి చేసారు. మరునాడు పాలు పోసారు. కొందరు దాని సమాధికి పూజలు కూడా చేయసాగారు. 
- మా పాప గాయానికి ఆకోతే కారణం. ఇది అందరినీ ఏడిపించింది. అందరూ దీనిని చీదరించుకొనిన వారే. ఇలాంటి కోతికి పూజలు దేనికి?​ 
- దీనికి జవాబు నాకు దొరకలేదు. మీరు చెపుతారా?​ 
- 
- 
- 
- 
- 
- 
- 
- 
-పసిపాప ధర 
- 
- 
- 
- 
- 
- పసిపాప ధర 
- 
-నిజం వినడానికి బాగుండదు. చదవడానికి గూడా బాగుండదు. అయినా నిజం నిజమే. 
- జోలంగీరు అనే ఊరిలో వానలు లేవు. పంటలు లేవు. పాపం గిరిజనులకు పనిలేదు. కూలి లేదు. కాలే కడుపుకు చారెడు గంజిలేదు. 
- కొందరు వలస పోయారు.కొందరు ఆకలితో చనిపోయారు. కొందరు ఆకులు వుడకేసుకుని తినసాగారు. దీంతో ఆకలి తీరుతుందా?​ 
- ఒకామెకు పసికందు భారమైంది. తాను సాకలేదు. ఏమి చేయాలి 20 రూపాయలకు ధారబోసింది. ఆ పాపకు ఎనిమిది నెలలు. 
- చూడండి! ఆకలి ఎంత నరకమో!ఇలా జరగవలసిందేనా?​ దీనికి అంతం లేదా?​ ఆలోచించండి. 
ఇదీ_లోకం.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)