User Tools

Site Tools


ఆనందం_ఆదాయం

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

ఆనందం_ఆదాయం [2018/03/24 11:13]
ఆనందం_ఆదాయం [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                       ​ ఆనందం ఆదాయం
  
 +      మనకు చాలా ఆలోచనలు ఉంటాయి. ఏదో చేయాలని అనుకుంటాం. అది అందుబాటులో ఉండదు. ​    
 +అందరికి అందుబాటులోనిది పెరటి తోటల పెంపకం.మనసు ఉంటే ఇది చాలా సులభం.ఆదాయం,​అనందం కూడా.
 +                                                                        మునగ,​ కరివేపాకు,​ సీతాఫలం,​ జామ అందరూ పెంచగలవి. వీటిని వేసే ముందు మంచి జాతి మొలకలు ఎంచుకోవాలి. అరటి కూడా సులభంగా బతుకుతుంది.
 +      నాలుగు కూరపాదులు వేసుకోలేమా?​ వంగ, టమేటా మొలకలు బాగా పెరుగుటాయి. ​
 +      బెండ తొందరగా పెరుగుతుంది. బీర, కాకర తీగలయితే పైకి పాకుతాయి,​ దొండ రెండో ఏడు కూడా ఉంటుంది. ​
 +      ఆకు కూరలు రోజూ తినగలిగినా మంచిదే. పాలజకూర,​ గోంగూర,​ తోటకూర,​ కొతిమేర,​ పుదీనా బాగా పెరుగుతాయి. ​
 +      ఆకు కూరలు,​ కూరగాయలు నవనవలాడు తుంటాయి. మనం పండించినవే మనం తినడం ఎంతో ఆనందం. ఎంతో ఆదాయం.
 +
 +
 +   ​ బొప్పాయి గొప్పతనం
 +
 +        బొప్పాయి సులభంగా పెరిగే చెట్టు. దీనికి పెద్ద చోటు అవసరం లేదు. ఇంటి ముందు పెంచుకోవచ్చు.
 +    ఇది ఆరు నెలల లోపే కాపుకు వచ్చే చెట్టు. చెట్టు నిండా కాయలుంటాయి. వారానికి ఒక పండు తప్పకుండా పండుతుంది.
 +    బొప్పాయి పండు తినడానికి రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కాయలతో కూరలు వండు కోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు.
 +    బొప్పాయి కాయ, గింజలు,​ పాలు చాలా జబ్బులు పోగొడతాయి.
 +    కంటి జబ్బులకు బొప్పాయి పండు మంచి మందు. బొప్పాయి తింటే రేజీకటి దగ్గరకు రాలేదు.
 +      ఆడవాళ్ళు కడుపుతో వుంటే బొప్పాయి తినగూడదంటారు. ఇది నిజంగాదు. పైగా బిడ్డకు ఎంతో మంచిది.
 +మల బద్దజకానికి బొప్పాయి పాలు,​ నీళ్ళు,​ తేనె కలిపి తాగండి. కడుపులో పురుగులు కూడా చచ్చిపోతాయి.
 +బొప్పాయి గింజలు నూరి పాలలో కలిపి తాగండి. ఏలిక పాములు పడి పోతాయి.
 +బొప్పాయి కాయ లోపలిగుజ్జు రోజూ పూ యండి. కురుపులు మాడి పోతాయి.
 + ​చూడండి! బొప్పాయి ఎంత గొప్పదో!
 +
 +
 +
 +          మునగ మాలచ్చిమి
 +
 +         ​ఇంటి ముందు మునగ,​ కుండలో కూర అంటారు ​ పెద్దలు. ఒక మునగచెట్టు ఉంటే చాలు. కూరకోసం వెతికేపని ఉండదు. మునగ చేసే మనలో చాలామందికి తెలియదు.
 +         ​మునగకాయలు రుచికి రుచి. ఆదాయానికి ఆదాయం. మునగాకు కూర కళ్ళకు ఎంతో మంచిది. పూత కూడ కూరలో వేసుకోవచ్చు.
 +         ​మునగలు చాలారకాలు. వీటిలో బెంగుళూరు రకం చాలా మంచిది. కాయలావుగా పొడవుగా వుంటుంది. లోపల గుజ్జు బాగా ఉంటుంది. ముదిరినా తగ్గని రుచి దీనిది. మంచి రకం మునగ ఏడాదిలో కాపుపడుతుంది.
 +        మునగ కాచేది కాయలుకాదు రూపాయలే.
 +
 +
 +    పాల దిగుబడి పెరగాలంటే
 +         
 +            మనం చాలా మందిమి పాడి మీద బతికే వాళ్ళం. పాలు దిగుబడి పెరిగితే మన ఆదాయం పెరుగుతుంది. మెళకువగా పాడి చేసుకుంటే దిగుబడి బాగా పెంచుకోవచ్చు.
 +            పచ్చి గడ్డి మేత వేసేటప్పుడు కుంది వేయాలి. దీని వలన అర లీటరు పాలు దిగుబడి పెరుగుతుంది.
 +            పశువును బాగా కడగాలి. కొట్టంలో పేడ, ఈగలు,​ దోమలు లేకుండా చూచుకోవాలి.
 +            పాలిచ్చేటాప్పుడు గొడ్డును భయ పెట్టగూడదు. అది సంతోషంగా ఉండాలి. దీని వలన కూడా పాల దిగుబడి పెరుగుతుంది.
 +            దూడకు మొదట పాలు తాపాలి. తరువాత పాలు పిండాలి. చివరి పాలు దూడకు వదల కూడదు.
 +            పాలు రోజూ ఒకే సమయంలో పిండాలి.
 +            తొందర తొందరగా పిండాలి. అప్పుడప్పుడు మాని వేయ గూడదు.
 +            పశువు జబ్బుతో ఉంటేపాలు పిండగూడదు.
 +
 +
 +        అరటి చెట్టు
 +
 +             ​అరటి సులభంగా పెరిగే చెట్టు. దీనికి కొద్ది చోటు చాలు. ఇంటిలో ఒక పిలక నాటు కుంటే చాలు. ఏళ్ళ తరబడి వుంటుంది.
 +             ​అరటి చెట్టు చుట్టూ పిలకలు పెరుగుతుంటాయి. ఒకటి రెండు పిలకలు వుంచి మిగిలిన వాటిని తీసి వేయాలి. గెల కోసిన తరువాత చెట్టును నరికి వేయాలి.
 +             ​వీటిలో పచ్చరటి తొందరగా కాపుకు వచ్చే రకం. ఈ చెట్టు పొట్టిగా వుంటుంది. దీని గెలకు. డెబ్బై ఎనభ్భై దాకా కాయలు వుంటాయి.
 +             ​అరటికి పచ్చి పేడ మంచి ఎరువు. పూతకు వచ్చినప్పుడు యూరియా వాడడం మంచిది. పెద్దగెల దిగుతుంది. కాయ సైజు పెరుగుతుంది.
 +             ​అరటికి తడి ఆరకుండా నీరు వుండాలి. మనం వాడిన నీళ్ళు చెట్టుకు పారేటట్టు చేసుకుంటే చాలు.
 +             ఈ సంగతి మీకు తెలుసా
 +             ​మూడు ఆపిలు పళ్ళలో వుండే బలం ఒక అరటి పండులో వుంది.
 +
 +
 +    కొబ్బరి చెట్టు
 +
 +             ​అదనంగా సంపాదించాలని అందరికీ వుంటుంది. ఏదో చేయాలను కొంటాం. కాని అందుబాటులో వుండే పనులు మనకు కనబడవు.
 +             ​ఇంటి ముందు కొంచెమయినా చోటు వుంటుంది. కూరగాయలు పండించలేం. కాని రెండు కొబ్బరి మొలకలు నాటుకో వచ్చుగదా!
 +             ​చెట్ట్టు పెరిగి పైకి పోతుంది. మనకు అడ్డంరాదు. ఆదాయంలో దీనికి మించింది లేదు.
 +             ​కొబ్బరిలో సంకరజాతివి నాటుకొంటే మంచిది. తొందరగా కాపు పడతాయి.
 +             ​కొబ్బరి చెట్టు బాగా కాయాలంటే నీళ్ళు బాగా వుండాలి. చెట్టు మొదట తడి ఆరకుండా చూచుకోవాలి.
 +             ​మనం వాడుకునే నీళ్ళు చెట్టుకు అందేటట్టు చేసుకుంటే చాలు. దీనికొక ఉపాయం వుంది.
 +
 +             ​చెట్టుకూ చెట్టుకూ నడుమా ఒక గుంట తీయాలి. గుంటను ఒక బండతో కప్పివేయాలి. మనం వాడిన నీళ్ళు ఈ గుంటలో పడేటట్టు చేయాలి.
 +             ​ఎండాకాలం గూడా గుంటలో తడి ఆరదు.చెట్టు తొందరగా పెరుగుంది. చెట్టుమొదట కూరలు,​ ఊరగాయల వంటివి పడవేయకూడదు.
 +             ​ఒక కొబ్బరి చెట్టు సుమారుగా కాపు పడితే అయిదు వందల రూపాయల వరకు ఆదాయం వుంటుంది. ఇంతకంటే సులభమైన సంపాదన వుంటుందా!
 +             ​రెండు కొబ్బరి మొలకలు నాటండి చాలు!
 +
 +
 +                    ​
 +                       
ఆనందం_ఆదాయం.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)